బ్రిటన్ కన్సర్వేటివ్ ఎంపీ సర్ డేవిడ్ ఆమెస్ హత్య ఉగ్రవాద చర్యే - పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటన్‌లో కన్సర్వేటివ్ ఎంపీ సర్ డేవిడ్ ఆమెస్ కత్తిపోట్లకు గురై మృతి చెందారు. తన ఎసెక్స్ నియోజకవర్గంలో ప్రజలను కలుసుకుంటున్నప్పుడు ఆయనపై ఈ దాడి జరిగింది.
స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.05 లీ-ఆన్-సీ వద్ద ఈ ఘటన జరిగిందని ఎసెక్స్ పోలీసులు తెలిపారు.
ఘటనా స్థలంలో కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు హత్యకు పాల్పడ్డారనే అనుమానంతో ఒక 25 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు.
ఈ హత్యకు ‘ఇస్లామిస్ట్ తీవ్రవాదంతో సంబంధాలు’ ఉండేందుకు అవకాశాలు ఉన్నాయని మెట్రోపాలిటన్ పోలీసులు చెప్పారు. ఈ హత్యను ఉగ్రవాద చర్యగా పోలీసులు ప్రకటించారు.

ఫొటో సోర్స్, ANTHONY FITCH
బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్, "ఆయన చాలా గొప్ప మనిషి. గొప్ప స్నేహితుడు. ఆయన ఒక ఎంపీగా ప్రజాస్వామిక విధులను నిర్వర్తిస్తూ హత్యకు గురయ్యారు" అని అన్నారు.
"సర్ డేవిడ్ ఆత్మకు శాంతి కలగాలి. వెనుకబడిన వర్గాల ప్రజలు, మూగ జీవుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేసిన సర్ డేవిడ్ మృతి సౌతెండ్ వెస్ట్ ప్రజలకు తీరని లోటు" అని విద్యా మంత్రి నధీమ్ జహావి అన్నారు.
అని కన్సర్వేటివ్ పార్టీ మాజీ నేత సర్ ఐయాన్ డంకన్ స్మిత్ అంతకు ముందు ట్వీట్ చేస్తూ, "డేవిడ్ త్వరలో పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నా" అని అన్నారు.
"ఈ వార్త నన్ను విస్మయానికి గురి చేసింది. రాజకీయాల్లో కానీ మరే రంగంలోనైనా సరే ఇలాంటి హింసాత్మక ప్రవర్తనలను ఎంత మాత్రం సహించడానికి వీల్లేదు" అని ఆయన అన్నారు.
సౌతెండ్ వెస్ట్ ఎంపీ అయిన 69 ఏళ్ల డేవిడ్ తన నియోజకవర్గ ప్రజలను బెల్‌ఫెయిర్స్ మెథాడిస్ట్ చర్చి వద్ద కలుసుకున్నప్పుడు ఆయనపై కత్తితో దాడి జరిగింది. వెంటనే హెలికాప్టర్ అంబులెన్స్ అక్కడికి చేరుకుని ఆయనను ఆస్పత్రికి తరలించింది.
దాడి జరిగినప్పుడు అక్కడే ఉన్న సౌతెండ్ కౌన్సిలర్ జాన్ లాంబ్, "ఆమెస్ ఎప్పుడూ ప్రజలకు సహాయపడాలనే ప్రయత్నించేవారు. ముఖ్యంగా శరణార్థులను ఆదుకోవడానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చేవారు. నమ్మిన విషయాల పట్ల ధృఢంగా పోరాడే స్వభావం కలిగిన నాయకుడు" అని అన్నారు.
డేవిడ్ ఆమెస్‌కు నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
ఆమెస్‌ను హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు కానీ, ఘటనా స్థలంలోనే మెడికోలు ఆయనకు ఆపరేషన్ చేశారని లాంబ్ బీబీసీతో చెప్పారు. ఎంపీ కండిషన్ సీరియస్‌గా ఉందని ఆయన అన్నారు. ఆ తరువాత కాసేపటికే ఆయన మరణవార్త వినాల్సి వచ్చింది.
ఎవరీ సర్ డేవిడ్ ఆమెస్...
దాదాపు 40 ఏళ్లుగా కన్సర్వేటివ్ ఎంపీగా ఉన్న సర్ డేవిడ్ ఆమెస్ 1983లో తొలిసారి బాసిల్డన్ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 1997లో ఆయన పక్కనే ఉన్న సౌతెండ్ వెస్ట్ నుంచి పోటీ చేసి గెలిచారు.
రోమన్ క్యాథలిక్‌గా పుట్టి పెరిగిన సర్ డేవిడ్ సామజిక న్యాయం కోసం కృషి చేశారు. అబార్షన్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. జంతువుల పరిరక్షణ కోసం కృషి చేసారు. సౌతెండ్ పట్టణానికి నగర హోదా కల్పించడానికి దీర్ఘకాలం పోరాటం చేసి విజయం సాధించిన నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోందా, కరెంటు కోతలు ఇంకా పెరుగుతాయా?
- మంజులా ప్రదీప్: దళిత మహిళల హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారిణి
- ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్
- కోవిడ్-19: మా అమ్మను డాక్టర్లు గినియా పిగ్లా భావించి ప్రయోగాలు చేశారు
- జీ-20 సదస్సులో నరేంద్ర మోదీ: 'అఫ్గానిస్తాన్‌ను తీవ్రవాదానికి కేంద్రంగా మారనివ్వద్దు'
- వాతావరణ మార్పులు: కాప్-26లో భారత్, చైనా చేతులు కలిపి అమెరికానే ప్రతిఘటిస్తాయా?
- మోదీ తీసుకొస్తున్న ‘బలవర్ధక బియ్యం’ ఏంటి? ఈ అన్నం తింటే దేశ ప్రజల ఆరోగ్యం మెరుగవుతుందా?
- మాట్లాడే బాతు.. 'యూ బ్లడీ ఫూల్' అంటూ తిట్లు.. ఆస్ట్రేలియాలో వింత
- కేంద్ర ప్రభుత్వ కేవైసీ-వీఎస్.. వ్యాక్సీన్ వేసుకున్నామని అబద్ధం చెబితే దొరికిపోతారు
- భూపేంద్ర పటేల్ ఎవరు? మొదటిసారి ఎమ్మెల్యేని బీజేపీ సీఎం చేసింది ఎందుకు?
- అఫ్గానిస్తాన్: గత 20 ఏళ్లలో ఏం మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








