చైనా చాంగ్'ఇ మూన్ మిషన్ సక్సెస్‌తో ఆ 24 ఏళ్ల యువతి పేరు దేశమంతటా మార్మోగిపోతోంది...

ఫొటో సోర్స్, CCTV
చైనా సోషల్ మీడియాలో 24 సంవత్సరాల మహిళా స్పేస్ కమాండర్ జౌ చెంజ్యు పేరు వైరల్ అయింది. చైనా చంద్రయాన కార్యక్రమం చాంగ్'ఇ 5 లో ఆమె పోషించిన పాత్రకు గాను ఆమె పేరు సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
వెన్చాంగ్ స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ సైటులో ఆమె అత్యంత చిన్న వయసు ఉన్న కమాండర్ కావడం కూడా ఒక విశేషం. ఆమెను పని స్థలంలో అందరూ మర్యాదగా "పెద్ద అక్క" అని పిలుస్తారు.
చైనా విజయవంతంగా చంద్రుని పైకి అడుగుపెట్టిన మూడవ మిషన్ 'చాంగ్'ఇ 5'.
ఈ మిషన్ లో జౌ రాకెట్ కనెక్టర్ సిస్టంకి ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ మిషన్లో ఆమె వహిస్తున్న పాత్ర చాలా కీలకమైనది.
నవంబరు 23న చాంగ్'ఇ 5 చంద్రుని పై విజయవంతంగా అడుగుపెట్టిన మిషన్లో ఈ యువ మహిళా వ్యోమగామి గురించి చైనా మీడియా ప్రసారం చేసిన దగ్గర నుంచి చైనా సోషల్ మీడియా ప్లాట్ఫారం వీబోలో ఆమె ట్రేండింగ్ అంశంగా మారారు.
ఆమెకున్న చిన్న వయసు వలన ఈమె కథలో చాలా మంది తమని తాము చూసుకున్నారు. ఆమె ప్రతిభను, సోషల్ మీడియాలో సంబరంగా జరుపుకుంటూ ఆమెను దేశ ప్రతిష్టను ఇనుమడింప చేసిన వ్యక్తిగా కీర్తిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కొంత మంది తాము జీవితంలో సాధించిన ఘనతను చెప్పుకుంటూ, ఆమెతో పోలిస్తే తాము ఎంత వెనకబడి ఉన్నామో అని అంటూ హాస్యంగా కామెంట్లు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
వేఝౌ ప్రాంతంలో ఆమె పట్ల కలిగిన ఆసక్తి ఆమె పై మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదు. ఆమె చేస్తున్న పనికి కీర్తి అడ్డు రాకూడదనే ఆలోచనతో ఆమె కోసం వరసగా వచ్చిన ఇంటర్వ్యూ అభ్యర్థనలను ఆమె తోసి పుచినట్లు డోకాయి వే ఝౌ నెట్ అనే వార్తా సంస్థ పేర్కొంది.
చైనాలో చంద్ర దేవతగా భావించే చాంగ్'ఇ పేరును ఈ మిషన్ కి పెట్టారు. చంద్రుని ఆకారంలో జరిగే పరివర్తనలను శాస్త్రవేత్తలు మరింత తెలుసుకునేందుకు చంద్రుని పై ఉన్న శిలలను, మట్టిని సేకరించడమే ఈ మిషన్ ముఖ్య లక్ష్యంగా ఉంది.
ఈ మిషన్ విజయవంతం అయితే చంద్రుని పై ఉన్న నమూనాలను భూమికి తీసుకుని వచ్చే మిషన్లలో గత 40 సంవత్సరాలలో ఇదే మొదటిది అవుతుంది. అమెరికా, సోవియెట్ యూనియన్ల తర్వాత దీనిని సాధించిన దేశంగా చైనా మూడవ స్థానంలో నిలుస్తుంది.

