ఐ లవ్ యూ: ఫ్రెంచ్ వాళ్లు ‘ఐ లవ్ యూ’ అని ఎందుకు ఎక్కువగా చెప్పరు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సిల్వియా సేబ్స్
- హోదా, బీబీసీ ట్రావెల్
నా భర్త ఫ్రెంచ్ వ్యక్తి. ఆయన నన్ను ప్రేమిస్తారని నాకు తెలుసు. ఆయన ప్రతి వారాంతంలో నాకొక పూల బొకేను బహుమతిగా ఇస్తారు. నేను వెళ్లిన పార్టీలో అందరినీ చూసి 'ఎంత అందంగా ఉన్నారో‘ అంటే వెంటనే ‘బర్డ్స్ ఆఫ్ ఏ ఫెదర్’ (ఒకే గూటి పక్షులు) అని కామెంట్ చేస్తారు.
అలాగే సహోద్యోగులతో ఏదైనా పార్టీకి వెళ్లినప్పుడు కూడా ఆయన నా చేతిని ఆప్యాయంగా తడుముతారు. ఇవన్నీ ఆయనకు నాపై ఉన్న ప్రేమను సూచిస్తూ ఉంటాయి.
మాకు పెళ్లయి పదేళ్లు అవుతున్నా ఆయన నన్ను 'మై డీర్‘ (నా లేడి పిల్ల) అని ముద్దుగా పిలుస్తూ నాపై ప్రతి రోజూ ప్రేమ చూపిస్తూ ఉంటారు.
కానీ ఆయన నాకు "ఐ లవ్ యూ" అని చివరిసారిగా ఎప్పుడు చెప్పారో గుర్తు లేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఐ లవ్ యూ చెప్పడం అరుదు
ఫ్రాన్స్‌లో ప్రేమికులు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నా కూడా ఒకరికొకరు ఐ లవ్ యూ చెప్పుకోవడం అరుదు.
ఐ లవ్ యూ చెప్పకపోవడం అంటే వారికి ప్రేమ లేదనో, లేదా వారి ప్రేమపై నిబద్ధత లేకపోవడమో కాదు.
"ఫ్రెంచ్ ప్రజలు ప్రేమ విషయంలో చాలా నిబద్ధతతో ఉంటారు" అని పారిస్‌లో నివాసం ఉంటున్న కెనడా ఫ్రీ లాన్స్ రచయత, రొమాన్స్ నిపుణురాలు లిల్లీ హీజ్ చెప్పారు.
"ఇద్దరు వ్యక్తులు మూడుసార్లు కలుసుకున్న తర్వాత వారు మరొకరిని చూడటం లాంటివి చేయరు. వారు రోజంతా, ప్రతి రోజూ కలిసి ఉండాలనే ఆశిస్తారు" అని ఆమె చెప్పారు.
నిన్ను ప్రేమిస్తున్నాను అని ఎన్నడూ చెప్పని వ్యక్తి, నిన్ను నేనిక ప్రేమించలేను అని ఎలా చెబుతారు అని లిల్లీ హీజ్ ప్రశ్నించారు.
నేనిక నిన్ను ప్రేమించలేనంటూ ఆమె బాయ్‌ఫ్రెండ్ చెప్పి బ్రేకప్ చేసుకున్నప్పుడు ఆమె ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమె 'జెటిమ్' అనే తొలి పుస్తకం రాయడానికి ఈ ఘటనే ప్రేరణగా నిలిచింది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 1
ఫ్రెంచ్ ప్రజలు " ఐ లవ్ యూ" అని చెప్పరు. ప్రేమించే మనుషులతో మనసులో కలిగిన భావాలను వ్యక్తపరచడానికి వాళ్ల దగ్గర క్రియా పదాలు లేవు.
వాళ్లకు "ఐమర్" అని ఒకే ఒక్క క్రియ ఉంది. దీనికి ఇష్టం, ప్రేమ అనే రెండు అర్థాలు ఉన్నాయి. అందుకే ఫ్రెంచ్ వారు రగ్బీ లేదా లైలాక్ పరిమళం గురించి చెప్పేటప్పుడు ఐమర్ అనే పదాన్ని వాడుతుంటారు.
పసి పాపాయి, బాల్య స్నేహితులు లేదా జీవిత భాగస్వామి పట్ల కూడా అదే పదాన్ని వాడి ప్రేమను వ్యక్తపరచడం అతి సామాన్యంగా కనిపిస్తుంది.
