రవి కుమార్ దహియా: ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయం చేసిన రెజ్లర్

ఫొటో సోర్స్, Reuters
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది.
భారత రెజ్లర్ రవి కుమార్ దహియా పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల కుస్తీ పోటీ సెమీ ఫైనల్‌లో విజయం సాధించి ఫైనల్స్‌లో అడుగుపెట్టారు.
సెమీ ఫైనల్లో కజకిస్తాన్ రెజ్లర్ నూరిస్లామ్‌ను ఓడించిన రవికుమార్ భారత్‌కు పతకం ఖాయం చేశారు.
ఇక ఫైనల్లో గెలిస్తే గోల్డ్ లేదంటే సిల్వర్ మెడల్ ఖాయంగా వస్తుంది.
సెమీ ఫైనల్‌లో మొదటి బ్రేక్ వరకూ 2-1తో లీడ్ సాధించిన రవి తర్వాత కాస్త వెనకబడ్డారు.
ఒక సమయంలో రవికి రెండు, నూరిస్లామ్‌కు 9 పాయింట్లు ఉన్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కానీ రవికుమార్ ఆ సవాలును స్వీకరించారు.
2-10తో వెనకబడిన సమయంలో పుంజుకున్నారు. దానిని 5-9 వరకూ తీసుకొచ్చారు.
తర్వాత మొత్తం గేమ్‌నే తలకిందులు చేశారు.
అద్భుతమైన పట్లు పడుతూ తన ప్రత్యర్థిని చిత్తు చేసిన రవి కుమార్ దహియా చివరకు ఫ్రీస్టయిల్ 57 కిలోల ఫైనల్లో అడుగుపెట్టారు.
రవి దహియా మరో పతకం ఖాయం చేయడంతో ఇప్పుడు భారత్ ఖాతాలో నాలుగు మెడల్స్ చేరాయి.

ఫొటో సోర్స్, Vipin Kumar/Hindustan Times via Getty Images
రవి దహియా ఎవరు?
హరియాణా సోనిపత్ జిల్లాలోని నాహరీ గ్రామంలో పుట్టిన రవి దహియా ఈ రోజు ఈ స్థాయికి చేరుకోడానికి 13 ఏళ్లు రాత్రీపగలూ కష్టపడ్డాడు.
రవి పుట్టిన గ్రామంలో 15 వేల జనాభా ఉంటుంది. కానీ ఆ గ్రామం నుంచి ఇప్పటివరకూ ముగ్గురు ఒలింపిక్స్‌లో పోటీపడ్డారు.
ఈ ఊరికి చెందిన మహావీర్ సింగ్ 1980లో మాస్కో, 1984లో లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో పాల్గొనగా అమిత్ దహియా లండన్ 2012 ఒలింపిక్స్‌లో పోటీపడ్డాడు.
ఆ వారసత్వాన్ని రవి దహియా మరింత ఎత్తుకు తీసుకెళ్లారు., కేవలం పదేళ్ల వయసులోనే ఆయన దిల్లీ ఛత్రసాల్ స్టేడియంలో సత్‌పాల్ మార్గదర్శకత్వంలో కుస్తీ నేర్చుకోవడం మొదలుపెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
కృషికి ఫలితం
రవి దహియా ఈ విజయం వెనుక ఆయన తండ్రి రాకేష్ దహియా కష్టం ఉంది.
ఆయన సుదీర్ఘ కాలంగా తన కొడుకును మంచి పహిల్వాన్ చేయాలనే ఆశతో ఎప్పుడూ పాలు, మీగడ పంపుతూ వచ్చారు.
రోజూ ఐదు కిలోమీటర్లు నడిచి దగ్గరే ఉన్న రైల్వే స్టేషన్‌కు వెళ్లి, అక్కడ నుంచి ఆజాద్ పూర్ రైల్వే స్టేషన్లో దిగి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్రసాల్ స్టేడియం దగ్గరకు నడిచి వచ్చి కొడుకుకు వాటిని స్వయంగా అందించేవారు.
ఆయన రవి దహియా కోసం ఎంతగా కష్ట పడ్డారో ఈ ఒక్క విషయంతో అర్థం చేసుకోవచ్చు. అలా ఆయన ఒకటి రెండేళ్లు కాదు పదేళ్ల పాటు అందించారు.

