సైబర్ సెక్స్ వర్కర్: పోర్న్ ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎలా ఉండబోతోంది?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పోర్న్ ఇండస్ట్రీ

ఫొటో సోర్స్, Cybrothel

ఫొటో క్యాప్షన్, ఆర్టిఫిషియల్ ఇంటెజెన్స్‌తో సిద్ధమైన బొమ్మలు
    • రచయిత, నికోలా స్మిత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వచ్చే నెల నుంచి బెర్లిన్ ప్రజలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్స్ డాల్స్‌ను గంటసేపు బుక్ చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది.

ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్న ఈ సౌకర్యం అమల్లోకి వస్తే ప్రపంచంలో తొలి సైబర్ సెక్స్ వర్కర్ ఆమే అవుతుంది.

ఏఐ బొమ్మలతో కస్టమర్లు పరస్పరం మాటలు లేదా శారీరకంగా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది.

“మెషీన్లతో తమ పర్సనల్ విషయాలు చెప్పుకోవడానికి చాలామంది సౌకర్యవంతంగా ఫీలవుతారు. ఎందుకంటే మెషీన్లు వ్యక్తుల్ని జడ్జ్ చెయ్యలేవు” అని సైబ్రోతల్ వ్యవస్థాపకుడు ఫిలిప్ ఫ్యుసెనేజర్ చెప్పారు.

“గతంలో, మాట్లాడే బొమ్మల మీద కొంత ఆసక్తి ఉండేది. అవి కస్టమర్లతో కేవలం మాట్లాడగలిగేవి, వారి గొంతు విని స్పందించేవి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యేందుకు డిమాండ్ ఇంకా పెరిగింది." అని ఆయన అన్నారు.

అడల్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ వ్యాపారంలో ఏఐ జనరేటివ్‌ను ఉపయోగించడం అందుబాటులో ఉన్న అనేక మార్గాల్లో ఒకటి.

గూగుల్ ప్లే స్టోర్‌లో ఏఐ కంపానియన్ యాప్స్‌ డౌన్‌లోడ్లు 22.5 కోట్లకు చేరుకున్నట్లు స్ప్లిట్ మెట్రిక్స్ అంచనా వేసింది.

“యాప్ డెవలపర్లు మరింతమంది ఈ ట్రెండ్‌ను గుర్తిస్తారని నేను భావిస్తున్నాను. అందులోనూ అడల్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరీలో కొత్త ఆవిష్కరణల ద్వారా ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చు” అని స్ప్లిట్ మెట్రిక్స్ జనరల్ మేనేజర్ థామస్ క్రీబర్‌నెగ్ చెప్పారు.

‘ఏఐ కంపానియన్స్’ లాభదాయకం కావచ్చని మిషా కిరోవ్ చెప్పారు. అయితే ప్రైవసీ పరిశోధక సంస్థ మోజిల్లా ప్రైవసీని ఇందులో కలపలేదు.

“చాలా చాట్‌బాట్లు ఫీజులు వసూలు చేస్తున్నాయి. అయితే వాటికి సంబంధించిన టెక్నాలజీని ఎక్కడో డెవలప్ చేస్తున్నారు. ఇది ఎక్కువ లాభాలు వచ్చే వ్యాపారంగా కనిపిస్తోంది. దీంతోపాటు ఈ యాప్స్ యూజర్స్‌కి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తాయి. ఈ డేటాను అడ్వర్టైజర్స్ లాంటి థర్డ్ పార్టీ సంస్థలకు అమ్ముకోవచ్చు. ఇది మంచి బిజినెస్ మోడల్” అన్నారు మిషా కిరోవ్.

బీబీసీ వాట్సాప్ చానెల్
సెక్స్, పోర్న్, చాట్‌బాట్స్, ఏఐ డాల్స్

ఫొటో సోర్స్, Jason Sheldon/Junction 10 Photography

ఫొటో క్యాప్షన్, సెక్స్ చాట్‌బాట్స్‌కి శిక్షణ ఇచ్చిన డేటా సెట్స్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉందంటున్న కెర్రీ మెక్‍నెర్నే

అయితే అడల్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ వ్యాపారంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను మేళవించడం ప్రమాదకర సంకేతాలను సూచిస్తోందని కొందరు అంటున్నారు.

జనరేటివ్ ఏఐలో ఒక సమస్య వారసత్వంగా వస్తోంది. దీనికి శిక్షణ ఇచ్చిన డేటా ఆధారంగా ఇది కొత్త డేటాను ఉత్పత్తి చేస్తుంది.

శృంగారం, ఆనందం విషయంలో వేరే రకాల ఆలోచనలు సెక్స్ చాట్‌బోట్స్ ఎన్‌కోడ్ చేసే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌లో సీనియర్ రీసర్చ్ ఫెలో డాక్టర్ కెర్రీ మెక్‌నెర్నే చెప్పారు.

