తమిళనాడు: ఉత్తరాది కార్మికులపై దాడుల్లో నిజమెంత? కొన్ని మీడియా సంస్థలపై కేసులు ఎందుకు పెట్టారు?

ఉత్తరాది కార్మికులు

ఫొటో సోర్స్, Getty Images

బిహార్ నుంచి తమిళనాడుకు వలస వచ్చిన ఉత్తరాది కార్మికులపై దాడి జరిగిందని అందులో కొందరు మరణించారనే ఫేక్ న్యూస్ మార్చి 2వ తేదీన వ్యాప్తి చెందింది.

అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించి తప్పుదోవ పట్టించే వీడియోలు కూడా ట్విటర్‌లో కనిపించాయి.

హిందీ భాష వార్తాపత్రికలు కొన్ని ఈ వార్తను మొదటి పేజీలో ప్రచురించాయి.

బిహార్ నుంచి వలస వెళ్లిన కార్మికుల ప్రాణాలకు భద్రత కోసం, తమిళనాడు సహచరులతో మాట్లాడాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, డీజీపీలను ఆదేశించినట్లు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

అయితే, ఈ వార్తలు నిజం కావని ఆ తర్వాత తమిళనాడు పోలీసు అధికారులు ధ్రువీకరించారు.

వలస కూలీలపై దాడులకు సంబంధించిన వీడియోలను ట్వీట్ చేసిన వార్తా సంస్థలను సంప్రదించిన పోలీసులు, కొన్ని ట్వీట్లను తొలిగించారు.

తప్పుడు వార్తలు వ్యాప్తి చేసిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తమిళనాడు పోలీసు అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.

దీని వెనుక ఉన్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

ఈ ఘటనలపై తమిళనాడు కార్మిక సంక్షేమ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి సీవీ గణేశన్ స్పందించారు.

‘‘ఉత్తరాది కార్మికులు తమిళనాడులో ప్రశాంతంగా జీవిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహాయపడుతున్నారు. ఫ్లైఓవర్ల నిర్మాణం, మెట్రో రైలు నిర్మాణాల్లో వారు పనిచేస్తారు. తమిళనాడు కార్మిక సంక్షేమం నిబంధనలను అనుసరిస్తున్నామని నిర్ధారిస్తున్నాం’’ అని ఆయన చెప్పారు.

ఉత్తరాది కార్మికులు

ఫొటో సోర్స్, Getty Images

ఫిర్యాదులు, అరెస్టులు, మధ్యంతర బెయిల్

తప్పుగా వార్తలు ప్రచురించినందుకు హిందీ భాష వార్తా సంస్థలైన దైనిక్ భాస్కర్, ఓపీఇండియా మీడియా సంస్థల ఎడిటర్లపై, ‘తన్వీర్ పోస్ట్’ అనే మీడియా పోర్టల్‌ను నడిపే తన్వీర్‌పై, ఉత్తరప్రదేశ్ బీజేపీ యూనిట్ అధికార ప్రతినిధి ప్రశాంత్ ఉమ్రావ్‌పై తమిళనాడు పోలీసులు కేసులు నమోదు చేశారు.

వీరిని పట్టుకోవడం కోసం 10 బృందాలను ఏర్పాటు చేశారు.

ఈ సమయంలో ప్రశాంత్ ఉమ్రావ్, దిల్లీ హైకోర్టు నుంచి 14 రోజుల మధ్యంతర బెయిల్‌ను పొందారు.

బిహార్ పోలీసులు కూడా అమన్ కుమార్ అనే వ్యక్తితో పాటు ‘ప్రయాస్ న్యూస్’, ‘సచ్‌తక్ న్యూస్’ వార్తా సంస్థలపై కూడా కేసులు నమోదు చేశారు.

అమన్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న మిగతా వారి కోసం వెదుకుతున్నట్లు బిహార్ పోలీసులు చెప్పారు.

తమిళనాడు రాష్ట్రంలో బిహార్ వలసదారులపై హింసాత్మక ఘటనలకు సంబంధించి సోషల్ మీడియాలో వ్యాప్తి చెందిన నకిలీ, తప్పుడు వీడియోలపై దర్యాప్తు చేసి ఈ మేరకు కేసును నమోదు చేసినట్లు తెలుపుతూ మార్చి 6న బిహార్ పోలీసులు ఒక ట్వీట్ చేశారు.

భయానక వాతావరణం సృష్టించేందుకు నిందితులు, ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పుకార్లు, తప్పుదోవ పట్టించే వార్తలను ప్రచారం చేస్తున్నారని వారు చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

తప్పుదోవ పట్టించే వీడియోలతో ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేస్తున్నారనే కారణంతో బిహార్‌కు చెందిన రూపేశ్ కుమార్ అనే వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో మార్చి 7వ తేదీన ఆయనను పట్టుకున్నారు.

