పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగలనే అనుమానంతో సాధువులను కొట్టిన స్థానికులు... 12 మంది అరెస్ట్

సాధువులను కొట్టిన వీడియో వైరల్

ఫొటో సోర్స్, SANJAY DAS

ఫొటో క్యాప్షన్, సాధువులను కొట్టిన వీడియో వైరల్

మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలో పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగలనే అనుమానంతో సాధువులను కొట్టి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. దాదాపు అలాంటి ఘటనే ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లోని పురులియాలో జరిగింది.

మకర సంక్రాంతి సందర్భంగా గంగాసాగర్‌కు వెళ్తున్న ముగ్గురు సాధువులను స్థానికులు కొట్టారు. చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయే వారనే అనుమానంతో వారిని తీవ్రంగా కొట్టడంతో పాటు వస్త్రాలను చించేశారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, వారిని స్థానికుల నుంచి రక్షించారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు.

ఈ సంఘటన జనవరి 11న గురువారం జరిగింది. కానీ, శుక్రవారం సాయంత్రం నుంచి దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో కొందరు వ్యక్తులు సాధువుల దుస్తులను చింపేసి, వారిని కొడుతున్నట్లు ఉంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

పురులియా జంక్షన్

ఫొటో సోర్స్, SANJAY DAS

రాజకీయ రంగు పులుముకున్న ఘటన

ఈ వీడియో వైరల్‌గా మారిన తర్వాత, పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బీజేపీ టార్గెట్ చేసి విమర్శలు చేస్తోంది. బీజేపీ విమర్శలను తృణమూల్ కాంగ్రెస్ తిప్పికొట్టింది.

‘‘అనుమానంతో సాధువులను గ్రామస్థులు కొట్టారు. 12 మంది వ్యక్తులు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. కానీ, బీజేపీ ఈ విషయంపై ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చూస్తోంది’’ అని తృణమూల్ కాంగ్రెస్ నేత, మంత్రి శశి పంజా అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

ఈ విషయంలో ఏ పార్టీ కూడా పోలీసుల వద్ద ఫిర్యాదు దాఖలు చేయలేదని పోలీసులు తెలిపారు.

స్థానిక వ్యక్తుల సమాచారం ప్రకారం, ఈ సాధువులు ముగ్గురు మైనర్ బాలికలను దారి గురించి అడిగారు. కానీ, భాష అర్థం కాకపోవడం వల్ల, పిల్లలు భయపడి అరుచుకుంటూ అక్కడి నుంచి పారిపోయారు.

ఆ తర్వాత సాధువులను చుట్టుముట్టిన స్థానికులు, వారిని కొట్టడం ప్రారంభించారు. కొంత సమయం తర్వాత సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని, వారిని కాపాడారు. వారిని కాశీపూర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

స్థానిక రూరల్ ఆస్పత్రిలో వారికి ప్రాథమిక చికిత్స అందించారు. విచారణ సమయంలో వారు సమర్పించిన డాక్యుమెంట్లన్ని సరైనవేనని తెలిసింది.

మమతా బెనర్జీ ప్రభుత్వం

ఫొటో సోర్స్, ANI

పోలీసులు ఏం చెప్పారు?

ఈ సంఘటనపై కేసు నమోదు చేశామని పురులియా సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసు అభిజిత్ బెనర్జీ చెప్పారు. విచారణ చేస్తున్నామన్నారు.

ఇప్పటి వరకు 12 మంది అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మిగతా వారిని కూడా అరెస్ట్ చేసేందుకు చూస్తున్నామన్నారు.

‘‘గంగాసాగర్‌కు వెళ్తున్న సాధువులు మధ్యలో దారి తప్పిపోయారు. ఒక దగ్గర వారు ఆగి, ముగ్గురు బాలికలను గంగాసాగర్‌కు వెళ్లే మార్గం కోసం అడిగారు. కానీ, భాష అర్థం కాకపోవడం వల్ల ఈ బాలికలు భయపడ్డారు. ఈ సాధువులను చూసి, భయంతో అరుచుకుంటూ వెళ్లారు’’ అని తెలిపారు.

