డెంప్‌స్టర్: భయంకరమైన హైవే జర్నీ.. విజయంతంగా డ్రైవింగ్ పూర్తి చేస్తే సర్టిఫికెట్ కూడా ఇస్తారు

డెంప్‌స్టర్ హైవే

ఫొటో సోర్స్, Eyebex/Getty Images

డెంప్‌స్టర్ హైవే జర్నీ కెనడాలోని అల్టిమేట్ రోడ్ ట్రిప్స్‌లలో ఇది ఒకటి. కానీ ఈ రోడ్డుపై డ్రైవ్ చేసే వారు ఎలాంటి సమస్యలు ఎదురైనా తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి.

మా చిన్ని సెస్నా విమానం పర్వత ప్రాంతంపై ఉంది. మంచు సరస్సులు కరిగి ముదురు నీలం రంగులో గల గల పారే నీటి ప్రవాహలు, ఎటు చూసినా ఆకుపచ్చని ప్రకృతితో ఆహ్లాదకరంగా ఉంది. కొన్ని ప్రదేశాలలో, మృదువైన భూమి ఆకుపచ్చ కొండలతో కప్పబడి ఉన్నట్లు అనిపించేలా ఉంది. ఈ అందమైన ప్రకృతి దృష్యాలను కనురెప్పలు ఆర్పకుండ చూస్తుండగ. నా హెడ్‌ఫోన్‌ల నుండి ఇవే శాశ్వత మంచు కొండలు అంటూ "పింగోలు" పైలట్ వాయిస్ వచ్చింది.

ఈ విచిత్రమైన, గుండ్రని ఎత్తైన కొండల నడుమ నుండి రోడ్డు మార్గం కూడా ఉంది. కొన్ని రోజుల ముందు, నేను ఆర్కిటిక్ మహాసముద్రం వరకు డెంప్‌స్టర్ హైవేపై నుండి యుకాన్‌లోని డాసన్ సిటీ వరకు నా సుదీర్ఘ ప్రయాణం చేయడానికి ముందే ఆకాశం పై నుండి ఈ అద్భుతమైన దృశ్యాలను చూడాలని నిర్ణయించుకున్నాను.

డెంప్‌స్టర్ కెనడాలోని అత్యంత కఠినమైన డ్రైవ్‌లలో ఒకటి. ఇది క్లోన్‌డైక్ హైవే నుండి ఉపశాఖలుగా, కంకర రాళ్ళతో ఉన్న చాలా ఆకర్షణీయమైన దారి. ఇది యుకాన్ రాజధాని వైట్‌హార్స్, డాసన్ సిటీలోని క్లోన్‌డైక్ గోల్డ్ రష్ సెటిల్‌మెంట్ మధ్య 764 కిలోమీటర్లు.. దట్టమైన స్ప్రూదస్ ఫారెస్ట్‌లో పర్వతాల గుండా వెళుతుంది. వాయువ్య భూభాగాలలో ఉత్తరాన ఉన్న ఆర్కిటిక్ పట్టణం ఇనువిక్‌ వరకు దట్టమైన మంచుతో కప్పిన కొండలు మనకు దర్శనమిస్తాయి.

764 కిలోమీటర్ల పొడవైన ఈ హైవే ఎత్తైన పర్వతాలు, పెద్దపెద్ద నదులను దాటుకుని వెళ్తుంది

ఫొటో సోర్స్, Pierre Longnus/Getty Images

ఫొటో క్యాప్షన్, 764 కిలోమీటర్ల పొడవైన ఈ హైవే ఎత్తైన పర్వతాలు, పెద్దపెద్ద నదులను దాటుకుని వెళ్తుంది

1950 దశకం చివరిలో కెనడియన్ ప్రభుత్వం కెంజీ డెల్టా ప్రాంతంలో చమురు, గ్యాస్ వెలికితీయాలని నిర్ణయం తీసుకుంది. ఈ అన్వేషణలో భాగంగా డాగ్ స్లెడ్​పెట్రోల్ మార్గాన్ని గుర్తించారు. ఆ తర్వాత ఈ దారిని ఇనువిక్‌ పట్టణానికి మరో 147కిమీలు వరకు విస్తరింపజేసి, ఆర్కిటిక్ మహాసముద్రం ఒడ్డున ఉన్న చిన్న స్థావర ప్రాతంమైన టుక్టోయాక్‌టుక్ వరకు నిర్మించారు.