లారౌస్ రాసిన ఫ్రెంచ్ - ఇంగ్లీష్ డిక్షనరీ చూస్తే, ఫ్రెంచ్ వారు ప్రేమను గురించి మాట్లాడే విధానం అర్థమవుతుంది. ఇక్కడ క్రియను ఐమర్ అని నిర్వచిస్తారు. కానీ ప్రేమను వ్యక్తపరచడానికి సూచించిన ఉదాహరణలను అరుదుగా వాడతారు.
ఇక్కడ ఎవరైనా ఏదైనా క్రీడ, ఆహారం గురించి తమకున్న ప్రేమను వ్యక్తపరచడానికి పాషన్ (అభిరుచి) అనే పదాన్ని వాడతారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 2
తొలి చూపులో ప్రేమ కలిగితే, దానిని లైట్నింగ్ స్ట్రైక్ ('మెరుపు మెరిసింది') అని అంటారు. ఉత్తరాలపై ఆపేక్షతో అంటూ సంతకం చేస్తారు. జీవితంలో అత్యధికంగా ప్రేమించే వ్యక్తిని 'నా జీవితంలో ముఖ్యమైన మహిళ లేదా పురుషుడు' అని చెప్పుకుంటారు.
ఫ్రెంచ్ వారు ప్రేమను మాటల్లో వ్యక్తపరచరు కానీ ప్రదర్శిస్తారు. ఫ్రెంచ్ నుంచే పొగడ్తలు, మహిళల పట్ల మర్యాద, ప్రేమ లాంటి పదాలు ఇంగ్లీష్ భాషలో చేరాయి.
ఎవరినైనా ప్రశంసించడం ఇక్కడ ఒక కళలా చూస్తారు. ప్రేమికులు చాలా సులభంగా ఒకరి మీద ఒకరు ప్రశంసలు కురిపిస్తారు. అమ్మాయిల సూట్ కేసును మెట్ల మీద నుంచి మోసుకురావడానికి మగవాళ్లు ఏమాత్రం ఆలోచించరు.
చాక్లెట్ తయారీలో నిపుణత సాధించి షాంపైన్‌ను కనిపెట్టి, కళాత్మకమైన ఆపులెంట్ నోవో పోన్ట్ అలెగ్జాండ్రే III బ్రిడ్జిని నిర్మించిన వీరి సంస్కృతిలోనే రొమాన్స్ అంతర్లీనంగా నిండిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
రొమాన్స్‌కే పరిమితమా?
ఇది కేవలం రొమాన్స్‌కు మాత్రమే పరిమితం కాదు. చాలా మంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను 'జెటిమ్' అని అప్పుడప్పుడూ చెబుతారు. కానీ వారెక్కువగా మై ఫ్లీ, మై క్యాబేజ్, మై క్యూటీ' లాంటి ముద్దుపేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇవన్నీ ఫ్రాన్స్‌లో చాలా సాధారణంగా వాడే ముద్దు పేర్లు" అని ఫ్రెంచ్ రచయత టీటా చెప్పారు.
"ముద్దు పేర్లు ఉండటమే, ప్రేమికుల మధ్యనున్న సాన్నిహిత్యానికి నిదర్శనం" అని మానసిక విశ్లేషకులు రాబర్ట్ న్యూ బర్గర్ స్లేట్ పత్రికలో రాశారు.
"మీరు ప్రేమిస్తున్న వ్యక్తిని పేరుతో కాకుండా, విభిన్నంగా పిలవడమే విలువైన విషయంగా చూస్తారు" అని ఆయన అన్నారు.
ఫ్రాన్స్‌లో ముద్దు పేర్లు ప్రతి ఒక్కరు వారి జీవితాల్లో పోషించే పాత్రలకనుగుణంగా ఉంటాయి. ఒక పురుషుడు తన మహిళా సహోద్యోగులను 'మై క్యాట్స్‘ అని పిలుస్తారు. అలాగే ఒక మహిళను తన ఆప్త మిత్రుడిని 'మై బ్యూటీ ' అని పిలుస్తారు.