ఈ ఘటనల నేపథ్యంలో మార్చి7వ తేదీన డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బిహార్ వలస కార్మికుల భద్రతను తమిళనాడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరంగా చెప్పారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా పరిశ్రమల్లో పనిచేస్తోన్న వలస కార్మికులతో సమావేశం అయ్యారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

తిరుపూర్

తమిళనాడులో బిహార్ అధికారుల పర్యటన

బిహార్‌కు చెందిన నలుగురు ఉన్నత అధికారుల బృందం తమిళనాడులో పర్యటించింది. బిహార్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి బాలమురుగన్ నేతృత్వంలోని ఈ బృందం, వలసదారులు ఎక్కువగా నివాసం ఉండే కోయంబత్తూర్, తిరుపూర్ జిల్లాలను సందర్శించింది.

వలస కార్మికులు నివాసం ఉండే, పనిచేసే ప్రాంతాల్లో మార్చి 5, 6 తేదీల్లో ఈ బృందం పర్యటించింది.

రెండు రోజులు ఉత్తరాది కార్మికులతో చర్చల అనంతరం అధికారులు, తమిళనాడులో కార్మికులు అన్ని వసతులు, సౌకర్యాలు అందుతున్నాయని అధికారులు గుర్తించారు.

‘‘తమిళనాడు ప్రభుత్వం, తమిళనాడు పోలీసులు తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయి. ఉత్తరాది వలస కార్మికుల కోసం తమిళనాడు పోలీసులు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. హెల్ప్‌లైన్‌ను నడుపుతున్నారు’’ అని బాలమురుగన్ చెప్పారు.

వలస

ఉత్తరాది కార్మికులు జీవనోపాధి, ఉద్యోగం వెదుకుతూ తమిళనాడుతో పాటు ఇతర దక్షిణ రాష్ట్రాలకు రావడం కొత్తేమీ కాదు. కానీ, వారి ఉనికి ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు.

ఉత్తరాది కార్మికులు తమిళనాడుకు వచ్చి స్థానిక తమిళుల అవకాశాలను తినేస్తున్నారని తమిళ జాతీయవాద రాజకీయ నాయకులు ఎప్పుడూ ప్రసంగాల్లో చెబుతుంటారు.

ఉత్తరాది కార్మికులు
ఫొటో క్యాప్షన్, ఒక వ్యక్తిని పెద్ద గుంపు తరుముతున్నట్లుగా వ్యాప్తి చెందిన వీడియోలోని క్లిప్పింగ్

తిరుపూర్ వీడియో అనంతర పరిణామాలు

ఈ ఏడాది జనవరి 26వ తేదీన తిరుపూర్‌ నుంచి ఒక వీడియో బయటకు వచ్చింది.

ఆ వీడియోలో ఒక పెద్ద గుంపు, ఒక వ్యక్తిని వెంబడించి దాడి చేసినట్లుగా కనిపిస్తుంది. ఉత్తరాది కార్మికుల బృందం, ఒక తమిళ వ్యక్తిని దాడి చేస్తుందంటూ చెబుతూ వీడియోను షేర్ చేశారు.

అయితే, సదరు వీడియో జనవరి 14న, ఒక చిన్న విషయంలో రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘటనకు సంబంధించినదని తిరుపూర్ పోలీస్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, బీబీసీకి స్పష్టం చేశారు.

‘‘కానీ, రెండు వర్గాల మధ్య వివాదాన్ని రేకెత్తించే దురుద్దేశంతో ఆ వీడియోను వ్యాప్తి చేస్తున్నారు’’ అని ఆయన అన్నారు.

అనంతరం, ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు బిహార్ కార్మికులను అరెస్ట్ చేశారు.

తిరుపూర్ ఎగుమతిదారులు, తయారీదారుల సంఘం అధ్యక్షుడు ఎంపీ ముత్తురాథినం
ఫొటో క్యాప్షన్, తిరుపూర్ ఎగుమతిదారులు, తయారీదారుల సంఘం అధ్యక్షుడు ఎంపీ ముత్తురాథినం

తిరుపూర్‌ ఎందుకు?

తిరుపూర్ నుంచి ఆ వీడియో బయటకు రావడం యాదృచ్ఛికం కాదు.

దేశంలోని టెక్స్‌టైల్స్ ఉత్పత్తుల్లో 50 శాతం తిరుపూర్ నుంచే ఎగుమతి అవుతాయి. అక్కడ ఉత్తరాది కార్మికులు జనాభా భారీగా ఉంటుంది.

తిరుపూర్ టెక్స్‌టైల్ పరిశ్రమ శ్రామిక శక్తిలో ఈ ఉత్తరాది కార్మికులదే ప్రధాన భాగం.