“సెక్స్ చాట్‌బాట్స్‌కు శిక్షణ ఇచ్చే విషయంలో ఎలాంటి డేటా సెట్టింగులు ఉపయోగిస్తాం అనే దాన్ని అర్థం చేసుకోవడం కూడా కీలకం. లేకుంటే స్త్రీ, పురుషుల సంపర్క సమయంలో సెక్స్ వల్ల మహిళలకు కలిగే లైంగిగానుభూతిని పట్టించుకోకుండా ఉండే ప్రమాదం ఉంది. దీనికి బానిసలుగా మారే ప్రమాదం ఉంది.’’ అని రైకోవ్ చెప్పారు. చాట్‌బాట్లు ఒంటరిగా ఉండేవాళ్లను, ప్రత్యేకించి పురుషుల్ని లక్ష్యంగా చేసుకుంటాయని ఆయన అన్నారు.

“మేము రివ్యూ చేసిన ఏఐ చాట్‌బాట్లలో ఎక్కువశాతం వాటికి అధిక వ్యసనం, ఇంకా తీవ్రమైన ప్రమాదాలు కనిపించాయి. ప్రత్యేకించి మానసిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నవారికి ఇవి ప్రమాదకరమైనవి.” అని ఆయన అన్నారు.

అనేక ఏఐ చాట్‌బాట్లకు మోజిల్లా కంటెంట్ వార్నింగ్‌లను జత చేసింది “ అసభ్యకరంగా ఉండే థీమ్స్, హింస, చిన్న వయసులో సంబంధాలు” లాంటివి వీటిలో కొన్ని అని రైకోవ్ చెప్పారు.

ప్రైవసీ అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. పార్ట్‌నర్‌షిప్ చాట్‌బాట్స్ “ అడ్డు అదుపులేని వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకే” డిజైన్ చేశారని అన్నారు.

మోజిల్లా సమీక్షించిన 90 శాతం యాప్స్‌ “వ్యక్తిగత సమాచారాన్ని అమ్మేయడం లేదా షేర్ చేయడం” లాంటివి చేసి ఉంటాయని రికోవ్ చెప్పారు.

అదే సమయంలో సగానికి పైగా యాప్‌లు తమ వ్యక్తిగత డేటాను డిలీట్ చేసేందుకు యూజర్లకు అనుమతి ఇవ్వవు.

అలాగే ఏఐ రియల్ వరల్డ్ సంబంధాలను ఏర్పరుచుకునే ప్రమాదం ఉందని మరికొందరు హెచ్చరిస్తున్నారు.

“ఏఐ పోర్న్ వల్ల కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. నిజ జీవితంలో శృంగార జీవితం నిరుత్సాహకరంగా ఉంటే ఏఐ పోర్న్ ద్వారా లభించే అనుభవం నిజజీవితంలో లభించే ఆనందానికి సమానంగా లేకపోవడం లాంటి సమస్యలు ఎదురుకావచ్చు” అని సీనియర్ ప్రాక్టీస్ కన్సల్టెంట్ టమరా హోటన్ చెప్పారు.

యూజర్లను ఏఐ పోర్న్ ప్రమాదకర పరిస్థితుల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందని హోటన్ చెప్పారు.

“కొంతసేపు ఊహాలోకంలో ఉండటం తప్పేమీ కాదు. కొంతమంది వ్యక్తులు తాము నటించడం లేదనే ఉద్దేశంతో ఆలోచనల ద్వారా శృంగార ప్రేరణలను పొందుతారు. ఏఐ పోర్న్‌ను ఇలాగే చూడాలి.’’ అన్నారు హోటన్.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సెక్స్ వర్కర్లను ఏఐ రీప్లేస్ చేస్తుందని కొందరి వాదన

ఏఐ వినియోగిస్తున్న సంస్థలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని అడల్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీ చెబుతోంది. అయితే ఏఐ ముఖ్య పాత్ర పోషించాలని భావిస్తోంది.

“యూజర్లకు శృంగార అనుభవాన్ని రీప్లేస్ చేయడానికి బదులుగా మరింత పెంపొందించడమే తమ కంపెనీ లక్ష్యమని లవ్‌హనీలో హెడ్‌గా పని చేస్తున్న ఫిలిప్ హ్యాంబర్గర్ చెప్పారు.

ఏఐ ఈ రంగంపై సానుకూల ప్రభావం చూపిస్తుందని ఇతరులు నమ్ముతున్నారు. బార్సిలోనాకు చెందిన క్లూ లెస్ ఏజన్సీ తొలి ఏఐ ఇన్‌ఫ్లూయెన్సర్ ఐటానా లోపెజ్‌ను తయారు చేసింది.

సెక్స్ ఇండస్ట్రీ ఎప్పుడూ ఉంటుంది. నిజమైన వ్యక్తుల్ని ఉపయోగించి సెక్సువల్ కంటెంట్ తయారు చేయలేదని నిర్ధరించుకోవడం ద్వారా నైతిక ఆందోళనలను తగ్గించడంలో ఏఐ సహాయ పడుతుందని ఆయన చెప్పారు.

“ఈ మార్పు రానున్న రోజుల్లో స్త్రీ లేదా పురుషుడుని సెక్సువల్‌గా బాధించే పరిస్థితి లేకుండా చేస్తుంది.” అన్నారు హ్యాంబర్గర్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)