ఇక్కడ అమ్మలకు, నాన్నలకు, పిల్లలకు, ప్రేమికులకు, స్నేహితులకు 'మై హార్ట్', 'మై ట్రెజర్', 'మై పెర్ల్' లాంటి రకరకాల ముద్దుపేర్లు ఉంటాయి.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 3
ఫ్రెంచ్ వారు వారి ప్రేమను వ్యక్తపరచాల్సిన అవసరం లేదు. వారి ప్రేమను వ్యక్తపరచాలనుకుంటే ఎక్కడైనా, ఎప్పుడైనా కూడా కౌగిలింతలు, ముద్దులతో ప్రదర్శిస్తారు.
అలాగే బహిరంగంగా ప్రేమను ప్రదర్శించడంపై అక్కడ చర్చలు కూడా జరగవు.
వేసవిలో పారిస్‌లోని సన్నివేశం.. నదీ తీరం పక్క పక్కనే నిల్చుని, ఆర్తితో ముద్దులు పెట్టుకుంటున్న జంటలతో నిండిపోతుంది. ఆ మైకంలో ఉన్న జంటలు.. పడవలపై వెళుతూ తమను ఉత్సాహపరిచేందుకు పిలిచే పర్యటకుల వైపు కన్నెత్తి కూడా చూడరు.

ఫొటో సోర్స్, Getty Images
ఫ్రెంచ్ కిస్
పారిస్‌లో ముద్దు పెట్టుకోవడానికి ఉత్తమ ప్రదేశాలతో కూడిన పుస్తకాన్ని పరిగ్రామ్ ప్రెస్ ప్రచురించింది.
ముద్దు పెట్టుకోవడం "ఐ లవ్ యూ" స్థానాన్ని భర్తీ చేస్తుంది. ఫ్రెంచ్ వారు ఆప్తులతో ఫోన్ కాల్ ముగించే సమయంలో ఐ కిస్ యు అని చెబుతారు. నా పిల్లలు వారి సందేశాలను ముద్దులతోనే ముగిస్తారు.
కేవలం గుడ్ బై చెప్పేటప్పుడు మాత్రమే ముద్దులు పెట్టరు. ఫ్రెంచ్ వారు ముద్దులతోనే ఒకరినొకరు పలకరించుకుంటారు. పారిస్‌లో ముద్దు (బైస్) అంటే ఒకరి చెంపపై ఒకరు ముద్దు పెట్టుకోవడం అని అర్థం. ఈ విధమైన పలకరింపు కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులతో కూడా చేస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
మహమ్మారి సమయంలో అమెరికన్ల తరహాలో కరచాలనం చేసుకోవడానికి సంబంధించిన చర్చ వచ్చింది. దాంతో ఫ్రెంచ్ వారు కూడా భౌతిక దూరం పాటిస్తూ అభినందనలు తెలిపేందుకు ప్రత్యామ్నాయాలు గురించి ఆలోచించడం మొదలుపెట్టారు.
2021 మేలో ఫ్రాన్స్‌లో కోవిడ్ నిబంధనలను సడలించారు. రాత్రి 9వరకు కర్ఫ్యూను సడలించడంతో పాటు, రెస్టారెంట్‌లను కూడా తెరిచారు. ఫ్రెంచ్ ప్రజలు ఈ క్షణాలను సంబరంగా జరుపుకున్నారు.
పర్షియా కెఫెల దగ్గర, ఆల్ప్స్ దగ్గర ఉన్న వసతి గృహాలు, ఫ్రెంచ్ రివేరా దగ్గరున్న కుటీరాల దగ్గర వారంతా ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటూ పలకరించుకున్న దృశ్యాలు కనిపించాయి.
వ్యాక్సీన్ తీసుకున్న వారందరూ వివాహ సంబరాల్లో, బాప్టిజమ్ వేడుకల్లో ముద్దులతో స్వాగతం చెప్పుకున్నారు. మాటలతో ప్రేమను వ్యక్తపరచడం అంత సులభం కాని దేశంలో ప్రతిఒక్కరు వారి ప్రేమను ప్రదర్శించడానికి ఉవ్విళ్లూరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- 'చిన్న వయసులోనే తెల్లబడిన జుట్టును మళ్లీ నల్లగా మార్చొచ్చు'
- శిరీష బండ్ల, కల్పనాచావ్లా, సునీత విలియమ్స్: అంతరిక్షాన్ని గెలుస్తున్న భారతీయ మహిళలు
- స్కైల్యాబ్: ‘అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- పిడుగులు ఎందుకు పడతాయి? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








