రెండోసారి అభిశంసన ఎదుర్కొంటున్న డోనల్డ్ ట్రంప్ - Newsreel

ఫొటో సోర్స్, Reuters
అమెరికా పార్లమెంటు.. క్యాపిటల్‌పై దాడి చేసేలా తన మద్దతుదారులను రెచ్చగొట్టారనే ఆరోపణలపై అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను పదవినుంచి దించేందుకు డెమొక్రాట్లు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఈ తీర్మానాన్ని పరిగణలోకి తీసుకోవాలా? వద్దా? అనే అంశంపై చర్చ జరుగుతోంది.
రిపబ్లికన్లు ఏం చెప్పారు?
అమెరికా అధ్యక్ష పదవి నుంచి రిపబ్లికన్ పార్టీ నాయకుడు డోనల్డ్ ట్రంప్‌ను తొలగించేందుకు డెమొక్రాట్లు చేస్తున్న ప్రయత్నాలకు కొందరు రిపబ్లికన్లు కూడా మద్దతు పలుకుతున్నారు.
గత వారం అమెరికా క్యాపిటల్ భవనంలో అల్లర్లకు సంబంధించి ట్రంప్‌ను అభిశంసించాలని ప్రతినిధుల సభలో మూడో సీనియర్ రిపబ్లికన్ నాయకురాలు లిజ్ చేనీ వ్యాఖ్యానించారు.
తన మద్దతుదారులు చేపట్టిన ఈ నిరసనలకు బాధ్యత తీసుకునేందుకు ట్రంప్ నిరాకరించారు. జనవరి 20న ఆయన స్థానంలో జో బైడెన్ బాధ్యతలు తీసుకోనున్న సంగతి తెలిసిందే.
సభలో మూడో సీనియర్ రిపబ్లికన్ నాయకురాలు లిజ్ చెనీ అభిశంసనకు మద్దతిస్తానని మాట ఇచ్చారు. "ట్రంప్ గుంపును పిలిచారు. వాళ్లను కూడగట్టారు. ఈ దాడికి ఆజ్యం పోశారు" అని ఆరోపించారు.
"తన కార్యాలయానికి, రాజ్యాంగంపై చేసిన ప్రమాణానికి ఏ అమెరికా అధ్యక్షుడు, ఎప్పుడూ ఇంత పెద్ద ద్రోహం చేయలేదు" అని వ్యోమింగ్ ప్రతినిధి మాజీ ఉపాధ్యక్షుడు డిక్ చెనీ కుమార్తె అన్నారు.
కనీసం నలుగురు రిపబ్లికన్ సభ్యులు తాము కూడా అభిశంసనకు అనుకూలంగా ఓటు వేస్తామని చెప్పారు.
రిపబ్లికన్ నేత, ట్రంప్ సహచరుడు కెవిన్ మెక్ కార్తీ తాను అభిశంసనను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.
"డెమాక్రాట్లు అధ్యక్షుడి అభిశంసనను కోరుకోవడం సంతోషం, అది ట్రంప్ రిపబ్లికన్ పార్టీని వదిలించుకోడానికి సహకరిస్తుందని నమ్ముతున్నాను" అని సెనేట్ రిపబ్లికన్ నేత మిచ్ మెక్ కనెల్ అన్నట్లు న్యూయార్క్ టైమ్స్ చెప్పింది.
చరిత్రలో నిలిచిపోనున్న ట్రంప్
అయితే, అల్లర్లను రెచ్చగొట్టారనే ఆరోపణలపై ట్రంప్‌కు వ్యతిరేకంగా డెమొక్రాట్లు ప్రవేశపెడుతున్న అభిశంసన తీర్మానంపై ప్రతినిధుల సభలో బుధవారం ఓటింగ్ జరిగే అవకాశముంది. ఈ తీర్మానం ఆమోదం పొందితే రెండుసార్లు అభిశంసన ఎదుర్కొన్న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలిచిపోతారు.
మరోవైపు ట్రంప్ స్థానంలో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ బాధ్యతలు తీసుకొనేందుకు వీలు కల్పించే 25వ రాజ్యాంగ సవరణకు 223/205 ఓట్ల ఆధిక్యంతో మంగళవారం ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అయితే, ట్రంప్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా లేనని ఇప్పటికే పెన్స్ స్పష్టంచేశారు. దీంతో అభిశంసన తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్లాలని డెమొక్రటిక్ పార్టీ నిర్ణయించింది.
