China: తన చిన్ననాటి జ్ఞాపకాలతో గ్రామం మ్యాప్ గీశాడు.. కిడ్నాప్ అయిన 30 ఏళ్ల తర్వాత కన్నతల్లిని కలిశాడు

ఫొటో సోర్స్, Beijing News / Weibo
నాలుగేళ్ళ వయసులో చైల్డ్ ట్రాఫికింగ్‌కు గురైన లి జింగ్‌వీ 30 ఏళ్ల తర్వాత ఈ ఏడాది జనవరి 1వ తేదీన తిరిగి తన తల్లిని కలిశారు.
30 సంవత్సరాల క్రితం కిడ్నాప్ చేయబడిన ఒక చైనా వ్యక్తి తన చిన్ననాటి గ్రామం ఎలా ఉంటుందో మ్యాప్‌ను గీశారు. తన జ్ఞాపకాలతో గీసిన ఈ మ్యాప్ అతని జీవితాన్నే మార్చేసింది. తిరిగి అతను తన తల్లిని కలిశారు.
అతని పేరు లి జింగ్‌వీ. నాలుగేళ్ల వయసులో అతను మోసగాళ్ల వలలో చిక్కుకున్నారు.
1989లో యునాన్ ప్రావిన్స్‌లోని ఝాటోంగ్ నగరానికి సమీపంలో లి జింగ్‌వీ కిడ్నాప్ అయ్యారు. చిన్నపిల్లల అక్రమ రవాణా ముఠా అతనిని 1,800కిమీల దూరంలో ఉన్న కుటుంబానికి అమ్మేసింది.
చైనాలో డౌయిన్ అనే ఒక వీడియో షేరింగ్ యాప్ ఉంది. అందులో వీడియోలు షేర్ చేస్తుంటారు.
డిసెంబర్ 24వ తేదీన లి జింగ్‌వీ ఈ యాప్‌లో ఒక మ్యాప్‌ను షేర్ చేశారు.
ఇది ఆయన తన చిన్నప్పటి జ్ఞాపకాల నుంచి చేతితో గీసిన మ్యాప్.
ఈ గ్రామం మ్యాప్‌లో పాఠశాలను పోలిన ఒక భవనం, వెదురు పొదలు, చిన్న చెరువు ఉన్నాయి.
తన కొడుకు కనిపించట్లేదని ఫిర్యాదు చేసిన ఒక మహిళ గతంలో చెప్పిన వివరాలతో ఈ మ్యాప్‌లో వివరాలు సరిపోయాయని భావించిన పోలీసులు వీళ్లిద్దరినీ కలిపే ప్రయత్నం చేశారు.
తొలుత ఇరువురికీ డీఎన్ఏ పరీక్షలు చేశారు. అవి మ్యాచ్ కావడంతో తల్లీకొడుకులు జనవరి 1వ తేదీ శనివారం యునాన్ ప్రావిన్స్‌లో తిరిగి కలిశారు.

ఫొటో సోర్స్, BEIJING NEWS / WEIBO
మూడు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా కలుసుకున్న ఈ తల్లీకొడుకుల వీడియో కూడా వైరల్ అయ్యింది. లి జింగ్‌వీ తన తల్లి పెట్టుకున్న మాస్కును తీసేశాడు. ఆమె ముఖాన్ని చూశాడు. కన్నీళ్లు పొంగుకు వస్తుండగా ఆమెను కౌగిలించుకుని, తనివితీరా ఏడ్చేశాడు.
"33 సంవత్సరాల్లో లెక్కలేనన్ని రాత్రులు ఎదురుచూశాను. నా జ్ఞాపకాల నుంచి వచ్చిన ఈ మ్యాప్ నా కలను నిజం చేసింది. 13 రోజుల తర్వాత నా తల్లిని కలుసుకునేందుకు ఇదే సరైన సమయం. నా కుటుంబంతో తిరిగి నేను కలవడానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు'' అని లి జింగ్‌వీ తన తల్లిని కలవడానికి ముందు డౌయిన్ ప్రొఫైల్‌లో రాశారు.
ఇన్నేళ్లుగా దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్సులో నివసిస్తున్న ఆయన తన కన్న తల్లిదండ్రుల గురించిన సమాచారాన్ని తన పెంపుడు తల్లిదండ్రుల నుంచి రాబట్టలేకపోయారు. అలాగే, తన మూలాల గురించి డీఎన్ఏ డేటాబేస్‌లో వెతికినా ఆయనకు ఫలితం లభించలేదు. అయితే, కన్నతల్లిని కలవాలనే ఆయన తాపత్రయానికి ఇంటర్నెట్ సహాయం చేసింది.
"నేను ఇల్లు వెతుక్కుంటున్న పిల్లోడిని. 1989లో నాకు నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, పొరుగున ఉండే బట్టతల అంకుల్ నన్ను హెనాన్‌కు తీసుకెళ్లారు" అని లి జింగ్‌వీ వీడియోలో చెప్పారు. ఈ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ వీడియోలోనే తన చిన్ననాటి గ్రామం తాలూకు జ్ఞాపకాలను మ్యాప్ రూపంలో పంచుకున్నారు.