ఈ పొడవైన డెంప్‌స్టర్ రహదారి గుండా ప్రయాణించటం వల్ల వచ్చే అనుభూతి కెనడా అంతిమ రహదారుల ప్రయాణాలలో ఒకటిగా నిలుస్తుంది, సహజ సిద్దమైన ఉత్తర భూభాగంలోని కొండవాలు పర్వతాల గుండా కారు సాహస యాత్ర ఎంతో గొప్ప ఉల్లాసకరమైన అనుభూతిని ఇస్తుంది. ఇది ఒక హార్డ్ ల్యాండ్‌లో హార్డ్ డ్రైవ్ ( అంతేకాదు మీరు ఈ దారి మొత్తం పొడవును విజయవంతంగా డ్రైవ్ పూర్తి చేస్తే మీరు ఇనువిక్ టూరిస్ట్ ఆఫీస్ నుండి సాహవంతమైన డ్రైవ్ పూర్తి చేసినట్లు సర్టిఫికేట్ కూడా పొందుతారు ) ఎందుకంటే రహదారి చదును చేయబడలేదు, ఫోన్ సిగ్నల్ కూడా ఉండదు. ఈ సుదీర్ఘమైన రహదారి మధ్యలో ఒక ఫిల్లింగ్ స్టేషన్ మాత్రమే ఉంటుంది. సాహసోపేతమైన డ్రైవ్‌ చేయలనుకునే వారు వాళ్లకు ఎదురయ్యే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.

నేను, పైలట్, మరికొందరు సందర్శకులతో కూడిన మా చిన్న గ్రూప్.. టండ్రా నార్త్ టూర్స్ నిర్వహించే టుక్ (స్థానికులు దీనిని టక్టోయాక్టుక్ అని పిలుస్తారు) నుండి ఒక రోజు పర్యటన తర్వాత ఇనువిక్‌కి తిరిగి వస్తున్నాము. 2018 వరకు, ఇన్యూవిలియట్ (పశ్చిమ కెనడియన్ ఇన్యూట్) కుగ్రామాన్ని శీతాకాలంలో బుష్ విమానం, పడవ లేదా మంచు రహదారి ద్వారా మాత్రమే ఇక్కడికి రాగలము. అయితే ఇప్పటికీ టుక్ ప్రాంత ప్రజలు ఎక్కువగా చేపలు పట్టడం, వేటాడటంపై ఆధారపడి జీవిస్తున్నారు. వేటాడి తెచ్చిన వాటిని వారు కమ్యూనిటీ ఫ్రీజర్‌లో ( భూగర్భంలో) నిల్వ చేస్తారు.. స్థానిక గైడ్ ఎలీన్ జాకబ్సన్ తన ఇంటికి మమ్మల్ని స్వాగతించారు అక్కడి ఇన్యూట్ జాతి ప్రజల ఆహార అలవాట్లు (ఎండిన ఆర్కిటిక్ చార్) , వారి వస్త్రధారణను చూసి మేము కొంత ఆందోళనకు గురయ్యాం. ఈ కొత్త రహదారి తమ జీవితాలపై చూపే శాశ్వత ప్రభావం గురించి ఆశాజనకంగాను, భయపడుతూ ఉన్నారు వీళ్లు.

ఈ హైవే ఆర్కిటిక్ మహా సముద్రం దరిదాపుల వరకూ తీసుకెళ్తుంది

ఫొటో సోర్స్, Istvan Hernadi photography/Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ హైవే ఆర్కిటిక్ మహా సముద్రం దరిదాపుల వరకూ తీసుకెళ్తుంది

"దీని వలన బహుశా మరింత మంది పర్యాటకులు ఇక్కడికి రావచ్చు. అదేవిధంగా గ్యాస్, కిరాణా సామాగ్రి ధరలు కూడా తగ్గవచ్చు" అని ఎలీన్ చెప్పింది,

అయితే ఇక్కడ అంతర్లీనంగా ఆందోళనలు కూడా జరిగాయి. కెనడాలోని ఇతర ప్రజలకు మరింత అందుబాటులో ఉండే ఇన్యూట్, ఫస్ట్ నేషన్స్ కమ్యూనిటీలు డ్రగ్స్, ఆల్కహాల్ లాంటి అలవాటు వలన ఎలా నాశనమయ్యారో ఇక్కడ ఉన్న స్థానికులకు బాగా తెలుసు. అలాగే, ఇన్యూట్ ప్రజలు వారి సాంప్రదాయ జీవన విధానాలకు కెనడా ప్రభుత్వ మద్దతును పొందుతున్నప్పటికీ, పురాతనమైన నౌకాయాన, వేట నైపుణ్యాలు అంతరించిపోతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాటి స్థానాన్ని కొంత మేరకు భర్తీ చేస్తోంది.

