బ్రాలో దాక్కుని 6,500 కిలోమీటర్లు ప్రయాణించిన బల్లి

ఫొటో సోర్స్, RSPCA
ఓ మహిళ బ్రాలో దాక్కున్న బల్లి అట్లాంటిక్ మహా సముద్రం మీదుగా బార్బడోస్ నుంచి బ్రిటన్‌లోని యార్క్‌షైర్ వరకు విమానంలో వచ్చేసింది.
ఈ చిన్న బల్లిని బార్బీ అని పిలుస్తున్నారు. సౌత్ యార్క్‌షైర్‌లో తన ఇంటికి చేరుకున్న అనంతరం, సూట్‌కేస్‌లోని బట్టలను బయటకు తీస్తుండగా లీసా రషెల్ దీన్ని చూశారు.
''అది అటూఇటూ కదలడం చూసి ఒక్కసారిగా గట్టిగా అరిచాను. 4,000 మైళ్ల(సుమారు 6,500 కిలోమీటర్లు) ప్రయాణం తర్వాత, బ్రాలో ఇలాంటి జీవి ఉంటుందని ఎవరు అనుకుంటారు''
ప్రస్తుతం బార్బీ.. రాయల్ సొసైటీ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు ఎనిమల్స్ (ఆర్ఎస్‌పీసీఏ) సంరక్షణలో ఉంది.

ఫొటో సోర్స్, RSPCA
కరీబియన్ దీవిలో విహారయాత్రకు వెళ్లివచ్చిన అనంతరం, మంగళవారం ఇంటిలో తన బట్టలను లీసా ఒక్కొక్కటిగా బయటకు తీశారు.
''మొదట బ్రాపై దీన్ని చూసినప్పుడు, ఏదో మరక పడిందని అనుకున్నాను. బ్రాను గట్టిగా ఊపగానే అది కిందపడి కదిలింది. దీంతో అది బల్లి అని అర్థమైంది.''
''ఆ బల్లి నిజంగా అదృష్టవంతురాలు. ఎందుకంటే అది సూట్‌కేస్‌లో పైనే ఉన్నప్పటికీ, బయట వేడిగా ఉందని నేను బ్రా వేసుకోలేదు. లేకపోయుంటే..''అని లీసా అన్నారు.
''యార్క్‌షైర్‌కు వచ్చేటప్పుడు సూట్‌కేస్‌లో బట్టలను కుక్కేందుకు నేను దానిపై కూర్చున్నాను. అయితే, అదృష్టవశాత్తు సూట్‌కేసులోని బల్లికి ఏమీకాలేదు.''

ఫొటో సోర్స్, RSPCA
బార్బీ బొమ్మ పేరు మీదే ఈ బల్లికి ఆ పేరు పెట్టారు. 24 గంటలపాటు ఇది సూట్‌కేస్‌లో అలానే ఉండిపోయింది.''
ఈ చిన్న బల్లిని తీసుకెళ్లేందుకు లీసా ఇంటికి ఆర్‌ఎస్‌పీసీఏ ఇన్‌స్పెక్టర్ వచ్చారు.
''ఈ బల్లిని ఇలా తీసుకురాకూడదు. ఎందుకంటే ఇది ఇక్కడి జీవి కాదు. ఇక్కడ వాతావరణంలో ఇది మనుగడ సాగించలేదు''అని ఆర్‌ఎస్‌పీసీఏకు చెందిన శాండ్రా డ్రాన్స్‌ఫీల్డ్ అన్నారు.
ప్రస్తుతం ఈ బల్లి నిపుణుల పర్యవేక్షణలో ఉంది. దాని ఆరోగ్యం బాగానే ఉందని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- బీజేపీ నిశ్శబ్దంగా ముఖ్యమంత్రుల్ని ఎలా మారుస్తోంది? పార్టీలో ఎవరూ గొంతెత్తరు ఎందుకు?
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- బిగ్‌బాస్-5లో తొలి ఎలిమినేషన్
- మాట్లాడే బాతు.. 'యూ బ్లడీ ఫూల్' అంటూ తిట్లు.. ఆస్ట్రేలియాలో వింత
- కేంద్ర ప్రభుత్వ కేవైసీ-వీఎస్.. వ్యాక్సీన్ వేసుకున్నామని అబద్ధం చెబితే దొరికిపోతారు
- భూపేంద్ర పటేల్ ఎవరు? మొదటిసారి ఎమ్మెల్యేని బీజేపీ సీఎం చేసింది ఎందుకు?
- అఫ్గానిస్తాన్: గత 20 ఏళ్లలో ఏం మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








