‘డ్రగ్స్ ఇచ్చి, మంచానికి కట్టేసి అత్యాచారం చేశాడు, ఆ సీరియల్ కిల్లర్ నుంచి ఎలా తప్పించుకున్నానంటే..’

ఫొటో సోర్స్, KARA CHAMBERLAIN
అమెరికాలోని సౌత్ కరోలినాలో కిడ్నాప్‌నకు గురైంది 15 ఏళ్ల బాలిక కారా చాంబర్లైన్. ఆమెను కిడ్నాప్ చేసింది ఒక సీరియల్ కిల్లర్.
ఆ సీరియల్ కిల్లర్ కారాకు 18 గంటల పాటు నరకం చూపించాడు.
ఆమెను మంచానికి కట్టేశాడు. బలవంతంగా డ్రగ్స్ ఇచ్చాడు. లైంగికంగా వేధించాడు.
అలాంటి క్లిష్టపరిస్థితుల్లో నుంచి చాకచక్యంగా తప్పించుకోగలిగింది కారా.
తనను ఎలా కిడ్నాప్ చేశాడో, కిడ్నాపర్ చెర నుంచి తాను ఎలా తప్పించుకుందో కారా బీబీసీకి వివరించింది.

ఫొటో సోర్స్, KARA CHAMBERLAIN
కిడ్నాప్ ఎలా జరిగింది?
2002లో కారా, సౌత్ కరోలినాలోని కొలంబియాలో ఉన్న తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది.
మేమిద్దరం కలిసి బయటకు వెళ్దామనుకున్నాం. తను స్నానం చేస్తుంటే నేను బయట గార్డెన్‌లో మొక్కలకు నీళ్లు పోయడానికి వెళ్లాను అని కారా చెప్పారు.
మొక్కలకు కారా నీళ్లు పోస్తుండగా ఒక అపరిచిత వ్యక్తి కారు నడుపుకుంటూ ఇంటి ముందుకు వచ్చాడు.
కారులోంచి దిగి, కారా దగ్గరకు వచ్చి, తన దగ్గర కొన్ని బ్రోచర్లు ఉన్నాయని, అవి మీ తల్లిదండ్రులకు లేదా మీ స్నేహితురాలి తల్లిదండ్రులకు పనికి రావొచ్చంటూ మాటలు కలిపాడు.
ఆ తర్వాత అతను వెంటనే తన దగ్గరున్న గన్‌ను తీసి కారా తలకు ఎక్కుపెట్టాడు.
అతని పేరు రిచర్డ్ ఎవోన్జ్. అతను కొన్ని సంవత్సరాల క్రితమే సౌత్ కరోలినాకు వచ్చాడు.
అంతకుముందెప్పుడూ కారా అతడిని చూడలేదు.
'గన్ నా ముఖాన్ని తాకిన మరుక్షణమే నేనొక సాధారణ 15 ఏళ్ల బాలికను. అతను ధృఢమైన వ్యక్తి. అతనితో నేను పొట్లాడలేను. పక్కా ప్రణాళికతోనే అతని చెర నుంచి తప్పించుకోగలను అని అప్పుడే నిర్ణయించుకున్నాను' అని కారా బీబీసీతో చెప్పారు.
అది కాకుండా తనకున్న మరో దారేంటి అని ఆమె ప్రశ్నించింది.

డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం
కారాను బలవంతంగా కారు వెనుక సీటులో ఉన్న కంటైనర్‌లో కుక్కి, రిచర్డ్ తన అపార్టుమెంట్‌కు తీసుకుపోయాడు.
అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన తర్వాత కారాను మంచానికి కట్టేశాడు. తనకు డ్రగ్స్ ఇచ్చాడు. ఆమెపై అత్యాచారం చేశాడు.
కారాను 18 గంటల పాటు తన గదిలో బంధించాడు. తప్పించుకోవడానికి సరైన సమయం కోసం కారా ఎదురు చూసింది. మరుసటి రోజు తెల్లవారుజామున రిచర్డ్ ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో ఎలాగోలా తప్పించుకోగలిగింది కారా.
అతను నా బెడ్ పక్కనే పడుకున్నాడు. నా చేతులను మంచానికి కట్టేశాడు. నేను మెల్లిగా ఆ తాళ్లను విప్పుకున్నాను. తర్వాత కాళ్లకున్న తాళ్లను కూడా విప్పుకున్నాను. చప్పుడు కాకుండా బెడ్‌పై నుంచి కిందకు దిగి డోర్‌ను నిదానంగా ఓపెన్ చేశాను. ఒక చేతికి సంకెళ్లు వేలాడుతూ ఉండగానే నేను అపార్ట్‌మెంట్ నుంచి బయటకు పరిగెత్తాను అని కారా ఆ నాటి చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు.
ఆ ఇంటి ముందుకు వచ్చిన ఒక కారుకు అడ్డంగా పరిగెత్తి, తన పరిస్థితిని వివరించింది కారా.
తనను ఒక వ్యక్తి కిడ్నాప్ చేశాడని, తనను వెంటనే పోలీసుల వద్దకు తీసుకెళ్లాలని వారిని కోరింది. వారు వెంటనే తనను పోలీసుల వద్దకు తీసుకెళ్లారు' అని కారా చెప్పింది.

