ఈ చేప చాలా ప్రత్యేకం.. కొండలు కూడా ఎక్కగలదు

ఓపు చేప

ఫొటో సోర్స్, YAAP

    • రచయిత, మేఘన్ మైనర్ ముర్రే
    • హోదా, బీబీసీ ట్రావెల్

హవాయి దీవుల్లోని ఓప్ చేప జలపాతాలలోని రాళ్లపై పాకుతూ సుమారు 300 మీటర్ల వరకు ప్రయాణించి ఎగువకు చేరగలుగుతుంది.

ఇవి ఈ ప్రాంతానికే పరిమితమని, వీటి గురించి తెలిసిందీ తక్కువేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

హమకువా తీరం వెంబడి ఉన్న సెలయేర్లలో ఈ ఓప్ చేపలు ఎక్కువగా కనిపిస్తాయని యూఎస్ జియలాజికల్ సర్వే అనుబంధ 'హవాయి కోపరేటివ్ పిషరీ రీసెర్చ్ యూనిట్' హెడ్ టిమ్ గ్రాబోవ్‌స్కీ చెప్పారు.

సుమారు 80 కిలోమీటర్ల పరిధిలో పదుల సంఖ్యలో సెలయేర్లు ఉన్నప్పటికీ సాధారణ ప్రజలు వెళ్లడానికి వీలున్నవి తక్కువే.

అలాంటి ఒక క్లిష్టమైన మార్గంలో నా ప్రయాణం సాగి ఒక సెలయేరుకు చేరింది.

ఈ ఓప్ చేపలు తమ నోరు, ఉదరం కింద ఉండే రెక్కల వంటి భాగాల సహాయంతో జలపాతాలలోని రాళ్లపై పాకుతూ ఎగువకు చేరుతాయి. ఇలా ఇవి సుమారు 300 మీటర్ల ఎత్తు వరకు కొండలు ఎక్కగలవు.

హవాయిలోని జలపాతం

ఫొటో సోర్స్, Getty Images

ఓప్ చేపలు నాలుగు జాతులు

ఓప్ చేపలు పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి.

సాధారణంగా గోధుమ వర్ణంలో కనిపించే ఇవి అవి ఉన్న పరిసరాలలో ఇమిడిపోతూ గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంటాయి.

గోబీ జీవకుటుంబానికి చెందిన ఓప్ చేపలు నాలుగు జాతులున్నాయి.

ఇందులో ఒక రకంలోని మగ చేపలు సంతతి వృద్ధి చేసుకునే సీజన్‌లో సగం నల్లగా, సగం మెరిసే నారింజ రంగులో కనిపిస్తాయి. ఇవి తప్ప మిగతావన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి.

ఓప్ జాతి చేపలన్నీ ప్రవాహం వెంట ఒక నిర్ణీత ప్రాంతంలోనే నివసించేందుకు ఇష్టపడతాయి.

వీటిలో జలపాతాల వెంబడి గుట్టలపైకి ఎగబాకే రకం చేపలైతే ప్రవాహంలోని మారుమూల ప్రాంతాలు, లోతైన ప్రాంతాలలో ఉంటాయి.

హవాయిలోని జలపాతం

ఫొటో సోర్స్, Getty Images

ఓప్ చేపల గురించి తెలిసింది తక్కువే

ఏడాదికి సగటున 200 సెంటీమీటర్ల వర్షపాతం ఉండే హవాయి ద్వీపంలోని హమకువా తీరం జలపాతాలతో అలరారుతుంది.

హవాయి దీవుల్లో ఒకటైన హిలో ప్రాంతం 'మౌనా కీ' అగ్నిపర్వతం సమీపంలో ఉంటుంది.

ఈ పర్వతం సముద్రంలో ఒక పెద్ద గోడలా కనిపిస్తుంది. నీటి అడుగున ఉన్న దాని బేస్ నుంచి కొలిస్తే 10,211 మీటర్ల ఎత్తుంటుంది. ఆ లెక్కన చూస్తే ప్రపంచంలో ఇదే అత్యంత ఎత్తయిన పర్వతం.

ఈ ప్రాంతంలోని ప్రవాహాలు తక్కువ దూరమే ఉంటాయి కానీ నిటారుగా ఉంటాయి. అంతేకాదు.. ఆకస్మిక వరదలకూ తరచూ కారణమవుతాయి.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 1
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 1

ఇక్కడి మంచి నీటి ప్రవాహాలలో అయిదు జాతుల ఓప్ చేపలు ఉంటాయి.

