Pak Vs NZ: చివరి నిమిషంలో పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకున్న న్యూజీలాండ్

న్యూజిలాండ్ క్రికెట్ టీమ్

ఫొటో సోర్స్, Reuters

పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన న్యూజీలాండ్‌ క్రికెట్ టీం చివరి నిమిషంలో టోర్నీని పూర్తిగా రద్దు చేసుకుంది.

పాకిస్తాన్‌తో తొలి వన్డే ప్రారంభానికి ముందు న్యూజీలాండ్ ఈ నిర్ణయం తీసుకుంది.

భద్రతా కారణాలను చూపుతూ రావల్పిండి స్టేడియంలో అడుగుపెట్టడానికి న్యూజీలాండ్ జట్టు నిరాకరించింది.

ఈ స్టేడియంలోనే న్యూజీలాండ్‌, పాకిస్తాన్‌ మధ్య ఇవాళ (శుక్రవారం) తొలి వన్డే మ్యాచ్ జరగాల్సి ఉంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

18 సంవత్సరాల తర్వాత న్యూజీలాండ్ జట్టు పాకిస్తాన్ గడ్డపై క్రికెట్ ఆడటానికి వచ్చింది. రావల్పిండిలో రెండు జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. దీని తర్వాత లాహోర్‌లో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగాల్సి ఉంది.

"పాకిస్తాన్‌లో పెరుగుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని, జట్టు భద్రతా సలహాదారులతో సంప్రదించిన తర్వాత, ఈ పర్యటనను కొనసాగించకూడదని జట్టు నిర్ణయించింది" అని న్యూజీలాండ్ క్రికెట్ అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.

पाकिस्तान-न्यूज़ीलैंड क्रिकेट

ఫొటో సోర్స్, PCP

తనకు అందిన సలహా మేరకు ఈ పర్యటనను కొనసాగించడం సాధ్యం కాదని న్యూజీలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ అన్నారు.

"పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఇదొక ఎదురుదెబ్బ అని నేను అనుకుంటున్నాను. వారు అద్భుతమైన ఆతిథ్యమిచ్చారు. కానీ మేము ఆటగాళ్ల భద్రతకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం" అని ఆయన అన్నారు.

తమ జట్టును తిరిగి స్వదేశం రప్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు న్యూజీలాండ్ తెలిపింది.

న్యూజీలాండ్ క్రికెట్ ప్లేయర్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హీత్ మిల్స్ కూడా ఈ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించారు. ఆటగాళ్లు సురక్షితంగా ఉన్నారని, వారి భద్రత కోసం మేమంతా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

అయితే, న్యూజీలాండ్ నిర్ణయం ఏకపక్షమని, నిరాశజనకమని పాకిస్తాన్ క్రికెట్ బ్రోర్డ్ అభివర్ణించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)