గ్లాడియేటర్, ‘గాయపడ్డ సింహం’.. మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం

మ్యాక్స్‌వెల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కండరాల నొప్పిని పంటి బిగువున నొక్కిపెడుతూ పోరాడిన మ్యాక్స్‌వెల్

‘‘ఒక గ్లాడియేటర్‌లా పోరాడాడు’’, ‘‘గాయపడ్డ సింహం’ వెనుదిరకుండా చేసిన భీకర పోరాటం ’’ - కండరాల నొప్పి భరించలేనంతగా బాధ పెడుతున్నా ఆస్ట్రేలియాను తన వీరోచిత ఒంటరి పోరాటంతో గెలిపించిన గ్లెన్ మ్యాక్స్‌‌వెల్‌పై సోషల్ మీడియాలో వస్తున్న ప్రశంసలు ఇవి.

ప్రపంచ కప్‌లో భాగంగా ముంబయి వాంఖడే స్టేడియంలో మంగళవారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ తొడ కండరాల నొప్పితో ఎంతగానో బాధపడ్డాడు. దానిని పంటి బిగువున నొక్కి పెడుతూనే బ్యాటింగ్ కొనసాగించి, ఓటమి ముంగిట ఉన్న ఆసీస్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

21 ఫోర్లు, 10 సిక్సర్లతో 128 బంతుల్లో 201 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్‌ను అభిమానులు, ప్రేక్షకులు, మాజీ క్రికెటర్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

తన ప్రదర్శనపై మ్యాక్స్‌వెల్ స్పందిస్తూ- "చివరి వరకు క్రీజులో ఉండి, నా జట్టును గెలిపించడంపై చాలా గర్వంగా ఉంది" అన్నారు.

వరల్డ్ కప్ 2023

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పరుగెత్తడానికి శరీరం సహకరించకపోవడంతో స్ట్రైకింగ్‌లో ఉంటూ సిక్సులు, ఫోర్లు సాధించాడు మ్యాక్స్‌వెల్

‘‘మాగ్జిమస్ మ్యాక్స్‌వెల్ గ్లాడియేటర్‌లా పోరాడాడు. ఆస్ట్రేలియాకు అద్భుత విజయం దక్కింది’’ అని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ధన్‌రాజ్ నత్వానీ ఎక్స్(ట్విటర్‌)లో రాశారు.

హాలీవుడ్ చిత్రం ‘గ్లాడియేటర్’లో రసెల్ క్రో పోషించిన మాగ్జిమస్ డెసిమస్ మెరిడియస్ పాత్రను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శనల్లో ఇది ఒకటి అని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశారు.

"ఇది నెవర్ గివ్‌ అప్ అని చెప్పడానికి గొప్ప నిదర్శనం . నమ్మశక్యం కాని ఇన్నింగ్స్ ఇది. టేక్ ఏ బో’’ అంటూ అతడు ప్రశంసించాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

"మ్యాక్స్‌వెల్ అద్భుతమైన ప్రదర్శన నాకు కపిల్ దేవ్ 1983 ప్రదర్శనను గుర్తు చేసింది" అంటూ టీమిండియా మాజీ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి ట్వీట్ చేశాడు.

మ్యాక్స్‌వెల్ ప్రదర్శన

ఫొటో సోర్స్, RaviShastri/Twitter

ఫొటో క్యాప్షన్, రవిశాస్త్రి ట్వీట్

వి.ఈశ్వర్ అనే యూజర్ కూడా- 1983 ప్రపంచకప్‌లో కపిల్ దేవ్ చేసిన పోరాటాన్ని, ఇప్పుడు మ్యాక్స్‌వెల్ చేసిన పోరాటాన్ని పోలుస్తూ ఇద్దరి ఫోటోలను షేర్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

నేను చూసిన అత్యుత్తమ వన్డే ఇన్నింగ్స్ ఇదే: సచిన్

"తీవ్రమైన ఒత్తిడిలో కూడా అద్భుతమైన ప్రదర్శన.. వన్డే నాకౌట్‌లో ఇలాంటి అత్యుత్తమ మ్యాచ్‌ను నేనింత వరకు చూడలేదు" అంటూ మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ ట్వీట్ చేశాడు

తన సెంచరీతో అఫ్గాన్‌ జట్టుకు మంచి లక్ష్యాన్ని జోడించిన ఇబ్రహీం జద్రాన్‌ను కూడా సచిన్ ప్రశంసించాడు.

సచిన్ తెందూల్కర్

ఫొటో సోర్స్, Sachin/Twitter

ఫొటో క్యాప్షన్, సచిన్ తెందూల్కర్ ట్వీట్
ఆస్ట్రేలియా మ్యాచ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మ్యాక్స్‌వెల్ తొమ్మిదో ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చాడు.

‘ఆ అంచనాను తప్పని నిరూపించిన కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌’

"‘విన్ ప్రెడిక్టర్’‌ అంచనాను తప్పని నిరూపించిన బ్యాటర్లు విరాట్‌కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌" అంటూ ముఫద్దాల్ ఓహ్రా అనే యూజర్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

ఇబ్రహీం జద్రాన్ 129 పరుగులు చేయడంతో అఫ్గాన్ మంచి లక్ష్యాన్నే ఆస్ట్రేలియా ముందు ఉంచగలిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్, 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది.

