జీ-20 సదస్సులో నరేంద్ర మోదీ: 'అఫ్గానిస్తాన్‌ను తీవ్రవాదానికి కేంద్రంగా మారనివ్వద్దు'

ఫొటో సోర్స్, NarendraModi/Twitter
అఫ్గానిస్తాన్‌ను తీవ్రవాదానికి కేంద్రంగా మారకుండా చూడాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ-20 సదస్సులో పిలుపునిచ్చారు.
అఫ్గానిస్తాన్ అంశంపై ఇటలీ మంగళవారం నిర్వహించిన 'జీ20 అసాధారణ సదస్సు'లో మోదీ వర్చువల్‌గా పాల్గొని మాట్లాడుతూ, "తీవ్రవాదానికి, తిరుగుబాటు ధోరణికి అఫ్గానిస్తాన్ ఆవాసం కాకుండా నిరోధించాలి" అని అన్నారు.
ఆ ప్రాంతంలో ఉగ్రవాదం, తిరుగుబాటు ధోరణి, మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా పెచ్చుమీరకుండా కలిసి పోరాడాలని మోదీ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అలాగే, అఫ్గాన్ ప్రజలకు మానవతా దృక్పథంతో సాయం అందించాలని మోదీ పిలుపునిచ్చారు.
ప్రస్తుతం జీ20 సముదాయానికి ఇటలీ అధ్యక్షత వహిస్తోంది. ప్రస్తుత సమావేశానికి ఇటలీ ప్రధాని మారియో డ్రాగి అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాదం, మానవ హక్కులు, మానవతావాదం మీదుగా చర్చలు సాగాయి.
అఫ్గానిస్తాన్ గురించి చర్చించే విషయంలో చొరవ తీసుకున్నందుకు మోదీ ఇటలీని అభినందించారు.
శతాబ్దాలుగా భారత, అఫ్గాన్ ప్రజల మధ్య ఉన్న స్నేహసంబంధాలను ప్రధాని గుర్తుచేశారు.
గత రెండు దశాబ్దాల్లో అఫ్గానిస్తాన్ సామాజిక ఆర్థికాభివృద్ధి పథకాల్లో భారతదేశం పాలుపంచుకున్నదని మోదీ అన్నారు.
అఫ్గానిస్తాన్‌లో 500ల కన్నా ఎక్కువ అభివృద్ధి ప్రాజెక్టుల్లో భారతదేశం పెట్టుబడి పెట్టిందని గుర్తుచేశారు.
అఫ్గాన్ ప్రజలకు సాయం అందించేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని మోదీ పిలుపునిచ్చారు.
గత రెండు దశాబ్దాలుగా అఫ్గానిస్తాన్ సాధించిన ప్రగతి కుంటుపడకుండా ఉండాలంటే ప్రభుత్వంలో మైనారిటీలకు, మహిళలకు చోటు కల్పించాలని మోదీ అన్నారని పీఎంఓ ఆఫీసు తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- తాలిబాన్లతో ట్రంప్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందమే అఫ్గానిస్తాన్ ప్రస్తుత సంక్షోభానికి కారణం: అమెరికా రక్షణ అధికారులు
- అఫ్గానిస్తాన్: తమకు శిక్షలు విధించిన మహిళా జడ్జిలను వెంటాడుతున్న తాలిబాన్లు
- అఫ్గానిస్తాన్: తాలిబాన్ పాలనలో బిడ్డకు జన్మనివ్వడం అంటే ఎలా ఉంటుంది..
- అఫ్గానిస్తాన్ యుద్ధంతో వేల కోట్లు లాభం పొందిన 5 కంపెనీలు ఇవే..
- ‘వ్యాక్సీన్ వేసుకోను అన్నందుకు నా ఉద్యోగం తీసేశారు’
- అఫ్గానిస్తాన్: సేనల ఉపసంహరణ తర్వాత తొలిసారి తాలిబాన్లతో అమెరికా చర్చలు
- చైనా ముప్పును ఎదుర్కోడానికి భారత వాయు సేన సన్నద్ధంగా ఉందా?
- భారత్-పాక్ యుద్ధం 1971: చెరువులో నీటి అడుగున దాక్కొని ప్రాణాలు కాపాడుకున్న భారత సైనికుడి కథ
- మలేరియాపై పోరాటంలో చరిత్రాత్మక ముందడుగు.. వ్యాక్సినేషన్‌కు అనుమతి
- టీటీడీ బోర్డును జగన్ తన 'సంపన్న మిత్రుల క్లబ్'గా మార్చేశారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