వీటిలో నాలుగు జాతులకు చెందిన ఓప్ చేపలకు రాళ్లపైకి పాకే ప్రత్యేకమైన సామర్థ్యం ఉంది.

హవాయి మంచినీటి చేపల గురించి పెద్దగా అధ్యయనం జరగలేదని, ఓప్ చేపల ప్రాథమిక జీవలక్షణాలు, జీవావరణం గురించి ఇప్పటికీ తెలియాల్సింది ఎంతో ఉందని 'గ్రాబోవ్‌స్కీ' అంటారు.

మిగతా చేపల్లా కాకుండా ఇవి ప్రవాహాలు, జలపాతాల్లోని రాళ్లపై పాకగలగడానికి వీటి శరీర నిర్మాణం కారణమని 'నైరుతి పసిఫిక్ అధ్యయన కేంద్రం' ఆక్వాటిక్ రీసెర్చ్ ఎకాలజిస్ట్ రిచర్డ్ మెకంజీ చెప్పారు.

వీటి ఉదరం కింద ఉండే రెక్కలు(ఫిన్) ఏదైనా ఉపరితలాన్ని తాకిన తరువాత అతుక్కుపోయేలా చేయగలుగుతాయి. అలా ఉదరం కింది రెక్క, నోటి సహాయంతో రాళ్లపైకి పాకుతుందీ చేప.

ఇలా ఇవి ఎంతదూరం, ఎంత ఎత్తుకు వెళ్లగలవన్నది వాటి పరిమాణం బట్టి ఉంటుంది.

సాధారణ ఈ చేపలు గరిష్ఠంగా ఒక అడుగు పొడవు వరకు పెరుగుతాయి.

అలాగే ఇంతకుముందు చెప్పినట్లు సగం నలుపు, సగం నారింజ రంగులో ఉండే ఓపు చేపలు ఎక్కువ ఎత్తు వరకు వెళ్లగలుగుతాయి.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 2
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 2

నీటిలోంచి బయటకు వచ్చి రాళ్లకు అతుక్కుని ఉండడం వల్ల ముప్పు ఉంది అంటారు గ్రాబోవ్‌స్కీ.

''చేప నీళ్ల బయట ఉండడం వల్ల శ్వాస ఇబ్బంది రావడం కంటే మరో ముప్పు ఉంది. చేప నుంచి వచ్చే వ్యర్థాలను బయట విడవడమే ఆ ముప్పు'' అన్నారాయన.

సాధారణంగా చేపలు తమ మొప్పల ద్వారా నైట్రోజన్ వాయువులను విడుదల చేస్తాయి. బయట ఉన్నప్పుడు మొప్పల ద్వారా అలా చేయలేనప్పుడు చేపలో అమ్మోనియా సాంద్రత పెరిగే ప్రమాదం ఉంటుంది.

అయితే, ఈ ఓప్ చేపలు ఈ విషతుల్యతను ఎలా అధిగమిస్తున్నాయన్నది శాస్త్రవేత్తలకు కూడా సరిగా అంతుచిక్కడం లేదు'' అన్నారు గాబ్రోవ్‌స్కీ.

ఆరు హవాయి దీవుల్లోనూ ఈ రకం చేపలున్నాయని, అయితే, వాటి సంఖ్య ఎంత ఉండొచ్చన్నది నిర్దిష్టంగా చెప్పలేమని హవాయి యూనివర్సిటీ జంతుశాస్త్ర ప్రొఫెసర్ బాబ్ కింజీ చెప్పారు.

హవాయి దీవులు

ఫొటో సోర్స్, Getty Images

సముద్రంలో పుట్టి సెలయేరులో పెరిగి..

సెలయేర్లు, నదులలో ఓప్ చేపలు పెట్టే గుడ్లు ప్రవాహంలోంచి సముద్రంలోకి చేరుతాయి.

అక్కడే ఈ చేపలు పుట్టి సముద్రం నుంచి మంచినీటి ప్రవాహంలోకి ఎదురీది చేరుతాయి.

అక్కడి నుంచి మంచి నీటి చేపలుగానే పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి:

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 3
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 3

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)