‘‘కారు కింద యువతి చిక్కుకుందని.. కారులో ఉన్న వాళ్లకి తెలుసు - కానీ కావాలనే ఈడ్చుకెళ్లారు’’: మృతురాలి స్నేహితురాలు

నిధి

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, చనిపోయిన యువతి స్నేహితురాలిగా చెప్తున్న నిధి మీడియాతో మాట్లాడారు

కాంఝావాలా కారు ఘటన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కారు కింద చిక్కుకుని, 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లగా చనిపోయిన యువతి అంజలికి స్నేహితురాలని, ప్రత్యక్ష సాక్షి అని పోలీసులు చెప్తున్న నిధి అనే యువతి మంగళవారం మీడియాతో మాట్లాడారు.

కారు తమ స్కూటీని ఢీకొట్టినపుడు అంజలి స్కూటీని నడుపుతుండగా, తాను వెనుక సీట్లో కూర్చుని ఉన్నానని ఆమె చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

‘‘కారు మమ్మల్ని ఢీకొన్న తర్వాత నేను ఒక వైపుకు పడిపోయాను. నా ఫ్రెండ్ కారు కింద ఇరుక్కుపోయింది. ఆమె కారు కింద ఇరుక్కుపోయిందని కారులో ఉన్న వాళ్లకి తెలుసు. అయినా వాళ్లు కావాలనే ఆమెను ఈడ్చుకుంటూ వెళ్లారు’’ అని నిధి పేర్కొన్నారు.

దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే.. చనిపోయిన అంజలి ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నారని, అయినా స్కూటీ తానే నడుపుతానని పట్టుబట్టారని నిధి చెప్పారు.

ఆమె ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘ఆమె మద్యం మత్తులో ఉంది. కానీ స్కూటీ తానే నడుపుతానని పట్టుబట్టింది. కారు ఢీకొన్న తర్వాత ఆమె కారు కింద పడిపోయింది. కారు ఆమెను ఈడ్చుకెళ్లింది. నాకు భయం వేసి నేను ఇంటికి తిరిగి వెళ్లిపోయాను. ఎవరికీ ఏమీ చెప్పలేదు’’ అని వివరించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

‘మద్యం మత్తులో బండి నడిపింది’

‘‘మద్యం మత్తులో బండి నడపటం ఆమె తప్పు. స్కూటీ నడపవద్దని నేను ఆమెకు చాలా గట్టిగా చెప్పాను. నేను తెలివిలోనే ఉన్నాను, నేను నడుపుతాను అని చెప్పాను. ఆమె నన్ను నమ్మలేదు. తనను తాను నమ్మింది’’ అని పేర్కొన్నారు.

మృతురాలు అంజలి, ఆమె స్నేహితురాలు జనవరి 1వ తేదీ తెల్లవారటానికి ముందు రాత్రి 1:30 గంటల సమయంలో ఒక హోటల్ నుంచి బయటకు వస్తూ కనిపించిన సీసీటీవీ ఫుటేజ్‌ను దిల్లీ పోలీసులు సేకరించారు. ఆ స్నేహితురాలు నిధిగా గుర్తించారు.

చనిపోయిన అంజలి, ఆమె స్నేహితురాలు (నిధి అని పోలీసులు చెప్తున్నారు) హోటల్‌లో గొడవ పడ్డారని, ఆ తర్వాత వారిద్దరూ హోటల్ నుంచి బయటకు వచ్చి స్కూటీ మీద వెళ్లారని ఆ హోటల్ మేనేజర్ వెల్లడించారు.