అక్కడ నుండి వచ్చేసి రెండు రోజులు అవుతున్నప్పటికి ఇనువిక్‌లో ఉన్న ఇగ్లూ చర్చి, పాస్టెల్ రంగులతో వరుసగా ఉన్న అందమైన ఇల్లు గురించి ఆలోచిస్తూనే ఉన్నాను, అద్భుతమైన సాసీ బంపర్ స్టిక్కర్లు అతికించిన పాత బస్సులో వండే ఫేమస్ వంటకాలు రెయిన్ డీర్, చేపల టాకోస్ కోసం నేను ప్రతిరోజు అక్కడికి వెళ్తుండే వాడిని.

మొదట్లో అన్ని పనులు బాగానే సాగాయి. నేను నా ఎస్‌యూవీలో ఎగుడుదిగుడుగా ఉండే డెంప్‌స్టర్ రోడ్డు గుండా స్ప్రూస్ ఫారెస్ట్‌లో నావిగేట్ చేస్తూ కేవలం రెండు గంటల సమయంలోనే మకెంజీ నది ఒడ్డుకు చేరుకున్నాను.

కొద్దిసేపటి తర్వాత, ఫోర్ట్ మెక్‌ఫెర్సన్‌లోని అతి పెద్ద గ్విచిన్ సెటిల్‌మెంట్‌కు దక్షిణంగా పీల్ రివర్ ఫెర్రీ ల్యాండింగ్ నుండి నేను వెనక్కి తిరిగాను. దక్షిణాన 580కిమీ దూరంలో ఉన్న డాసన్ సిటీకి ముందు నేను చూసే చివరి పట్టణం అదే. వేసవి కాలంలో కరిగిపోయే మంచు వలన నీరు ఎక్కువగా చేరి నదిలో నీటి మట్టాలను పెంచిందని, ఇలాంటి క్లిష్టమైన సమయంలో మమల్ని నది దాటించలేమని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు "అయితే తిరిగి నది దాటించడం ఎప్పుడు ప్రారంభమవుతుంది?" అని నేను అడిగాను. అప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి నా భుజం తడుతూ. "రేపు సాధ్యం కావచ్చు, కాకపోవచ్చు" అని చెప్పాడు.

వీటిని గ్రిజ్లీ బేర్స్ అని పిలుస్తారు. ఈ హైవే ప్రయాణం మధ్యలో ఇలాంటి అడవి జంతువులు ఎన్నో సంచరిస్తూ ఉంటాయి

ఫొటో సోర్స్, milehightraveler/Getty Images

ఫొటో క్యాప్షన్, వీటిని గ్రిజ్లీ బేర్స్ అని పిలుస్తారు. ఈ హైవే ప్రయాణం మధ్యలో ఇలాంటి అడవి జంతువులు ఎన్నో సంచరిస్తూ ఉంటాయి

స్థానికుల మాదిరిగానే, ప్రకృతి దయతో నన్ను నేను కాపాడుకోగలిగాను. అయితే స్థానికుల లాగా ఇది నాకు జీవన్మరణ సమస్య కాదు. ఫోర్ట్ మెక్‌ఫెర్సన్‌లో గడ్డకట్టే సమయంలో (నవంబర్ నుండి డిసెంబరు వరకు) లేదా మంచు నదులు కరిగే సమయంలో (మార్చి నుండి ఏప్రిల్ వరకు) ఫెర్రీలు ( పడవలు) నడవనప్పుడు, మంచు రహదారి కూడా తెరవనప్పుడు వైద్యపరమైన అత్యవసర పరిస్థితిని గురించి కూడా మనం ముందుగానే ఆలోచించాల్సి ఉంటుంది.

నేను అక్కడ ఉన్న ఏకైక రిసార్ట్.. పీల్ రివర్ ఇన్‌లో ఆ రాత్రి గడిపాను, మరుసటి రోజు ఫెర్రీ ల్యాండింగ్‌కి తిరిగి వచ్చాను.ఈసారి, నేను చాలా అదృష్టవంతుడిని. వేసవిలో కరిగిన మంచు నీరు తగ్గింది, నా కారు నది నుండి దాటించేశారు. నేను నా ఎస్‌యూవిని చాలా ఉత్సహంగా డ్రైవ్ చెయ్యడం ప్రారంభించాను.

