పాకిస్తాన్‌లో భూకంపం - 20 మంది మృతి

పాకిస్తాన్‌లో భూకంపం

ఫొటో సోర్స్, Yazdani Tareen

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌లో భూకంపం

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్సులో గురువారం భూకంపం సంభవించింది. ఇందులో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు బీబీసీకి తెలిపారు.

భవనాలు కూలి చాలా మంది మరణించి ఉంటారని, దీంతో, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

మరణించిన వారిలో చాలా మంది మహిళలు పిల్లలు ఉన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.

భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు పై 5.9, భూగర్భానికి 9 కిలోమీటర్ల లోతులో నమోదైనట్లు అమెరికా జియలాజికల్ సర్వే తెలిపింది. ఈ రకమైన భూకంపాలు కలుగచేసే హాని ఎక్కువగా ఉంటుంది.

భూకంప ప్రభావిత ప్రాంతం దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ భూకంపంలో మరో 150 మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానిక అధికారులు బీబీసీ ఉర్దూకి తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అందులో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది.

వైద్యులు తమ మొబైల్ ఫోన్లను టార్చి లైట్లలా వాడి గాయపడిన వారు స్ట్రెచర్ల పై ఉండగానే చికిత్స మొదలుట్టినట్లు రాయిటర్స్ ప్రచురించింది.

ఈ భూకంపంలో100కి పైగా మట్టి ఇళ్లు కూలిపోగా, అధిక సంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. దీంతో, అనేక మంది నిరాశ్రయులైనట్లు ఒక అధికారి రాయిటర్స్‌కు తెలిపారు.

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి

ఫొటో సోర్స్, FC BALOCHISTAN

ఫొటో క్యాప్షన్, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి

భూకంపం తర్వాత కెట్టా ప్రజలు వీధుల్లో కొచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

హర్నయి జిల్లాలో అత్యధిక నష్టం వాటిల్లినట్లు అధికారులు చెప్పారు.

కెట్టాకు తూర్పు భాగంలో ఉన్న కెట్టా అత్యధిక బొగ్గు గనులున్న ప్రాంతం. భూకంపాల సమయంలో ఈ గనులు కూలిపోయే ప్రమాదం ఉంది.

అత్యవసర సహాయక బృందాలను ఆ ప్రాంతానికి పంపించినట్లు బలూచిస్తాన్ ఇంటీరియర్ మంత్రి మీర్ జియాఉల్లా లాంగు బీబీసీకి చెప్పారు.

పాకిస్తాన్‌లో భూకంపం

ఫొటో సోర్స్, FC BALOCHISTAN

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్సు
ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్సు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)