కొత్త రకం కరోనావైరస్: బ్రిటన్ నుంచి విమానాల రాకపోకలపై భారత్ సహా వివిధ దేశాల నిషేధం

ఫొటో సోర్స్, PA Media
బ్రిటన్‌లో కొత్త రకం కరోనావైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి.
బ్రిటన్ నుంచి రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. భారతదేశం కూడా బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను 2020 డిసెంబరు 31 వరకు రద్దు చేసింది.
ఈ మేరకు భారత పౌర విమానయాన శాఖ ప్రకటించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
డిసెంబరు 22 రాత్రి 11.59 నిమిషాల నుంచి బ్రిటన్ నుంచి విమానాల రద్దు అమలులోకి వస్తుందని ఆ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
అలాగే భారత్ నుంచి బ్రిటన్ వెళ్లాల్సిన విమానాలనూ డిసెంబరు 22 నుంచి 31 వరకు రద్దు చేసినట్లు తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
డిసెంబరు 22 రాత్రి 11.59 నిమిషాలకు ముందు బ్రిటన్ నుంచి చేరే విమానాల్లో వచ్చే ప్రయాణికులంతా విమానాశ్రయంలో దిగిన వెంటనే కరోనావైరస్ నిర్ధరణ కోసం ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకునేలా ఆదేశాలు జారీచేశారు.
యూరోపియన్ దేశాల అప్రమత్తం
కొత్తరకం కరోనావైరస్ లండన్, ఆగ్నేయ ఇంగ్లండ్‌లలో ప్రబలడంతో మిగతా దేశాలు జాగ్రత్త పడుతున్నాయి.
తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఈయూ సభ్య దేశాలు సమావేశమవుతున్నాయి.
ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఇటలీ, డెన్మార్క్, ఆస్ట్రియా, పోర్చుగల్, స్వీడన్‌లు ఇప్పటికే బ్రిటన్ నుంచి తమ దేశాలకు విమానాలు రాకుండా తాత్కాలిక నిషేధం ప్రకటించాయి.
* బల్గేరియా: ఈ దేశం కూడా బ్రిటన్ నుంచి విమానాలను రద్దు చేసింది. అయితే, మిగతా కొన్ని దేశాలలా కొద్ది రోజులకే ఈ నిషేధం పరిమితం చేయకుండా 2021 జనవరి 31 వరకు నిషేధించింది.
* టర్కీ, స్విట్జర్లాండ్: యూకే నుంచి వచ్చే విమానాలకు ఈ రెండు దేశాలు కూడా నో చెప్పాయి.
* కెనడా: యూరప్ దేశాలే కాకుండా కెనడా కూడా బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికుల విమానాలపై 72 గంటల తాత్కాలిక నిషేధం ప్రకటించింది.
* హాంకాంగ్, ఇజ్రాయెల్, ఇరాన్, క్రొయేషియా, అర్జెంటీనా, ఎల్ సాల్వడార్, చిలీ, మొరాకో, కువైట్ వంటి ఇతర దేశాలూ యూకే నుంచి విమానాల రాకపై ఆంక్షలు విధించాయి.
* మరోవైపు సౌదీ అరేబియా అయితే యూకే విమానాలే కాకుండా అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులనూ వారం రోజుల పాటు రద్దు చేసింది.
ఇవి కూడా చదవండి.
- కొత్త కరోనావైరస్: ఇది ఇంకా ప్రమాదకరమా? వ్యాక్సీన్ పనిచేయదా?
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- కరోనావైరస్తో మన రోగనిరోధక వ్యవస్థ ఎలా పోరాడుతుందంటే.
- కరోనావైరస్ నుంచి 90 శాతం రక్షణ కల్పించే తొలి వ్యాక్సీన్ ఇదే
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- భారత్-చైనా ఉద్రిక్తతలు: భారత్ ఎందుకు వరుసగా క్షిపణి పరీక్షలు చేపడుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