దట్టమైన అడవి రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లతో కప్పేసినట్టు ఉంది, నేను కారు బ్రేక్ నొక్కినప్పుడు నా చక్రాల క్రింద నుండి కంకర రాళ్లు ఎగిరిపడుతున్నాయి. ప్రకృతి ఒడిలో చాలా హాయిగా ఉంది. కొన్ని గంటల్లోనే, ఎత్తైన రాతి కొండలను, మంచుతో కప్పబడిన టండ్రా, హిమ నదులను దాటి వచ్చేశాను.

"నేను మళ్ళీ నీరుకారిపోకముందే నా ఫ్లైట్‌ను తయారు చేసుకోవాలి" అని అనుకున్నాను. కానీ నా ప్రయాణ ప్రణాళికల క్రమాన్ని మార్చుకోవాల్సిన అవాంతరంతో పాటు, నేను ఈ ప్రాంతాల్లో ఒంటరిగా ఉండకూడదనుకుంటున్నాను. ఈ నిర్ణయానికి మరింత బలమైన కారణం కూడా ఉంది. నాకు ఆందోళన కలిగించేది ఆకలి, దాహం కాదు, గ్రిజ్లీ బేర్స్ దాడులు చేస్తాయేమో అని నాకు ఆందోళనగా ఉంది. వేసవిలో కెనడా ఆర్కిటిక్ ప్రాంతంలో ఎక్కువగా కనిపించే అడవి మంటలను చూసి చాలా భయపడ్డాను. ఈ వాయువ్య ప్రాంతాల్లో అడవి మంటలు, పొగల గుండా డ్రైవ్ చేయాల్సి రావడమే నా భయానికి కారణం.

ఈ హైవే ప్రయాణాన్ని పూర్తి చేసిన డ్రైవర్ కెనడాలో మొనగాడు డ్రైవర్ కిందే లెక్క

ఫొటో సోర్స్, Pierre Longnus/Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ హైవే ప్రయాణాన్ని పూర్తి చేసిన డ్రైవర్ కెనడాలో మొనగాడు డ్రైవర్ కిందే లెక్క

అదృష్టవశాత్తూ ఆ రోజు డెంప్‌స్టర్ వెంబడి వాతావరణం అనుకూలించింది. అదేవిధంగా నా చుట్టూ ఉన్న అడవి తేమగా ఉండి పొగమంచుతో కప్పబడి ఉంది. అంతలోనే వర్షం కూడా మొదలవ్వటంతో కాస్త ఉపశమనం పొందాను . నా విండ్‌షీల్డ్‌పై వర్షం చినుకులు పడుతుడటం వలన ఉపశమనం కాస్తా ఆందోళనకు దారితీసింది. ఇంకేముంది, అసలే కంకర రోడ్డు బురదగా మారడంతో కారు పక్కకు జారిపోతూవుంది, కారును చాలా జాగ్రత్తగా స్థిరంగా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాను. అలా కాకుండా కార్ పక్కకు పెట్టి అక్కడే ఉండటం పెను ప్రమాదంగా మారే అవకాశం కూడా ఉంది.

డెంప్‌స్టర్ సెంటర్ పాయింట్ అయిన ఈగిల్ ప్లెయిన్స్ మోటెల్‌ రెస్టారెంట్‌కు చేరుకోగానే నేను చాలా సంతోషించా. తీవ్రమైన చలి కారణంగా నాకు వణుకు కూడా వచ్చేసింది.

మోటెల్ రెస్టారెంట్‌లోకి వెళ్ళగానే వెయిటర్ నన్ను చూసి నా దగ్గరకు వచ్చింది, మెత్తం ఖాళీగా ఉన్న డైనింగ్ రూమ్ వైపు చూస్తూ, నాకు ఏమి జరిగిందో ఆమెకు వివరించాను. నేను ఆర్డర్ చేసిన బర్గర్లు, మీట్‌లోఫ్ వంట చేస్తున్నప్పుడు వచ్చే గుమ గుమ లాడే వాసనకే నా కడుపు సగం నిండిపోయింది.

డెంప్‌స్టర్‌ రోడ్డు మార్గంలో చాలా వరకు ఫోన్ సిగ్నల్ ఉండదు, అక్కడ ఎవరి దగ్గర శాటిలైట్ ఫోన్ కూడా లేదు.

