ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

ఇండోనేసియా కరెన్సీ

ఫొటో సోర్స్, TWITTTER/SAURBH_MLAGK

1. ముస్లింలు మెజారిటీగా ఉన్న ఈ దేశంలో కరెన్సీ నోట్ల మీద వినాయకుని బొమ్మ ఎందుకు ఉంది?

భారత కరెన్సీ మీద లక్ష్మీ దేవి, వినాయకుడి బొమ్మలను ముద్రించాలంటూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు.

ప్రపంచంలోనే ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ఇండోనేసియాలో కరెన్సీ నోట్ల మీద హిందూ దేవుడైన వినాయకుని బొమ్మను ముద్రించగా లేనిది మనం ఎందుకు చేయలేమని కేజ్రీవాల్ అన్నారు.

ఇండోనేసియా జనాభాలో 85శాతం ముస్లింలు కాగా హిందువులు ఉన్నది రెండు శాతం మాత్రమే. అయినప్పటికీ వినాయకుని బొమ్మను వారి కరెన్సీ మీద ముద్రించారని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ చెప్పారు.

మరి, ముస్లింలు మెజారిటీగా ఉన్న ఈ దేశంలో కరెన్సీ నోట్ల మీద వినాయకుని బొమ్మ ఎందుకు ఉంది? పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో 'దున్నపోతుల పండుగ'

ఫొటో సోర్స్, @AIRNEWS_HYD

2. సదర్: హైదరాబాద్‌లో 'దున్నపోతుల పండుగ' ఎందుకు చేస్తారు? 'నాన్-లోకల్' దున్నపోతులపై వివాదం ఎందుకు?

తెలంగాణలో బతుకమ్మ పండుగ వంటి మరో విశిష్టమైన పండుగ సదర్ ఉత్సవం. సదర్ సమ్మేళన్‌గా పిలిచే ఈ పండుగ తెలంగాణకు.. ముఖ్యంగా సికంద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలకు విశిష్టమైన పండుగ. దీపావళి తర్వాతి రోజు, ఆ మరుసటి రోజు యాదవులు ఈ సదర్ పండుగ నిర్వహిస్తారు.

ముఖ్యంగా మూషీరాబాద్‌లో నిర్వహించే 'పెద్ద సదర్‌' చాలా ప్రఖ్యాతి చెందింది. బలమైన, అందమైన దున్నపోతులను ఈ పండుగలో ప్రదర్శిస్తారు. దున్నపోతులకు పూలదండలు, ముత్యాల మాలలు, పసుపు, కుంకుమలు, పట్టు పరదాలతో అలంకరిస్తారు.

ఇవి కూడా చదవండి

Goods and Services Tax

ఫొటో సోర్స్, Getty Images

3. పరోటాకు, రోటీకి, వేర్వేరు జీఎస్టీ ఎందుకు, పార్లర్ ఐస్‌క్రీమ్‌కు, హోటల్ ఐస్‌క్రీమ్‌కు తేడా ఏంటి?

పిజ్జా ఆర్డర్ ఇస్తున్నారా? పిజ్జా మీద సరైన టాపింగ్‌ ఎంచుకోవటం ఓ సవాలే. టాపింగ్‌ ఎక్కువయితే పిజ్జా సాగిపోతుంది. మిశ్రమంలో తేడావస్తే పిజ్జా టేస్ట్ మారిపోతుంది.

అయితే పిజ్జా టాపింగ్( పిజ్జా పైన వేసే పదార్ధాలు ) విషయంలో ఓ భిన్నమైన సమస్య ఇటీవల ఓ కోర్టుకు వచ్చింది. అది టాపింగ్ రుచి గురించి కాదు. ఆ టాపింగ్ మీద వేసే వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) గురించి. దేశంలో ఐదేళ్ల కిందట ప్రవేశపెట్టిన జీఎస్‌టీతో ప్రభుత్వ ఆదాయం అమాంతం పెరిగింది. సర్కారు ఈ పన్నుతో ప్రతి నెలా దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు ఆర్జిస్తోంది.

పరోటాకు, రోటీకి, వేర్వేరు జీఎస్టీ ఎందుకు, పార్లర్ ఐస్‌క్రీమ్‌కు, హోటల్ ఐస్‌క్రీమ్‌కు తేడా ఏంటి? అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి

8 దేశాల్లో అగ్రనేతలుగా ఉన్న భారత సంతతి నాయకులు వీళ్లే

ఫొటో సోర్స్, Reuters

4. ఎనిమిది దేశాల్లో అగ్రనేతలుగా ఉన్న భారత సంతతి నాయకులు వీళ్లే..

భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీ రిషి సునక్ బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీనిపై ప్రపంచ నేతలు స్పందిస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దీన్నొక చారిత్రక ఘటనగా అభివర్ణించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రిషి సునక్‌ను అభినందిస్తూ రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాల కోసం రాబోయే కాలంలో అతనితో కలిసి పనిచేస్తానని అన్నారు.

భారత సోషల్ మీడియాలో కూడా రిషి సునక్ సాధించిన ఈ ఘనత గురించి చాలా స్పందనలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

కొండచిలువ..

ఫొటో సోర్స్, Getty Images

5. మహిళను మింగేసిన కొండచిలువ.. ఇదెలా సాధ్యమైంది? ఇండోనేసియాలో ఏం జరిగింది?

ఇండోనేసియాలోని జాంబీ ప్రావిన్స్‌లో ఓ మహిళను కొండచిలువ పూర్తిగా మింగేసిందని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.

జారా అనే 50 ఏళ్ల మహిళ ఆదివారం ఉదయం రబ్బరు తోటలో పనికి వెళ్తుండగా కొండచిలువ దాడి చేసిందని, అనంతరం ఆమె కనిపించడం లేదని వెతకగా పొట్ట భారీగా ఉన్న కొండచిలువ ఒకటి కనిపించిందని.. అనుమానంతో దాన్ని చంపి పొట్ట చీల్చి చూడడంతో అందులో జారా మృతదేహం ఉందని స్థానికులు చెప్పారు.

జారాని చంపిన కొండచిలువ 5 మీటర్ల(సుమారు 16 అడుగులు) పొడవు ఉందని స్థానికులు చెప్పారు. అయితే, కొండచిలువలు నిజంగానే మనుషులను మింగేస్తాయా? అదెలా సాధ్యం?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)