పంజాబ్‌లో కల్తీ మద్యం తాగి 98 మంది మృతి, రంగుల్లో వాడే రసాయనాలు కలపడం వల్లే ప్రాణాలు పోయాయా..

ఫొటో సోర్స్, Gurpreet (Batala)
పంజాబ్‌లో కల్తీ మద్యం తాగి చనిపోయినవారి సంఖ్య 98కి పెరిగింది. తరన్ తరన్, అమృత్‌సర్, బటాలాలలో ఈ మరణాలు చోటుచేసుకోగా అత్యధికంగా తరన్ తరన్‌లోనే 63 మంది మరణించారు.
ఈ వ్యవహారంలో శనివారం 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 25 మందిని అరెస్ట్ చేసినట్లయింది.
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ జలంధర్ డివిజన్ కమీషనర్ నేతృత్వంలో మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు.
ఏడుగురు ఎక్సైజ్ అధికారులు, ఆరుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.
రాష్ట్రంలోని అమృత్‌సర్, బటాలా, తరన్ తరన్ జిల్లాల్లో కల్తీ మద్యం సేవించడంతో ఈ మరణాలు సంభవించాయి.
వరుస మరణాలు చోటుచేసుకోవడంతో పోలీసులు నకిలీ మద్యం తయారీ స్థావరాలపై పెద్ద ఎత్తున దాడులు చేశారు. 100కి పైగా స్థావరాలపై దాడులు చేశారు.

ఫొటో సోర్స్, Gurpreet (Batala)
నకిలీ మద్యం విక్రయాలు ఇలా..
నకిలీ మద్యాన్ని రహస్యంగా ఎలా విక్రయిస్తున్నారన్నది డీజీపీ వెల్లడించారు. నకిలీ మద్యం తీసుకొస్తున్న ట్రక్కులు ఆరేడు ధాబాల దగ్గర ఆగుతాయని.. ఆ ధాబాల యజమానులు దాన్ని తీసుకుని అమృత్‌సర్, మిగతా ప్రాంతాల్లో ఏజెంట్లకు సరఫరా చేస్తారని చెప్పారు.
ఇంతకీ ఇందులో ఏముంది?
నిన్న జరిపిన దాడుల్లో పట్టుకున్న నకిలీ మద్యాన్ని టెస్టుకు పంపించారు. ఆ రిపోర్టు ఇంకా రానప్పటికీ ఎక్సయిజ్ అధికారులు చెబుతున్న ప్రకారం రంగుల్లో వాడే ఒక రకమైన స్పిరిట్‌తో దీన్ని తయారుచేస్తున్నారు.
సాధారణంగా బెల్లంతో నాటుసారా చేస్తారు కానీ ఈ నకిలీ మద్యాన్ని స్పిరిట్, ఇతర రసాయనాలతో చేస్తున్నారన్నారు.
దీన్ని లీటరు రూ.50కి విక్రయిస్తున్నారని ఎక్సయిజ్ అధికారులు చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ కేసు దర్యాప్తు బృందంలో జలంధర్ డివిజన్ కమిషనర్‌తోపాటు జాయింట్ ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ కమిషనర్, సంబంధిత జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కూడా ఉన్నారు. ఇప్పటికే బల్విందర్ కౌర్ అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెపై ఐపీసీ సెక్షన్ 304, ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 61/1/14 కింద కేసు నమోదైంది.
కల్తీ మద్యం మరణాలు సంభవించిన జిల్లాల్లో దాడులు నిర్వహించేందుకు పంజాబ్ పోలీసులు అయిదు బృందాలను ఏర్పాటు చేశారు.
"అమృత్‌సర్ గ్రామీణ ప్రాంతం, బటాలా, టరన్ టరన్ జిల్లాల్లో మరో ఏడుగురిని అరెస్ట్ చేశాం. అయిదు పోలీసు బృందాలు కల్తీ మద్యం మరణాలు సంభవించిన ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నాయి" అని పంజాబ్ పౌర సంబంధాల శాఖ తెలిపినట్లు ఏఎన్ఐ పేర్కొంది.
గురువారం ముచ్చల్ గ్రామంలో నలుగురు వ్యక్తులు కల్తీ మద్యం తాగి మృతి చెందిన ఘటనలకు సంబంధించి ఒక వ్యక్తిని అదే రోజు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన నలుగురు వ్యక్తుల మృతదేహాలను శుక్రవారంనాడు పోస్టు మార్టం కోసం పంపించారు.
అమృత్‌సర్ సమీపంలోని తార్‌సిక్కా పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు గ్రామాల్లో జూన్ 29 రాత్రి ఐదు కేసులు నమోదైనట్లు పంజాబ్ డీజీపీ వెల్లడించారు.

ఫొటో సోర్స్, RAVINDER SINGH ROBIN
ఇవి కూడా చదవండి:
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- అక్కడ అమ్మాయి పేరు ఎవరికీ చెప్పకూడదు.. పెళ్లి పత్రాల్లో రాయరు, మరణ ధ్రువీకరణల్లో ఉండదు
- ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ హాట్ స్పాట్‌గా మారిన తూర్పు గోదావరి
- భారత జనాభా ఈ శతాబ్దం చివరికి ఎందుకు తగ్గుతుంది... తగ్గితే ఏమవుతుంది?
- తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తి నుంచి 100 మందికి కరోనావైరస్.. ఎలా వ్యాపించింది?
- సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?
- రిలయన్స్ జియో 5జీ వస్తోంది.. కానీ భారతీయులు ఎన్నాళ్లు ఎదురు చూడాలి?
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