ప్రతినిధుల సభలో ఈ తీర్మానం ఆమోదం పొందితే.. సెనేట్‌లో ఆరోపణలపై విచారణ చేపడతారు. అనంతరం మూడింట రెండొంతుల ఆధిక్యంతో ఈ తీర్మానాన్ని సెనేట్ ఆమోదించాల్సి ఉంటుంది. అంటే డెమొక్రాట్లతోపాటు 17 మంది రిపబ్లికన్ సెనేటర్లు కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
సైన్యంలో వివాహేతర సంబంధాలను నేరంగానే పరిగణించాలి: కేంద్రం అభ్యర్థనపై విచారణకు అంగీకరించిన సుప్రీం కోర్టు
ఇష్టపూర్వక వివాహేతర సంబంధాలు (అడల్టరీ) నేరం కాదంటూ 2018లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నుంచి సాయుధ బలగాలకు మినహాయింపు ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అభ్యర్థనపై విచారణకు సుప్రీం కోర్టు బుధవారం అంగీకరించింది.
ఈ అంశంపై జస్టిస్ రోహింటన్ ఫలీ నారీమన్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం నోటీసులు జారీచేస్తూ.. ఈ అంశాన్ని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనానికి అప్పగించాలని చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డేకు సూచించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బ్రిటిష్ కాలంనాటి అడల్టరీ చట్టాన్ని 2018లో సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను ఇది హరిస్తోందని, మహిళలను తమ సొత్తుగా పురుషులు భావించేందుకు ఇది వీలు కల్పిస్తోందని వ్యాఖ్యానించారు.
అయితే, ఈ తీర్పును సాయుధ బలగాలు స్వాగతించలేదు. స్వలింగ సంపర్కం, వివాహేతర సంబంధాలను నేరంగానే పరిగణించాలని సాయుధ బలగాల ప్రతినిధులు వాదించారు. ఇలాంటి సంబంధాలను నేరంగా పరిగణించకపోతే క్రమశిక్షణ పరమైన సమస్యలు తలెత్తుతాయని భద్రతా అధికారులు భావిస్తున్నారు.
దీంతో ఈ తీర్పును సాయుధ బలగాలకు వర్తించకుండా చూడాలని సుప్రీం కోర్టును కేంద్రం అభ్యర్థించింది. తోటి ఉద్యోగి సతీమణితో వివాహేతర సంబంధాలు ఉంటే, దీన్ని తగని చర్యగా భావిస్తూ ఆ అధికారిని విధుల్లో నుంచి తొలగించే నిబంధనలు ఉన్నాయి. వీటికి సుప్రీం కోర్టు తీర్పు అడ్డుపడుతోంది.
మరోవైపు వివాహ బంధం పవిత్రతను కాపాడటానికి అడల్టరీ నిబంధనలు అవసరమని 2018లో కేంద్రం కూడా వ్యాఖ్యానించింది.
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా క్రికెటర్లు స్లెడ్జింగ్ చేసినప్పుడు విరాట్ కోహ్లీ చెప్పిన మర్యాద కథ
- సింగపూర్: కోట్లు ఇస్తామన్నా ఈ రెండు ఇళ్ల యజమానులు కదలటం లేదు.. ఎందుకు?
- సిరాజ్‌పై మళ్లీ జాత్యహంకార వ్యాఖ్యలు.. హైదరాబాద్ క్రికెటర్‌పై ఆస్ట్రేలియాలో విద్వేషం కక్కిన ప్రేక్షకులు
- ‘అన్నీ పోను రూ. 500 నెల జీతం’.. అందుకే కార్మికులు తిరగబడి ఫ్యాక్టరీని ధ్వంసం చేశారా
- బెడిసికొట్టిన ఆస్ట్రేలియా స్లెడ్జింగ్... అసలు ఆ జట్టు సంస్కృతి మారదా?
- జస్ప్రీత్ బూమ్రా: ఆస్ట్రేలియన్లను ఆశ్చర్యపరుస్తున్న బౌలింగ్ సంచలనం
- ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్... సక్సెస్‌కు ఆయన చెప్పిన ఆరు సూత్రాలు
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- 127 ఏళ్ల కిందట ప్రపంచానికి భారత ఘనతను చాటిన వివేకానందుడి ప్రసంగం ఇదే..
- ‘ఎవరికీ ద్రోహం చేయలేను... అందుకే ఇద్దరినీ ఒకేసారి పెళ్లి చేసుకున్నా’
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











