'విశ్వం' మూవీ రివ్యూ: గోపీచంద్ వన్‌మాన్ షో ఎలా ఉంది, శ్రీనువైట్ల మార్క్ కామెడీ ప్రేక్షకులను మెప్పించిందా?

విశ్వం సినిమా

ఫొటో సోర్స్, X/Chitralayam Studios

ఫొటో క్యాప్షన్, విశ్వం సినిమా: గోపీచంద్ వన్‌మాన్ షో
    • రచయిత, శృంగవరపు రచన
    • హోదా, బీబీసీ కోసం

మాచో స్టార్ గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన సినిమా 'విశ్వం.' 'కామెడీ-యాక్షన్' జోనర్‌లో ఎమోషనల్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించగలిగిందా?

కథ ఏంటి?

భారతదేశంలో యాంటి ఇండియా సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడానికి, యువతలో మతపరమైన అసహనం కలిగేలా చేయడానికి, దాడులు చేసే లక్ష్యంతో ఉంటాడు ఐసిస్‌కు చెందిన జలాలుద్దీన్ (జిషు సేన్ గుప్తా). అతను దర్శన అనే పాపను ఎందుకు చంపాలనుకుంటాడు? విశ్వానికి (గోపీచంద్), దర్శనకు ఉన్న సంబంధం ఏమిటి? విశ్వం ఆ పాపను ఎలా రక్షిస్తాడు? ఆ ఐసిస్ ఏజెంట్‌ను ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే కథ.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
విశ్వం సినిమా

ఫొటో సోర్స్, X/Chitralayam Studios

ఫొటో క్యాప్షన్, ప్రధాన కథకన్నా దర్శకుడు కామెడీకే పెద్దపీట వేశారు

గోపీచంద్ వన్‌మాన్ షో

గోపీచంద్ మంచి ఎనర్జీతో కనిపించిన సినిమా ఇది. యాక్షన్ సీక్వెన్స్‌లలో , కామెడీ ట్రాక్స్‌లోనూ ప్రేక్షకులు కళ్ళు తిప్పుకోలేని స్థాయిలో నటించారు.

కావ్య థాపర్ పాత్ర చిత్రణ బలంగా లేదు. తన డైలాగ్స్ డెలివరీ మీద ఇంకా బాగా వర్క్ చేస్తే బావుండేది. కావ్య థాపర్ తో గోపీచంద్ కెమిస్ట్రీ కూడా బలంగా లేదు. గోపీచంద్‌ ఎనర్జీని కావ్య మ్యాచ్ చేయలేకపోయారు.

ఈ సినిమాలో విలన్‌గా జిషు సేన్ గుప్తా నటించారు. కానీ పాత్ర చిత్రణ, డబ్బింగ్ సరిగ్గా నప్పకపోవడంతో ఆయన నటన అంతగా ఆకట్టుకోలేదు.

సునీల్ కామెడీ విలనిజంతో బాగా నటించారు. సునీల్ -రాహుల్ రామకృష్ణ -శ్రీకాంత్ అయ్యంగార్ కాంబినేషన్ కామెడీలో పర్లేదనిపించారు. వెన్నెల కిషోర్ సెకండ్ హాఫ్ లో కామెడీ ట్రాక్ లో బాగానే నటించారు.

సునీల్, మాస్టర్ భరత్,శ్రీనివాస్ రెడ్డి, నరేష్, ప్రగతి, అజయ్ ఘోష్, షకలక శంకర్,తమ పరిధిలో పర్లేదనిపించారు.పృథ్విరాజ్ కూడా ఆకట్టుకున్నారు.సుమన్, షఫీ అతిథి పాత్రల్లో కనిపిస్తారు.

విశ్వం సినిమా

ఫొటో సోర్స్, X/Chitralayam Studios

ఫొటో క్యాప్షన్, గోపీచంద్ ఎనర్జీని కావ్యథాపర్ మ్యాచ్ చేయలేకపోయారు

పాత్రల చిత్రణ

కథకు ప్రాణం పొసేవి పాత్రలు. కానీ ఈ సినిమాలో ఎక్కువ పాత్రలు కథతో సంబంధం లేనివే. అలాంటి కేరెక్టర్స్ తోనే ఎక్కువ సేపు సినిమా నడవడంతో కథ గజిబిజి అయ్యింది.

మెయిన్ స్టోరీ లో మళ్ళీ కొత్త పాత్రలు ఉండటం ప్రేక్షకులను కన్ ఫ్యూజ్ చేస్తుంది.

విశ్వం సినిమా

ఫొటో సోర్స్, X/Chitralayam Studios

పాటలు -సంగీతం

మదర్ సెంటిమెంట్ సాంగ్ అయిన 'అమ్మ గుండె బరువు' పాట బావుంది.సెకండ్ హాఫ్ లో విశ్వం కేరెక్టర్ సాంగ్ కూడా బావుంది.మిగిలిన పాటలు సినిమాకు ప్లస్ కాలేదు.

చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్.

సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్లేదనిపించాయి.

కామెడీ

చాలా సీరియస్ కథ ఉన్న సినిమా ఇది. శ్రీను వైట్ల సక్సెస్ ఫార్ములా బలమైన కామెడీనే. అదే కామెడీ ఈ సినిమాలో కూడా ఉంది. స్టోరీ కన్నా కూడా కామెడీకే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. స్టోరీ లాగింగ్ ఉన్నా, ఈ కామెడీ ట్రాక్ వల్ల ప్రేక్షకులను కొంతసేపు ఎంగేజ్ చేయగలిగింది. కాకపోతే మెయిన్ స్టోరీని గంట అయినా ఎస్టాబ్లిష్ చేయకుండా కామెడీని సాగదీయడంతో ఈ కామెడీ కూడా తేలిపోయింది.

విశ్వం సినిమా

ఫొటో సోర్స్, X/Chitralayam Studios

ఫొటో క్యాప్షన్, స్టోరీలో ఎమోషన్ ఉన్నా దానిని ప్రేక్షులకు కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో దర్శకుడు శ్రద్ధచూపలేదు

స్క్రీన్ ప్లే ఎలా ఉంది?

ఈ సినిమాలో హీరోతో సమానంగా ప్రాధాన్యం ఉన్న పాత్ర ఓ పాప. ఆ పాప పేరు దర్శన. ఇది సినిమాకు చాలా స్ట్రాంగ్ ఎమోషన్.ఈ ఎమోషన్ తో పాటు మదర్ ఎమోషన్,దేశం మీద కుట్ర ప్లాన్ చేసే ఎమోషన్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో విశ్వం ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉంది. ఆడియన్స్ తో ఎమోషనల్ గా స్టోరీతో కనక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఇవి..కానీ ఇవన్నీ ఆటలో అరటిపండులా వెతికితే తప్ప కనబడనట్టు ఉన్నాయి..ఈ స్టోరీ ఎలిమెంట్స్ ను పక్కన పెట్టి అనేక పాత్రలతో కామెడీతో కథను గందరగోళం చేయడంతో స్క్రీన్ ప్లే బలహీనమైపోయింది.

ఉన్న పాత్రల్లో ఎక్కువ మంది బాగా నటించినా, ఆ కేరక్టర్స్ స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల కథకు ప్లస్ కాలేదు.

ఎనర్జీటిక్ యాక్టర్ గోపీచంద్. అటు కామెడీ, ఇటు యాక్షన్ రెండిట్లోనూ మెప్పించగల నటుడు.ఈ సినిమాకు ఉన్న ప్లస్ పాయింట్ గోపీచందే.సినిమా మొత్తాన్ని వన్‌మాన్ షో లా మోశాడు ఫస్ట్ హాఫ్ లో లాగింగ్ ఉన్నా కామెడీ తో పర్లేదు అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ లో కూడా అదే లాగింగ్ ప్రేక్షకులను నిరాశ పరుస్తుంది.కొసరు కథలకు రెండుగంటలు, ముఖ్య కథకు ఒక 30-40 నిముషాలు మాత్రమే స్క్రీన్ టైమ్ ఉండటంతో ప్రేక్షకులకు కథ రిజిస్టర్ అయ్యే స్కోప్ కూడా లేకపోయింది.

విశ్వం సినిమా

ఫొటో సోర్స్, X/Chitralayam Studios

ప్లస్ పాయింట్స్

  • గోపీచంద్ నటన
  • సంగీతం
  • మదర్ ఎమోషనల్ సాంగ్, సెకండ్ ఆఫ్ లో విశ్వం కేరెక్టర్ సాంగ్
  • ఫస్ట్ హాఫ్ కామెడీ

మైనస్ పాయింట్స్:

  • పాత్రల చిత్రీకరణ
  • ఎమోషనల్ ఎలిమెంట్స్ ను వాడుకోకపోవడం
  • హీరో -హీరోయిన్ కెమిస్ట్రీ
  • లాగింగ్

కథ మీద కన్నా కూడా యాక్షన్, కామెడీ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల అసలు కథే లేకుండా పోయిన సినిమా ఇది. గోపీచంద్ తన ఎనర్జీతో కొంత వరకూ నిలబెట్టే ప్రయత్నం చేసినా, అది కూడా ఫలించక ప్రేక్షకులను నిరాశపరిచిన సినిమా ఇది.

(గమనిక: ఈ రివ్యూలోని అభిప్రాయాలు సమీక్షకురాలి వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)