జర్మనీ: సెక్స్ టాయ్‌ను చూసి గ్రనేడ్ అనుకున్నారు

గ్రనేడ్ ఆకారంలోని సెక్స్ టాయ్

ఫొటో సోర్స్, POLIZEI HAUZENBERG

జర్మనీలోని పసావూలో సోమవారం రాత్రి స్థానికులు కొందరు గ్రనేడ్‌ ఆకారంలోని ఓ వస్తువును చూశారు. వెంటనే బాంబ్ స్క్వాడ్‌ని పిలిచారు. వారు వచ్చి దాన్ని పరీక్షించి అది బాంబు కాదని తేల్చరు.. అది ఒక సెక్స్ టాయ్ అని చెప్పారు.

'పసావూలో అటవీ ప్రాంతం పక్కన ఒక ట్రాన్సపరెంట్ కవర్‌లో గ్రనేడ్‌లా కనిపిస్తున్న వస్తువును స్థానికులు చూశారు. జాగింగ్‌కు వెళ్లిన మహిళ ఒకరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పేలుడుపదార్థాల నిపుణుల బృందం అక్కడికి వెళ్లింది'' అని అధికారులు చెప్పారు.

అక్కడికి వెళ్లిన ఆ బృందం ప్రమాదమేమీ లేదని చెప్పారని స్థానిక పోలీసులు చెప్పారు.

''ఆ గ్రనేడ్ వంటి వస్తువును క్షుణ్నంగా పరిశీలించిన తరువాత అది రబ్బర్ వస్తువని గుర్తించారు'' అని స్థానిక పోలీసులు వెల్లడించారు.

రబ్బర్‌తో చేసిందని నిర్ధరించుకున్న తరువాత కవర్‌లోంచి దాన్ని తీసి చూడగా అందులో ఒక ఖాళీ లూబ్రికెంట్ ట్యూబ్, రెండు కండోమ్‌లు, ఒక యూఎస్‌బీ కేబుల్ ఉన్నాయి.

ఆ తరువాత అధికారులు దాన్ని సెక్స్ టాయ్ కిట్ అని తేల్చారు. ఆన్‌లైన్‌లో కూడా గ్రనేడ్‌లా కనిపించే సెక్స్ టాయ్స్ ఉన్నాయని చెప్పారు.

జర్మనీలో అనేక చోట్ల రెండో ప్రపంచ యుద్ధం నాటి పేలుడు పదార్థాలు బయటపడుతుంటాయి.. అలాంటివి కనిపించిన వెంటనే పోలీసులు, పేలుడు పదార్థాల నిపుణులు అప్రమత్తమై అక్కడి ప్రజలను ఖాళీ చేయిస్తుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)