ఫొటో సోర్స్, KARA CHAMBERLAIN TIKTOK
మరో మూడు హత్యల్లో రిచర్డ్‌పై అనుమానం
కారా నుంచి సమాచారం తీసుకుని, అక్కడికి వెళ్లేసరికే రిచర్డ్ అక్కడి నుంచి పారిపోయాడు. అతడి కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. తర్వాత కొన్నిరోజులకు అతడు ప్లోరిడాలోని సరటోసాలో ఉన్నట్లు గుర్తించారు.
తనను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులను చూడగానే రిచర్డ్ తనను తాను గన్‌తో కాల్చుకుని చనిపోయాడు.
అదే సమయంలో కారా కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు మరిన్ని కొత్త విషయాలు తెలిశాయి.
అపార్ట్‌మెంట్‌లో దొరికిన అనేక వస్తువులను డీఎన్‌ఏ పరీక్షలకు పంపించారు.
వర్జీనియాలో మరో ముగ్గురు అమ్మాయిల హత్యలతో అతడికి సంబంధం ఉన్నట్టు పోలీసుల విచారణలో తెలిసింది.
కారాను కిడ్నాప్ చేసిన మాదిరిగానే వీరిని కిడ్నాప్ చేసి అత్యాచారం ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 1
1996లో సెప్టెంబర్‌లో 16ఏళ్ల సోఫియా సిల్వా వర్జీనియాలోని స్పాట్సిల్వేనియాలోని తన ఇంటి ముందు కిడ్నాప్‌కు గురైంది.
నెల రోజుల తర్వాత ఒక లోయలో ఆమె కుళ్లిన మృతదేహం లభ్యమైంది.
1997 మేలో రిచర్డ్ 12, 15 ఏళ్ల వయసున్న ఇద్దరు అక్కా చెల్లెళ్లు క్రిస్టిన్, కాటి లిస్క్‌లను వారి పాఠశాల ముందు కిడ్నాప్ చేశాడు.
వారిపై అత్యాచారం చేసి అనంతరం వారిని గొంతు కోసి హత్య చేశాడు. వారి మృతదేహాలు సంఘటన జరిగిన ఐదు రోజుల తరువాత నదిలో లభ్యమయ్యాయి.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 2
సీరియల్ కిల్లర్ నుంచి ప్రాణాలతో బతికిబయటపడిన కారాకు.. ఆ బాధ, ఆలోచనల నుంచి బయటపడటానికి మాత్రం చాలా సమయం పట్టింది.
ప్రస్తుతం పోలీసు విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న కారా ఇద్దరు పిల్లల తల్లి. ఓ మంచి వక్త కూడా.
తరచూ సామాజిక మాధ్యమాల్లో తన స్వీయ అనుభవాలను చెబుతూ, మానసిక ఒత్తిడి నుంచి ఎలా బయటపడి లక్ష్యాలను అధిగమించాలో వివరిస్తుంటుంది.
ఇవి కూడా చదవండి:
- ‘12 ఏళ్ల వయసులో పొట్ట పెరుగుతుంటే ఎందుకో అనుకున్నా, గర్భవతినని గుర్తించలేకపోయాను’
- 24 ఏళ్ల నిరీక్షణ, 5 లక్షల కి.మీ.ల ప్రయాణం-ఎట్టకేలకు కొడుకును కలుసుకున్న తండ్రి
- ‘సెక్స్ గురించి భారతీయులు మాట్లాడుకోరు, అందుకే నేను వారికి సాయం చేస్తున్నాను’
- ఆంధ్రప్రదేశ్: శ్రీశైలంలో రహస్యంగా డ్రోన్లు ఎందుకు ఎగరేస్తున్నారు ? అనుమతి లేకుండా వీటిని వాడితే ఏం జరుగుతుంది?
- బండ్ల శిరీష: రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ఫ్లైట్‌లో గుంటూరు అమ్మాయి రోదసి యాత్ర విజయవంతం
- పీవీ సింధు ఈసారి ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవడం ఖాయమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









