మీరు తినే ఆహారం విడుదల చేసే కార్బన్ ఫుట్‌ప్రింట్స్ గురించి మీకు తెలుసా

ఫొటో సోర్స్, Getty Images
మనం తినే ఆహారం పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడం కష్టమే. కానీ, తెలుసుకోగలిగితే కార్బన్ ఫుట్‌ప్రింట్స్ వదలకుండా జాగ్రత్త పడవచ్చు.
అందుకే బీబీసీ ఒక 'ఫుడ్‌ప్రింట్' కాలిక్యులేటర్ కనిపెట్టింది. దీన్ని ఉపయోగించి మనం తీసుకునే ఆహార పదార్థాలు పర్యావరణాన్ని ఎలా ప్రభవితం చేస్తాయో తెలుసుకోవచ్చు.
సాధారణంగా మనం సరుకులు లేదా కూరగాయలు కొనేటప్పుడు అనేక రకాల విషయాలను దృష్టిలో ఉంచుకుని కావలసినవి ఎంచుకుంటాం. మనకి ఆ రుచి ఇష్టం అనో లేదా ఆరోగ్యానికి మంచిదనో, ఖరీదు తక్కువనో.. ఇలా వివిధ అంశాలు పరిశీలించి కొనుక్కుంటూ ఉంటాం.
అయితే, ఈ మధ్య కాలంలో అనేకమంది తిండి పదార్థాలు పర్యావరణంపై చూపే ప్రభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని సరుకులు కొనుక్కుంటున్నారు.
మనం తినే ప్రతీ పదార్థం కూడా ఎంతో కొంత కార్బన్ కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తుంది. ఇది, మనం నివసించే ప్రదేశం, తీసుకునే ఆహరాన్ని బట్టి.. ఒక్కొక్క ఇంటి నుంచీ విడుదల అయ్యే గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల్లో 10% నుంచీ 30% వరకూ ఉంటుంది.
మొత్తం ఆహార వ్యవస్థ అంటే ఆహార ఉత్పత్తి, ప్యాకింగ్, రవాణా, వంట, తిండిలో భాగంగా మనం పారవేసే పదార్థాలు.. ఇవన్నీ కలుపుకుని మొత్తం గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలలో 21% నుంచీ 37% వరకూ ఉంటాయి.
కార్బన్ ఫుట్‌ప్రింట్స్ తగ్గించే దిశగా చర్యలు తీసుకోకపోతే, 2050 నాటికి మానవ కార్యకలాపాల వలన విడుదల అయ్యే కార్బన్ ఉద్గారాల్లో ఆహారం వల్ల విడుదల అయ్యేవి దాదాపు సగం వరకూ వచ్చేస్తాయని అంచనా వేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, ఏవి తక్కువ కర్బన ఉద్గారాలు విడుదల చేస్తాయి, ఏవి చెయ్యవు అనేది మనం తెలుసుకోవడమెలా?
మనం కొనే ఆహార పదార్థాలపై పోషక విలువల జాబితా ఉన్నట్లు, వాటినుంచి విడుదలయ్యే కార్బన్ ఉద్గారాల జాబితా కూడా ఉంటే బాగుంటుంది. కానీ అది చాలా అరుదు.
అందుకే బీబీసీ.. వెర్వ్‌సెర్చ్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులతో కలిసి ఫుడ్‌ప్రింట్ కాలిక్యులేటర్ తయారు చేసింది.
దాన్లో ప్రధాన ఆహార పదార్థాల జాబితాను, ఒక వారంలో వాటిని ఎన్నిసార్లు వినియోగిస్తారో ఆ సంఖ్యను (ఏడుకు మించకుండా) ఎక్కిస్తే.. ఆ ఆహారం తీసుకోవడం వలన పర్యావరణంపై కలిగే ప్రభావాన్ని లెక్కించి చెబుతుంది.
ఇలా అన్ని ఆహార పదార్థాల కార్బన్ ఫుట్‌ప్రింట్స్ లెక్కించి చూసుకుని, వాటిని ఒకదానితో ఒకటి సరిచూసుకుంటూ తక్కువ కార్బన్ ఉద్గారాలు విడుదల చేసే ఆహార పదార్థాలను ఎంచుకోవచ్చు.
ఈ కాలిక్యులేటర్‌లో ఉపయోగించిన గణాంకాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచీ తీసుకున్న సగటు డేటాపై ఆధారపడి ఉంటాయి.