ఫొటో సోర్స్, JIMU NEWS / WEIBO
చైనాలో చిన్న పిల్లల కిడ్నాప్‌లు చాలా సాధారణం. ఎందుకంటే ఒక కొడుకు ఉండటం గొప్ప అని భావించే సమాజం ఇది.
చాలా మంది పిల్లలు చిన్న వయసులోనే కిడ్నాప్‌కు గురవుతుంటారు. ఇలాంటి పిల్లల్ని చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలు ఇతర కుటుంబాలకు అమ్ముతుంటారు.
చైనాలో ప్రతి సంవత్సరం కనీసం 20 వేల మంది పిల్లలు అపహరణకు గురవుతున్నారని 2015లో అంచనా వేశారు.
చాలా కాలం తర్వాత తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను కలుస్తున్న పిల్లలు 2021వ సంవత్సరంలో ఎక్కువయ్యారు.
గత జూలైలో, షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లో అపహరణకు గురైన తన కొడుకును గువో గాంగ్టాంగ్ 24 ఏళ్ల తర్వాత కలిశారు.
ఇవి కూడా చదవండి:
- బుల్లీ బాయి-సుల్లీ డీల్స్ ఏంటి? యాప్‌లో భారతీయ ముస్లిం యువతుల వేలంపై పోలీసులు ఏమంటున్నారు?
- మొబైల్ ఫోన్ కొనేటప్పుడు గుర్తుంచుకోవలసిన ఏడు విషయాలు
- ఆంధ్రప్రదేశ్: ఇద్దరు గిరిజన బాలికలపై నకిలీ పోలీసు అఘాయిత్యం.. అత్యాచారం కేసు నమోదు
- అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెట్టిన చైనా, తీవ్రంగా స్పందించిన భారత్
- దళిత యువకుడు గెడ్డం శ్రీనుది హత్యా, ఆత్మహత్యా... మూడునెలలుగా ఎందుకు తేలడం లేదు?
- వాట్సాప్ మెసేజ్‌లో లింక్ క్లిక్ చేయమన్నారు... రెండున్నర లక్షలు కొల్లగొట్టారు - ప్రెస్‌రివ్యూ
- కొత్త ఏడాదిలో కాస్త హేతుబద్ధంగా ఉందామా... ఇవిగో మూడు మార్గాలు
- RRR విడుదల వాయిదా: కోవిడ్‌తో దెబ్బతిన్న సినిమా థియేటర్ల భవిష్యత్తు ఏంటి... ఓటీటీల ప్రభావం ఎంత?
- హైదరాబాద్‌లో పెరిగిన పెళ్లిళ్లు.. అమ్మాయిల వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచే బిల్లు గురించి ఎందుకు భయపడుతున్నారు?
- చరిత్రలో మొట్టమొదటి రివెంజ్ పోర్న్ కేసు.. భార్య నగ్న చిత్రాలు బయటపెట్టిన భర్త.. ఏం జరిగింది?
- మరోసారి రష్యా నమ్మకం గెలుచుకున్న భారత్... అమెరికాను దూరం పెడుతోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)