అయితే డేవిడ్ వార్నర్(18), ట్రావిస్ హెడ్(0), మిషెల్ మార్ష్(24) లాంటి బ్యాటర్లను అవుట్ చేసి, అఫ్గానిస్తాన్ బౌలర్లు ఆసీస్‌ను మొదట్లోనే దెబ్బతీశారు.

8.2 ఓవర్ల వద్ద 49 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో మ్యాక్స్‌వెల్ బరిలోకి దిగాడు. కానీ, కొద్దిసేపటికే లబుషేన్ రనౌట్ అయ్యాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టాయినిస్, మిషెల్ స్టార్క్‌ కూడా నిలబడలేదు. ఈ స్థితిలో మ్యాక్స్‌వెల్ మొత్తం మ్యాచ్‌ను చేతుల్లోకి తీసుకున్నాడు. ఆట స్వరూపాన్నే మార్చేశాడు.

వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 128 బంతుల్లో 201 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన మ్యాక్స్‌వెల్

అఫ్గాన్ మద్దతుదారులను తన వైపు తిప్పుకున్న మ్యాక్స్‌వెల్

వాంఖడే స్టేడియంలో అఫ్గానిస్తాన్ జట్టుకు మద్దతునిస్తూ భారత ప్రేక్షకులు కేరింతలు కొట్టారు.

అఫ్గాన్ క్రికెటర్ ఇబ్రహీం జద్రాన్ సెంచరీ చేశాక, కుర్చీల్లోంచి లేచి నిలబడి అభినందించారు.

రషీద్ ఖాన్ క్రీజులోకి వచ్చినప్పుడు ‘‘రషీద్, రషీద్’’ అంటూ ఉత్సాహపరిచారు. ఐపీఎల్ టోర్నీలో రషీద్ ఇన్నింగ్స్ చూసిన భారతీయులకు అతడి పట్ల ఉన్న అభిమానం కనిపించింది.

స్టేడియం అంతా అఫ్గానిస్తాన్ జట్టుకు మద్దతు ఇస్తున్న వేళ, మ్యాక్స్‌వెల్ అందరినీ తన ప్రదర్శనతో కట్టిపడేశాడు.

మ్యాక్స్‌వెల్ కిందపడిన సమయంలో అతడిని ఉత్సాహపరుస్తూ 'మ్యాక్స్‌వెల్, మ్యాక్స్‌వెల్' అంటూ అతడికి ప్రేక్షకులు మద్దతుగా నిలిచారు. మ్యాచ్ ముగిశాక, డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న మ్యాక్స్‌వెల్‌ను మొబైల్ ఫోన్లతో ఫోటో తీసుకునేందుకు ఎగబడ్డారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన మ్యాక్స్‌వెల్

మ్యాక్స్‌వెల్ ఏమన్నాడు?

మ్యాచ్‌లో తన అద్భుతమైన ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచిన మ్యాక్స్‌వెల్ తన సంతోషాన్ని పంచుకున్నాడు.

“మే ఫీల్డింగ్‌లోకి దిగే సమయానికే ఎండ ఎక్కువగా ఉంది. వేడివాతావరణాన్ని తట్టుకునేలా నేను తగినంత వ్యాయామం చేయలేదు కూడా. ఆ ప్రభావం నాపై పడింది. మా బ్యాటింగ్ వ్యూహానికి అనుగుణంగానే బరిలోకి దిగాం. కానీ, పరిస్థితులు మారిపోయాయి. నేను సానుకూల ధృక్పథంతోనే ఆట కొనసాగించాను. అఫ్గాన్ బౌలింగ్‌ను ఎదుర్కొంటూనే పరుగులు సాధించేందుకు ప్రయత్నించాను. ఎల్‌బీడబ్ల్యూ అప్పీల్ తర్వాత, నేను మరింత దూకుడుగా ఆడాలని నాకు అర్థమైంది. మీరు నా ఇన్నింగ్స్‌లో తేడాను గమనించే ఉంటారు. అఫ్గాన్ బౌలర్లు బాగా బౌలింగ్ చేసి, మమ్మల్ని మొదట్లోనే ఒత్తిడిలోకి నెట్టేశారు. గతంలో ఇలాంటి సందర్భాల్లో ఆడే అవకాశం వచ్చినా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేదు. ఇప్పుడు చివరి వరకు క్రీజులో ఉండి, నా జట్టును గెలిపించడంపై చాలా గర్వంగా ఉంది” అన్నాడు.

ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ స్పందిస్తూ, “నాకు సంతోషంతో మాటలు రావడం లేదు. అద్భుతమైన విజయం ఇది. ఇదివరకెన్నడూ చూడనిది. మ్యాక్స్‌వెల్‌కు ఇన్నింగ్స్ ఆసాంతం ఒక ప్రణాళిక ఉంది. లక్ష్యానికి 200 పరుగులు దూరంలో ఉన్నా, మేం ఇలాంటి విజయాన్ని సాధించగలగడం చాలా ప్రత్యేకం” అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)