వెతుకుతుంటే దొరికిన రాయి కోటి రూపాయలు తెచ్చింది... ఎలా?

ఫొటో సోర్స్, DARREN KAMP
- రచయిత, టిఫనీ టర్న్‌బుల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒక వ్యక్తి అలా మెటల్ డిటెక్టర్ పట్టుకుని తిరుగుతున్నాడు. హఠాత్తుగా ఆ పరికరం బీప్ బీప్ అంటూ శబ్ధం చేసింది. ఆ ప్రదేశంలో ఏముంది అని తవ్వి చూస్తే ఓ రాయి కనిపించింది.
ఆ రాయి నాలుగున్నర కిలోల బరువు ఉంది. దాన్ని కొంచెం పరీక్షించి చూడగా తెలిసిందాయనకు అందులో బంగారం ఉంది అని.
దాని విలువ 5 లక్షల రూపాయల వరకైనా ఉంటుందని తెగ సంతోషపడ్డాడు.
దాన్ని బంగారం వ్యాపారి దగ్గరికి వెళ్లి చూపించగా తెలిసింది. దాని విలువ లక్షలు కాదు.. కోట్లు అని. ఈ బంగారు రాయిని కొనుగోలు చేసిన డారెన్ క్యాంప్.. గత 43 ఏళ్లలో ఇలాంటిది చూడలేదన్నారు.
ఆస్ట్రేలియాలోని విక్టోరియా గోల్డ్ ఫీల్డ్స్‌లో ఆ రాయి దొరికింది.1800ల ప్రాంతంలో అక్కడ బంగారు నిక్షేపాలు ఎక్కువగా ఉండేవి.
మెటల్ డిటెక్టర్ పట్టుకుని తిరుగుతున్న ఆ వ్యక్తికి 4.6 కిలోల రాయి ఈ ఫీల్డ్స్‌లోనే దొరికింది. తన పేరును వెల్లడించానికి ఆ వ్యక్తి ఇష్టపడలేదు.
"నేను ఆశ్చర్యపోయాను. జీవితంలో ఇలాంటివి ఒక్కసారి మాత్రమే జరుగుతాయి '' డారెన్ అన్నారు.

ఫొటో సోర్స్, THE ROYAL MINT
ఓ పెద్ద బ్యాగుతో షాప్‌కు వచ్చి..
‘‘ఓ అజ్ఞాత వ్యక్తి ఒక పెద్ద బ్యాగుతో వచ్చాడు.
ముందు అతన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే చాలామంది బంగారంలా కనిపించే రాళ్లతో వచ్చి వాటిని కొనమంటారు.
కానీ, ఆ వ్యక్తి ఆ రాయిని బయటికి తీసి నా చేతిలో పెట్టి, దీని విలువ 10 వేల ఆస్ట్రేలియా డాలర్లు (సుమారు 5.4 లక్షలు) ఉంటుందా అని అడిగారు.
నేను అతని వైపు చూస్తూ 55 లక్షల వరకు ఉంటుందని చెప్పాను. అయితే తనకు దొరికిన దానిలో ఇది సగమేనని చెప్పి అతను వెళ్లిపోయాడు.
మొత్తానికి ఆ రాయి బరువు 4.6 కిలోలు ఉంది. అందులో సుమారు 2.6 కిలోల బంగారం ఉంది. క్యాంప్ దానిని కొనుగోలు చేశారు. దాని ధర కోటి 30 లక్షల రూపాయల వరకు ఉంటుంది.
ఆ బంగారు రాయి విలువ చెప్పినపుడు ఆ అజ్ఞాత వ్యక్తి తన భార్య సంతోషిస్తుందని అన్నాడు’’ అని క్యాంప్ తెలిపారు.
ఇలాంటి ఘటనలు చాలా అరుదైనప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వలు ఆస్ట్రేలియాలో ఉన్నాయని అంచనా.
అతిపెద్ద బంగారు నిక్షేపాలు అక్కడే కనుగొన్నారు.
ఇవి కూడా చదవండి:
- రాహుల్ గాంధీ: ‘‘అదానీ మీద మళ్లీ నేను ఏం మాట్లాడతానోనని మోదీ భయపడ్డారు’’
- ‘కులదురహంకారమే’ కాకినాడలో దళిత యువకుని ప్రాణాలు తీసిందా?
- రాహుల్ గాంధీ: కాంగ్రెస్ నేత ముందున్న మార్గాలు ఏంటి?
- పగలు క్లర్క్... రాత్రి ఆటో డ్రైవర్... ఆదివారం బట్టల వ్యాపారి... ఒక వ్యక్తి మూడు పనులు
- పాకిస్తాన్: అహ్మదీయులు ముస్లింలు కారా... వారి మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయ్...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