ఫొటో సోర్స్, CCTV
అంతరిక్ష సూపర్ పవర్ అయ్యేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలలో భాగమే ఈ మిషన్. "ఈ మిషన్ జాతీయ పునరుజ్జీవం అవుతున్న మార్గంలో ఒక ముందడుగు" అని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు.
పెరుగుతున్న సాంకేతిక బలాన్ని ప్రదర్శించేందుకు ప్రపంచ వేదిక మీద తనను తాను ఒక శక్తి గా చూపించుకునేందుకు చైనా ఈ అంతరిక్ష యానాన్ని ఒక మార్గంగా భావిస్తోంది.
ఈ చంద్రయానం దేశ సమగ్ర శక్తికి అద్దం పడుతుందని చైనాలో ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఓయాంగ్ జువాన్ చైనా అధికార పత్రిక పీపుల్స్ డైలీకి 2006లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
గత సంవత్సరం చంద్రుని పై విజయవంతంగా రోబోటిక్ స్పేస్ క్రాఫ్ట్ ని అమర్చిన దేశాలలో చైనా మొదటి దేశంగా నిలిచింది.
మరి కొన్ని సంవత్సరాలలో ఇది చంద్రుని పై ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రణాళికలు చేస్తోంది. అలాగే, అంగారక గ్రహం మీదకు కూడా మనుష్యులను పంపాలని ఆలోచిస్తోంది.

ఫొటో సోర్స్, CNSA/CLEP
కెర్రీ అల్లెన్
చైనా మీడియా అనలిస్ట్
చైనా పౌరాణిక పాత్ర అయిన 'చాంగ్'ఇ' అనే చంద్ర దేవత గురించి చైనా దేశస్థులుకు చాలా వరకు పరిచితమే. ఇది కొంత వరకు రోమియో జూలియట్ లాంటి కథ లాంటిదే. ఈ కథలో కూడా 'చాంగ్'ఇ' అమరంగా ఉండేందుకు అమృతాన్ని అనుకోకుండా భర్తకు మిగల్చకుండా తాగేస్తుంది. భర్త మరణించే వరకు అతని దగ్గరే ఉండవచ్చనే ఉద్దేశ్యంతో ఆమె చంద్రుని పైకి సునాయాసంగా ఎగిరిపోతుంది.
ఈ కథను చైనాలో వసంతకాలం మధ్యలో వచ్చే మూన్ పండగ సమయంలో చెప్పుకుంటూ ఉంటారు. దీంతో చాంగ్'ఇ పేరు వినగానే ప్రేమ దేవతను ఊహించుకుంటూ ఉంటారు.
ఈ కారణంతోనే చైనా మూన్ మిషన్ కి ఒక శక్తిమంతమైన మహిళ పేరు పెట్టారు. అందుకే 24 సంవత్సరాల జౌ చెంగ్యు ఫోటోలను కూడా అధికారిక మీడియాలో బాగా ప్రచారం చేశారు. ఆమెను ఏరో స్పేస్ రంగంలో ముందు వరసలోనున్న ఒక సైనికురాలిగా చూడవచ్చని, చైనా యువత ఆమెను ఒక పెద్దక్కగా మార్గదర్శకత్వం కోసం చూడవచ్చనే కామెంట్లతో సందేశాలను పంపారు.

ఫొటో సోర్స్, CCTV
దేశంలో ఉన్న శక్తివంతమైన మహిళలకు ప్రచారం కల్పించాలని చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దేశంలో అత్యున్నత స్థానాల్లో ఉన్న నాయకులలో ఎక్కువగా పురుషులే ఉన్నారు. కానీ ఈ ఏడాది నవంబరులో వైద్య శాస్త్రవేత్త చెన్ వెయ్ , విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యిన్గ్ , యు ఎఫ్ సి ఫైటర్ జాన్గ్ వీలి లాంటి మహిళలు సాధించిన ఘనత పై అభిప్రాయాలు వ్యక్తం చేయమంటూ చైనా జాతీయ పత్రిక గ్లోబల్ టైమ్స్ నెటిజెన్లకు ఆహ్వానం పలికింది.
దేశంలో మహిళలు పోషించే పాత్రను ఇంకా చాలా రంగాల్లో తక్కువ చేసే చూస్తున్నారని చాలా మంది భావిస్తున్నారు. చైనాలో కోవిడ్ ని ఎదుర్కొనేందుకు మహిళల పాత్రను చూపించిన ఒక డ్రామాను సెక్సిస్టుగా ఉందనే అంశం పై సెప్టెంబరులో చాలా పెద్ద చర్చ జరిగింది.
ఇవి కూడా చదవండి:
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- ఆలయంలో ముద్దు సీన్, నెట్‌ఫ్లిక్స్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- వై.ఎస్.జగన్‌కు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్.. బెంగాల్లో మమతను గట్టెక్కించగలరా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