వీడియో క్యాప్షన్, ఈ ఊరిలో పుష్ప, ఆచార్య సహా ఎన్నో సినిమాలు చిత్రీకరించారు

నేను నిజానికి ఇనువిక్ వరకు డ్రైవ్ చేసినప్పుడు, మొదటి రోజునే దాదాపు డెంప్‌స్టర్ వచ్చిందని ఆమె నాకు చెప్పారు. ఎలాంటి దుర్ఘటనలు లేకుండా డ్రైవ్‌లో మొదటి సగ భాగం దాదాపు 360 కి.మీ ప్రయాణం చేసిన తర్వాత , నేను ఆభద్రతా భావనలోకి వెళిపోయాను. "నా గైడ్‌బుక్‌లో ఒకటి కాదు రెండు స్పేర్ టైర్లు ఎందుకు కావాలని ఎలా ఆశ్చర్యపోయాను".. నాలో నేను పనిలేకుండా అనుకుంటున్నాను. కొద్దిసేపటికే, నా కారు మెరాయించడం ప్రారంభించింది, నేను నా ఆలోచనల నుండి బయటపడ్డాను. అంతలోనే నా వెనుక టైర్లలో ఒకటి పంక్చర్ అయిందని నేను గ్రహించాను.

కంకరతో కూడిన డెంప్‌స్టర్ లాంటి దారిలో కార్లు పంక్చర్ అవడం సాధారణమైన విషయం అని నేను ఎప్పుడో గ్రహించాను. అందుకే జాక్ , రెంచ్‌లను ముందే తెచ్చుకున్నాను, వాటితో మార్చగలను. కానీ మళ్లీ అది ఏమైనా అవ్వొచ్చు అని ఈగల్ మైదానాల మీదుగా కొన్ని కిలోమీటర్ల సమీపంలోని మెకానిక్ దగ్గరకు వెళ్లి కారు రిపేర్ చేయించుకొని, అదే రోజు ఇనువిక్‌కి చేరుకోగలిగాను.

ఇప్పుడు, నేను డాసన్ సిటీకి తిరిగి వెళ్ళేటప్పుడు, క్లోన్‌డైక్ హైవేకి తిరిగి వెళ్లే సమయంలో చివరి సగం ప్రయాణం సజావుగా సాగింది, అడవి కొంచెం పల్చబడి మైదానాలు కనిపించాయి, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, రోడ్డు బాణం వలే సూటిగా ఉండటంతో జర్నీ సజావుగా సాగింది. అయితే, నేను డెంప్‌స్టర్-క్లోన్‌డైక్ జంక్షన్‌ను దాటగానే, బలంగా చెక్క తగలడంతో పెట్రోల్ ట్యాంక్ పగిలిపోయింది. పెట్రోల్ ట్యాంక్ సెకన్లలో ఖాళీ అవ్వడం చూసి ఆశ్చర్యానికి గురయ్యాను, దానికి తోడు ఇంజిన్ కూడా చెడిపోయి కారు ఆగిపోయింది. డెంప్‌స్టర్ డ్రెవ్‌లో ఎదురయ్యే సవాళ్లను మరోసారి గుర్తు చేసుకున్నాను.

ఫోన్ సిగ్నల్ లేదు, నేను డాసన్ సిటీకి తూర్పున 40కిమీ దూరంలో ఉన్న క్లోన్‌డైక్ హైవేపై నిలబడి ఉన్నాను, కారు వదిలేసి నా గమ్యం చేరాలని నిర్ణయించుకున్నాను, అంతలోనే దేవుడిలా ఒక వ్యక్తి వచ్చి నన్ను డాసన్ సిటీలోని నా గెస్ట్‌హౌస్‌కి తీసుకువెళుతున్నప్పుడు, ఇది డెంప్‌స్టర్ థ్రిల్లింగ్ డ్రైవ్ ఆకర్షణలో భాగమని నేను గ్రహించగలిగాను, నేను ఎప్పుడు విపత్తు దగ్గరికి వచ్చినా, అదృష్టం నన్ను చూసి నవ్వుతుంది.

నాకు తెలిసి డెంప్‌స్టర్ డ్రైవ్ కెనడాలోని చాలా క్లిష్టమైన రహదారుల్లో అన్నింటికంటే అంత కఠినమైనది ఏమి కాదు. కానీ మంచి థ్రిల్లింగ్ ఇచ్చే డ్రైవ్.

వీడియో క్యాప్షన్, హ్యారీ పోటర్‌లా ప్రయాణించాలని ఉందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)