టోక్యో ఒలింపిక్స్: చరిత్ర లిఖించే అవకాశం చేజార్చుకున్న భారత్

టోక్యో ఒలింపిక్స్ పురుషుల హాకీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బెల్జియం భారత్‌ను 5-2తో ఓడించింది.

భారత హాకీ జట్టు ఓటమి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, భారత్, బెల్జియం మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ మొదటి క్వార్టర్ హోరాహోరీగా మొదలైంది. చూస్తుంటే ఏ జట్టూ గెలుపుపై ఆశలు వదులుకున్నట్టు అసలు కనిపించలేదు. ఒకసారి బెల్జియం పైచేసి సాధిస్తే ఇంకోసారి భారత్ ఆధిపత్యం చూపించింది.
41 ఏళ్ల తర్వాత భారత పురుషుల హాకీ టీమ్ ఒలింపిక్స్ సెమీ ఫైనల్ ఆడుతోంది.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, 41 ఏళ్ల తర్వాత భారత పురుషుల హాకీ టీమ్ ఒలింపిక్స్ సెమీ ఫైనల్ ఆడుతోంది.
లోయిక్ లూపర్ట్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మొదటి క్వార్టర్‌లో లోయిక్ లూపర్ట్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో బెల్జియం భారత్‌కు షాక్ ఇచ్చింది. మ్యాచ్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.
హర్మన్‌ప్రీత్ సింగ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అయితే, బెల్జియం ఆధిపత్యం ఎక్కువ సేపు సాగలేదు. అదే క్వార్టర్‌లో రెండో పెనాల్టీ కార్నర్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ భారత్ తరఫున గోల్ చేసి 1-1తో సమం చేశాడు.
మన్‌దీప్ సింగ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మొదటి క్వార్టర్‌లోనే మన్‌దీప్ సింగ్ భారత్‌ తరఫున మరో గోల్ చేశాడు. బెల్జియంపై 2-1 ఆధిక్యం అందించాడు.
అటతీరు కనువిందు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, సెమీ ఫైనల్ మొదటి క్వార్టర్‌లోనే మూడు అద్భుతమైన గోల్స్ చేశారు. భారత్-బెల్జియం ఆటతీరు కనువిందు చేసింది.
రెండో గోల్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అయితే, భారత్‌కు ఈ ఆధిక్యం ఎక్కువ సేపు నిలవలేదు. ఫస్ట్ హాఫ్‌ ముగియడానికి కాస్త ముందు బెల్జియం రెండో గోల్ వేయడంలో సక్సెస్ అయ్యింది.
అలెగ్జాండర్ హెడ్రిక్స్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బెల్జియంకు వరుసగా మూడు పెనాల్టీ కార్నర్స్ లభించాయి. వారు వాటిలో మూడో కార్నర్‌ను గోల్‌గా మలచగలిగారు.
అలెగ్జాండర్ హెడ్రిక్స్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అలెగ్జాండర్ హెడ్రిక్స్ బెల్జియం రెండో గోల్ చేశాడు. ఫస్ట్ హాఫ్‌లో భారత్-బెల్జియం స్కోర్ 2-2 సమంగా ఉంది.
హోరాహోరీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, హాఫ్ టైమ్ తర్వాత మ్యాచ్ మొదలవగానే మూడో క్వార్టర్ హోరాహోరీగా ఉండబోతోందని అనిపించింది. అలాగే జరిగింది. రెండు టీముల్లో ఏదీ గోల్ చేయలేకపోయాయి.
పెనాల్టీ కార్నర్ మిస్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, 38వ నిమిషంలో భారత జట్టుకు పెనాల్టీ కార్నర్ లభించింది. కానీ టీమ్ దానిని గోల్‌గా మలచలేకపోయింది.
అలెగ్జాండర్ హెడ్రిక్స్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బెల్జియంకు వరసగా మూడు పెనాల్డీ కార్నర్‌లు రావడంతో భారత్ పరిస్థితి దారుణంగా మారింది. వాటిలో చివరి కార్నర్‌ను అలెగ్జాండర్ హెడ్రిక్స్ గోల్‌గా మార్చాడు. దాంతో బెల్జియం భారత్‌పై 3-2 ఆధిక్యం సాధించింది.
అలెగ్జాండర్ హెడ్రిక్స్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, నాలుగో క్వార్టర్ చివరి 8వ నిమిషంలో బెల్జియంకు వరుస పెనాల్టీ కార్నర్ల తర్వాత ఒక పెనాల్టీ స్ట్రోక్ లభించింది. దాన్ని గోల్‌గా మార్చడంలో అలెగ్జాండర్ హెడ్రిక్స్ ఎలాంటి తప్పు చేయలేదు.
పి.శ్రీజేష్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, భారత జట్టు గోల్‌కీపర్ పి.శ్రీజేష్ చివరి క్వార్టర్‌ పెనాల్టీ స్ట్రోక్‌ను అడ్డుకోలేకపోయారు. అయితే, ఒలింపిక్స్‌లో అతడి ప్రదర్శన ఎన్నో ప్రశంసలు అందుకుంది.
అలెగ్జాండర్ హెడ్రిక్స్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బెల్జియం ఆటగాడు అలెగ్జాండర్ హెడ్రిక్స్ మ్యాచ్ హీరోగా నిలిచాడు. అతడు పెనాల్టీ కార్నర్, పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలచగలిగాడు. మూడు గోల్స్ చేశాడు.
బెల్జియం ఐదో గోల్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, చివరి క్వార్టర్ చివరి ఏడో నిమిషంలో బెల్జియం ఐదో గోల్ కూడా వేసింది. అది ఓపెన్ గోల్. దీనితో బెల్జియం భారత్ మీద 5-2 ఆధిక్యం సంపాదించింది.
భారత హాకీ జట్టు ఓటమి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, భారత పురుషుల హాకీ టీమ్ గ్రేట్ బ్రిటన్‌ను 3-1తో ఓడించి క్వార్టర్ ఫైనల్లో స్థానం సంపాదించింది. ఇక, భారత మహిళా హాకీ టీమ్ సెమీ ఫైనల్ మ్యాచ్ బుధవారం అర్జెంటీనాతో జరగనుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)