అయితే, ఆహార గొలుసులలో ఉండే సంక్లిష్టత వలన ఒకే రకమైన ఆహారాన్ని వివిధ ప్రాంతాలలో పండించడానికి అవసరమయ్యే నీరు, ఎరువులు, విడుదల చేసే కార్బన్ ఉద్గారాలు ఒక్కో రకంగా ఉంటాయి.
అందుకని, వాస్తవంలో విడుదలయ్యే కార్బన్ ఉద్గారాలు, ఈ కాలిక్యులేటర్ చూపించిన గణాంకాలకన్నా కొంత భిన్నంగా ఉండొచ్చు.
కానీ, ఈ కాలిక్యులేటర్ వలన ఆహారం ద్వారా విడుదల అయ్యే కార్బన్ ఉద్గారాల గురించి మొత్తంగా ఒక అవగాహన వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇటీవల విడుదల అయిన ఈట్-లాన్సెట్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం.. ఆహారం ద్వారా విడుదల అయ్యే కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా పండ్లు, కూరగాయలు, గింజలు, పప్పు దినుసుల వినియోగాన్ని రెట్టింపు చేయాలి. అదే సమయంలో, రెడ్ మీట్, షుగర్‌లను సగానికి తగ్గించాలి. మాంసం, పాల ఉత్పత్తులు తగ్గించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను చాలావరకు తగ్గించవచ్చు.
అయితే, కొన్ని రకాల ఆహార ఉత్పత్తులు ఆశ్చర్యం కలిగించే రీతిలో అధిక కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. ఉదాహరణకు ధాన్యం ఉత్పత్తి వలన అధిక స్థాయిలో మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ (రెండూ గ్రీన్‌హౌస్ వాయువులే) విడుదల అవుతున్నాయి.
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరొక ముఖ్య విషయం ఏమిటంటే.. మనం తిన్న తరువాత మిగిలిపోయిన ఆహార వ్యర్థాలు కూడా భూమిలోకి చేరి శక్తివంతమైన కార్బన్ ఉద్గారాలను వాతావరణంలోకి విడుదల చేస్తాయి. అందుకని ఆహారాన్ని వ్యర్థం చేయకుండా ఉండడం కూడా ముఖ్యం.
స్వీడన్‌లో జరిపిన ఒక పరిశోధన ప్రకారం.. ప్రతీ 3 కేజీల ఆహార వ్యర్థాలకూ, 23 కేజీల కార్బన్ ఉద్గారాలు మీథేన్ వాయువు రూపంలో వాతావరణంలోకి విడుదల అవుతాయి.
ఇటలీలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, ఆహార వ్యర్థాలను ఎరువులుగా మారిస్తే వాయు ఉద్గారాలు 14 శాతానికి తగ్గుతాయి.
మీరు తినే ఆహారం పర్యావరణంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకోవాలంటే ఈ బీబీసీ ఫుడ్‌ప్రింట్ కాలిక్యులేటర్ వాడి చూడండి.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఈ గవర్నమెంటు స్కూల్లో సీట్లు లేవు
- బెంగాల్‌తో తెలుగువారికి ఉన్న అనుబంధం ఏంటో తెలుసా?
- సిలికాన్ వాలీ తల్లిదండ్రులు తమ పిల్లలను టెక్నాలజీకి దూరంగా ఉంచుతున్నారు.. ఎందుకు?
- ‘కాందహార్’ విమానం హైజాక్: 21 ఏళ్ల క్రితం అదంతా ఎలా జరిగింది?
- నార్వే: జీతాల దాపరికంలేని దేశం
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ రెండు, మూడు దశలకు డీసీజీఐ అనుమతి
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- బాయ్‌ఫ్రెండ్ వల్ల గర్భం వచ్చింది.. భర్తకు తెలియకుండా బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ తర్వాత...
- ‘మర్చంట్ ఆఫ్ డెత్’: దేశాల మధ్య శత్రుత్వం పెంచి ఆయుధాలు విక్రయించి ధనవంతుడైన వ్యాపారి
- రైతు ఆత్మహత్యలు: ‘మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
- అప్పు త్వరగా తీర్చేయాలని పాకిస్తాన్‌ను సౌదీ ఎందుకు అడుగుతోంది?
- అనిల్‌కపూర్ : పెద్ద హీరోలు వద్దన్న పాత్రలు చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడని హీరో
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