ఫొటో సోర్స్, Getty Images
పతకాల వరుస
రవి దహియా మొట్టమొదట 2015లో జరిగిన జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించారు.
ఆ తర్వాత 2018లో అండర్-23 వరల్డ్ చాంపియన్ షిప్‌లో రజత పతకం గెలిచారు.
2019 ఆసియా కుస్తీ చాంపియన్‌షిప్‌లో ఆయన ఐదో స్థానంలో నిలిచినప్పటికీ, 2020 ఆసియా కుస్తీ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలుచుకోగలిగారు.
తన ఈ విజయాన్ని ఆయన 2021లో కూడా కొనసాగించారు. ఆసియా కుస్తీ చాంపియన్‌షిప్‌లో మరోసారి స్వర్ణ పతకం గెలిచారు.
2019లో నూర్ సుల్తాన్ కజకిస్తాన్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం గెలుచుకున్న తర్వాత ఒలింపిక్ కోటా సంపాదించారు.

ఫొటో సోర్స్, Burhaan Kinu/Hindustan Times via Getty Images
సెమీస్‌లో ఓడిన దీపక్ పునియా
భారత్‌కు చెందిన మరో రెజ్లర్ దీపక్ పునియా పురుషుల ఫ్రీ స్టయిల్ 86 కేజీల 1/8 కుస్తీ పోటీల్లో సెమీస్‌లో ఓడిపోయారు.
క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన జుషెన్ లిన్‌ను ఓడించిన దీపక్ 86 కేజీల విభాగంలో సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టాడు.

ఫొటో సోర్స్, WILLIAM WEST/AFP via Getty Images
పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ చేరిన నీరజ్ చోప్రా
టోక్యో ఒలింపిక్స్ పురుషుల జావెలిన్ త్రో గ్రూప్ ఏ క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా మొదటి స్థానంలో నిలిచారు.
భారత అథ్లెట్ నీరజ్ చోప్రా 86.65 మీటర్ల దూరం జావెలిన్ విసిరి అందరికంటే టాప్‌లో నిలిచారు.
ఫైనల్‌కు క్వాలిఫై కావడానికి 83.50 మీటర్ల దూరం విసరాల్సి ఉంటుంది.
నీరజ్ తన మొదటి ప్రయత్నంలోనే 86.65 మీటర్లు విసిరి ఫైనల్‌కు క్వాలిఫై అయ్యారు.
నీరజ్ అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన 88.07 మీటర్లు. ఇప్పుడు ఆయన ఆగస్టు 7న జరిగే జావెలిన్ త్రో ఫైనల్లో పాల్గొంటారు.
నీరజ్ చోప్రా హరియాణాకు చెందిన అథ్లెట్. ఆసియా గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఆయన పతకాలు సాధించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
జర్మనీకి చెందిన జె.విట్టెర్ రెండో స్థానంలో, ఫిన్‌లాండ్ అథ్లెట్ ఎల్.ఎటెలటాలో మూడో స్థానంలో నిలిచారు.
పురుషుల జావెలిన్ త్రోలో గ్రూప్ బీ పోటీల్లో భారత మరో అథ్లెట్ శివపాల్ సింగ్ క్వాలిఫై కాలేకపోయారు.
Please wait...
ఇవి కూడా చదవండి:
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- కోవిడ్-19ను మనం నోరోవైరస్లా ఎందుకు చూడాలి? అసలు నోరోవైరస్ అంటే ఏమిటి
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