తిరుపూర్ వస్త్ర పరిశ్రమలో ప్రస్తుతం సుమారు 3 లక్షల మంది వలస కార్మికులు ఉంటారని తిరుపూర్ ఎగుమతిదారులు, తయారీదారుల సంఘం అధ్యక్షుడు ఎంపీ ముత్తురాథినం చెప్పారు. టైలరింగ్, చెకింగ్, ప్రాసెసింగ్ యూనిట్లలో వారు పనిచేస్తారని ఆయన తెలిపారు.

ఉత్తరాది కార్మికులు అంటే ఎవరు?

తమిళనాడుకు బిహార్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గడ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి వలస వస్తుంటారు. ఈ కార్మికులందరినీ తమిళనాడులో ఉత్తర భారత కార్మికులుగా పిలుస్తుంటారు.

సొంతరాష్ట్రాల్లో సరైన జీవనోపాధి లేకపోవడంతో మెరుగైన జీవనం కోసం వారంతా దక్షిణాది రాష్ట్రాలకు వలస వెళ్తారు.

తొలుత వారు ప్రధానంగా నిర్మాణ రంగంలో రోజూవారీ కూలీలుగా పనిచేశారు. కానీ, ఈరోజుల్లో వారు సూపర్ మార్కెట్లు, భోజనశాలలు, ఫౌల్ట్రీ ఫామ్, క్షౌర శాలలు, బోర్‌వెల్ సర్వీసులు, స్టార్ హోటళ్లు, రిటైల్ వాణిజ్య సంస్థల్లో కూడా పనిచేస్తున్నారు.

సనోజ్
ఫొటో క్యాప్షన్, సనోజ్

ఉత్తరాది కార్మికులను సంస్థలు ఎందుకు కోరుకుంటున్నాయి?

సెలవులు తక్కువగా తీసుకుంటూ, ఎక్కువ కష్టపడే లక్షణం వల్లే ఉత్తరాది కార్మికులను ఎక్కువగా పనిలో పెట్టుకుంటున్నట్లు పరిశ్రమల ప్రతినిధులు చెబుతున్నారు.

‘‘తమిళులు, వారంలో నాలుగు రోజులు మాత్రమే పనిచేస్తారు. కానీ, నెలలో 26 రోజుల పనిచేసే శ్రామికులు మాకు అవసరం. అందుకే ఉత్తరాది కార్మికులపై మేం ఆధారపడతాం. తిరుపూర్‌కు వచ్చే ఉత్తరాది కార్మికులు నెల రోజుల్లోపే కావాల్సిన నైపుణ్యాలను నేర్చుకుంటారు.

ఇది రాత్రికి రాత్రే వచ్చిన మార్పు కాదు. ఈ మార్పు రావడానికి సంవత్సరాల సమయం పట్టింది. ఈరోజు తిరుపూర్ వస్త్ర పరిశ్రమ అంతా ఉత్తరాది కార్మికులపై ఆధారపడింది’’ అని ముథిరాథినమ్ తెలిపారు.

అయితే, తక్కువ వేతనాలు ఇస్తూ ఎక్కువ గంటలు పని చేయిస్తూ కార్మికులను దోపిడి చేస్తున్నారనే ఆరోపణలు కూడా తమిళనాడు పారిశ్రామిక యూనిట్లపై వస్తున్నాయి.

ఉత్తర భారత కార్మికులు తక్కువ వేతనాలకే పనిచేస్తారనేది నిజం కాదని తిరుపూర్‌కు 13 ఏళ్ల క్రితం వలస వచ్చిన సనోజ్ కుమార్ చెప్పారు.

ప్రస్తుతం ఆయన మొబైల్ దుకాణం నడుపుతున్నారు.

స్థానిక కార్మికులకు, ఉత్తరాది కార్మికులకు మధ్య వేతన వ్యత్యాసం 10 నుంచి 20 శాతం మాత్రమే ఉంటుందని ఆయన బీబీసీకి చెప్పారు.

ఉత్తరాది కార్మికులు

పరిష్కారం

తమిళనాడులో వలస కార్మికుల హక్కులు ఉల్లంఘనకు గురికాకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్, డాక్యుమెంటేషన్, ఇంటిగ్రేషన్ అనే మూడు అంశాలను పరిష్కారాలుగా సూచించారు.

వలస కార్మికుల హక్కుల కోసం పనిచేసే ‘అలియన్స్’ సంస్థకు చెందిన బాలమురుగన్ మాట్లాడుతూ, ‘‘ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం, వలస కార్మికుల వివరాలను నమోదు చేసుకుంటుంది. వారి కోసం నాలుగు కేంద్రాలు పనిచేస్తున్నాయి’’ అని చెప్పారు.

తమిళనాడులో ఉంటున్న వలస కార్మికులకు సంబంధించిన తరచుగా జనాభా గణన, డాక్యుమెంటేషన్ చేపట్టాలని పారిశ్రామిక వేత్త జేమ్స్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)