‘‘కానీ, సాధువులు ఈ బాలికలను వేధించారని స్థానికులు భావించారు. పిల్లల కిడ్నాపింగ్ గ్యాంగ్‌కు చెందినవారని అనుకున్నారు. ఈ ముగ్గురు బాలికల తల్లిదండ్రులతో పోలీసులు మాట్లాడారు. సాధువులకు వ్యతిరేకంగా వారు ఎలాంటి ఫిర్యాదు దాఖలు చేయలేదు’’ అని ఈ పోలీసు అధికారి చెప్పారు.

ఆ తర్వాత సాధువులు సురక్షితంగా గంగాసాగర్‌కు పంపినట్లు పోలీసు తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

నిరసన

ఫొటో సోర్స్, GETTY IMAGES

బీజేపీ ఏమంటోంది?

తాజా ట్వీట్లలో, ఈ సంఘటనపై మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని రాష్ట్ర బీజేపీ విమర్శించింది. దీనికి ముఖ్యమంత్రి సిగ్గుపడాలని విమర్శించింది. ఈ ఘటనపై బీజేపీ పార్టీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ట్వీట్లు చేశారు.

‘‘పాల్ఘడ్‌లో జరిగిన సంఘటన మాదిరి ఘటన పశ్చిమ బెంగాల్ పురులియాలో జరిగింది. బెంగాల్‌లో హిందువుగా ఉండటం నేరమా? మకర సంక్రాంతి పండగ సందర్భంగా సాధువులు గంగాసాగర్ వెళ్లాలనుకున్నారు. కానీ, వారి బట్టలను చించి, వారిని కొట్టారు. సాధువులపై దాడులు జరిపిన వారు అధికార పార్టీ టీఎంసీకి చెందిన వారు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో షాజహాన్ షేక్ వంటి ఉగ్రవాదులకు భద్రతా కల్పిస్తున్నారు. కానీ, సాధువులను కొడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో హిందువులను హింసిస్తున్నారు’’ అని ఆయన ఆరోపించారు.

పాల్ఘడ్‌ సంఘటనతో పోలికేంటి?

మహారాష్ట్ర పాల్ఘడ్‌లోని ఒక గ్రామంలో 500 మందికి పైగా అల్లరి మూక ఇద్దరు సాధువులను, వారి డ్రైవర్‌ను కర్రలతో కొట్టి చంపింది. ఈ కేసు విచారణను 2020 ఏప్రిల్ 21న సీఐడీకి అప్పగించారు.

పిల్లల్ని ఎత్తుకుపోయే గ్యాంగ్‌కు చెందిన వారనే అనుమానంతో ఈ సాధువులను చంపారు. ఆ ప్రాంతంలో సాధువులు, డాక్టర్లు, పోలీసుల మాదిరి వస్త్రాలు ధరించి పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠా తిరుగుతుందనే ప్రచారం సాగింది. ఈ కారణంతోనే సాధువులను, డ్రైవర్‌ను స్థానిక గుంపు కర్రలతో కొట్టి చంపింది.

ముగ్గురు వ్యక్తులు కారులో చనిపోయిన వారి అస్థికలు కలిపేందుకు సూరత్‌కు వెళ్తున్నారు. పాల్ఘడ్ జిల్లాలో జరిగిన ఈ సంఘటనపై కాసా పోలీసు స్టేషన్‌లో మూడు భిన్నమైన కేసులు నమోదయ్యాయి.

ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కాసా పోలీసు స్టేషన్‌కు చెందిన కొందరు పోలీసులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంతేకాక, 35 మందికి పైగా కానిస్టేబుల్స్, పోలీసులను ప్రభుత్వం బదిలీ చేసింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)