‘‘వాళ్లిద్దరి మధ్యా వాగ్వాదం జరుగుతోంది. గొడవ పడొద్దని నేను వాళ్లకు చెప్పాను. వాళ్లు కిందకు వెళ్లి అక్కడ గొడవ పడటం మొదలుపెట్టారు. ఆ తర్వాత వాళ్లిద్దరూ స్కూటీ మీద వెళ్లిపోయారు’’ అని సదరు హోటల్ మేనేజర్ చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

పోలీసుల అదుపులో ఇంకొందరు యువకులు

ఆ హోటల్ దగ్గర ఈ యువతులతో కలిసి కనిపించిన కొందరు యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

ఆ హోటల్‌లో ఈ యువకులు వేరే గది బుక్ చేసుకుని ఉన్నారని, వారు సదరు యువతితో మాట్లాడటం హోటల్ సిబ్బంది చూశారని పోలీసులు పేర్కొన్నారు.

కారు ప్రమాదంలో చనిపోయిన 20 ఏళ్ల యువతి ఆ ఘటన జరిగినపుడు ఒంటరిగా లేరని, దిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ సాగర్ ప్రీత్ హూడా అంతకుముందు మీడియా సమావేశంలో చెప్పారు.

ఆ ప్రమాదం జరిగినపుడు మృతురాలితో పాటు మరో యువతి కూడా అక్కడ ఉన్నారని, అయితే ఆ ఘటన జరిగిన తర్వాత ఆమె వెళ్లిపోయారని హూడా పేర్కొన్నారు.

ఆ ఘటనకు ఆమె ప్రత్యక్ష సాక్షి అని, ఆమె పోలీసులకు సహకరిస్తున్నారని, సెక్షన్ 164 కింద ఆమె వాంగ్మూలం నమోదు చేస్తామని తెలిపారు.

అంజలి అనే 20 ఏళ్ల యువతి కొత్త సంవత్సరం వేకువ జామున దిల్లీలో ఘోర దుర్ఘటనలో చనిపోయారు. ఆమె ప్రయాణిస్తున్న కారును ఒక కారు ఢీకొనగా.. కారు కింద ఇరుక్కున్న ఆ యువతిని ఆ కారు 12 కిలోమీటర్ల పాటు ఈడ్చుకెళ్లిందని చెప్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

‘నిందితులను ఉరితీయాలి’: మృతురాలి తల్లి

ఇదిలావుంటే.. ఈ కేసులో నిందితులు ఐదుగురినీ ఉరితీయాలని మృతురాలి తల్లి డిమాండ్ చేశారు.

ఆమె ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘నిందులు ఐదుగురినీ ఉరితీయాలి. నా కూతురు అంత్యక్రియలు పూర్తి చేసినంత మాత్రాన జనం మౌనంగా ఉండరు’’ అని చెప్పారు.

మృతురాలికి పోస్ట్‌మార్టం పూర్తిచేసిన తర్వాత.. మంగళవారం సాయంత్రం పోలీసుల సమక్షంలో అంత్యక్రియలు పూర్తిచేశారు.

మృతురాలి శవపరీక్ష ప్రాధమిక నివేదికను కూడా పోలీసులు విడుదల చేశారు.

మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో ముగ్గురు సభ్యుల మెడికల్ బోర్డు మృతురాలి పోస్టుమార్టం నిర్వహించింది. 

యువతి మరణానికి కారణం 'షాక్, రక్తస్రావం' అని నివేదికలో వెల్లడించారు. తల, వెన్నెముక, ఎడమ తొడ ఎముక, కాళ్ల దిగువ ఎముకలకు గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. 

యువతిపై అత్యాచారం లేదా లైంగిక దాడి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పోస్టుమార్టం రిపోర్ట్‌లో పేర్కొన్నారు. 

"వేగంగా ఢీకొనడం వలన ఆమెకు గాయాలు అయ్యాయి. ఏదైనా వాహనం ఆమెను గుద్ది, ఈడ్చుకెళ్లి ఉండవచ్చు. లైంగిక దాడి జరిగిన ఆధారాలు లేవు. అలాటి గాయాలు ఆమె శరీరంపై లేవు" అని బోర్డు ఈ రిపోర్టులో పేర్కొంది. 

పోస్టుమార్టం తుది నివేదిక తర్వాత వస్తుందని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)