ఇండోనేసియా: మునిగిపోయిన జలాంతర్గామి.. అందులో ఆక్సిజన్ మూడు రోజులకు మాత్రమే సరిపోతుంది

ఇండోనేసియా నేవీ అధికారులు

ఫొటో సోర్స్, EPA

ఇండోనేసియాలోని బాలి తీరంలో బుధవారం నుంచి కనిపించకుండా పోయిన సబ్‌మెరైన్ ‘కేఆర్‌ఐ నంగల’ సముద్రగర్భంలో మునిగిపోయినట్లు ఇండోనేసియా నావికా దళం శనివారం తెలిపింది. మునిగిపోయిన ఈ సబ్‌మెరైన్‌లో 53 మంది ఉన్నారు.

సబ్‌మెరైన్‌‌ మునిగిపోయిన ప్రాంతంలో దానికి సంబంధించిన కొన్ని భాగాలతో పాటు, అందులో ఉన్న తివాచీలు కూడా పైకి తేలాయని నావికాదళ ప్రధానాధికారి చెప్పారు.

సముద్రంలో 2800 అడుగుల లోతున మునిగిపోయినట్లు తెలిపారు.

సముద్రంలోకి వెళ్లినప్పటికి అందులో 3 రోజులకు సరిపోయేంత ఆక్సిజన్ మాత్రమే ఉంది.

ఇన్ఫోగ్రాఫిక్

సముద్ర గర్భంలో క్షిపణి ప్రయోగం డ్రిల్ కోసం వెళ్లేందుకు అనుమతి తీసుకుని బయలుదేరిన ఈ జలాంతర్గామి 40 సంవత్సరాల పాతది. దీనిని జర్మనీ తయారుచేసింది.

ఈ సబ్‌మెరైన్ కండిషన్‌లోనే ఉందని ఇండోనేసియా నేవీ తెలిపింది. కానీ, ఇది మునిగిన తీరు చూస్తే ఇందులో ఉన్న ఇంధన ట్యాంకు దెబ్బ తిన్నదేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సబ్‌మెరైన్ కి సంబంధించిన అనేక భాగాలు లభించినట్లు చెప్పారు. అయితే, ఈ క్షిపణిని ప్రయోగించే లాంచర్ లో బీటలు వాటిల్లడం వల్ల గాని, లేదా వెలుపల నుంచి ఒత్తిడి వస్తే తప్ప ఈ భాగాలు సబ్ మెరైన్ ని వీడి బయటకు రావని నేవీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ యుడో మార్గోనో చెబుతున్నారు.

గ్రాఫిక్

ఈ జలాంతర్గామి మునిగిపోయిన ప్రదేశానికి 16 కిలోమీటర్ల రేడియస్‌లో కొన్ని వస్తువులు దొరికాయి. అందులో పెరిస్కోప్ ను లూబ్రికేట్ చేయడానికి వాడే ఒక గ్రీజు సీసా కూడా ఉంది. సబ్‌మెరైన్ మునిగిన ప్రాంతం మీదుగా ఇతర నౌకలు ఏవీ వెళ్లలేదు.

ఈ నేవీ నౌకను బయటకు వెలికి తీయడానికి అంతర్జాతీయంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)