#BoycottNetflix: ఆలయంలో ముద్దు సీన్, నెట్‌ఫ్లిక్స్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం

నెట్‌ఫ్లిక్స్‌లో ముద్దు సీన్

ఆన్‌లైన్ స్ట్రీమింగ్ వెబ్‌సైట్ నెట్‌ఫ్లిక్స్‌ను బహిష్కరించాలంటూ ఆదివారం భారత్‌లో చాలా మంది ట్వీట్లు చేశారు. దీంతో కొన్ని గంటల నుంచీ ట్విటర్‌లో #BoycottNetflix ట్రెండ్ అవుతోంది.

నెట్‌ఫ్లిక్స్‌లో 'ఎ సూటబుల్ బాయ్‌' అనే సిరీస్‌లోని కొన్ని దృశ్యాలే దీనికి కారణం. వీటిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

అందులో ఒక సన్నివేశంలో ఒక అబ్బాయి, అమ్మాయి ఆలయ ప్రాంగణంలో ముద్దు పెట్టుకుంటుంటారని, వారి వెనుక భజనలు చేస్తుంటారని చెబుతున్నారు.

ఈ సిరీస్ స్క్రిప్ట్ ప్రకారం ఒక హిందూ అమ్మాయి, ఒక ముస్లిం అబ్బాయితో ప్రేమలో పడడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

మేము ఈ కథనం రాసే సమయానికి నెట్‌ఫ్లిక్స్‌ను బహిష్కరించాలనే హాష్‌టాగ్ ట్విటర్‌లో 66 వేలకు పైగా ట్వీట్లతో అన్నిటికంటే టాప్ ట్రెండ్‌లో ఉంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

గౌరవ్ తివారీ అనే ఒక ట్విటర్ యూజర్ ఈ సిరీస్‌పై తను మధ్యప్రదేశ్‌లోని రీవాలో కేసు పెట్టానని చెప్పారు.

గౌరవ్ తివారి ట్విటర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఫాలో అవుతున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

మధ్యప్రదేశ్ హోంమంత్రి అభ్యంతరం

మరోవైపు, మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా అభ్యంతరకర దృశ్యాలుగా చెబుతున్న ఇవి ఒక మతం వారి మనోభావాలను దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. ఈ వివాదాస్పద కంటెంట్ గురించి దర్యాప్తు చేయాలని ఆదేశించారు.

నరోత్తమ్ మిశ్రా దీనికి సంబంధించి తన ట్విటర్ అకౌంట్‌లో ఓక వీడియో కూడా పెట్టారు.

ఆయన అందులో "ఒక ఓటీటీ ప్లాట్‌ఫాంలో 'ఎ సూటబుల్ బాయ్' అనే కార్యక్రమం వస్తోంది. దానిని నేను అభ్యంతరకరంగా భావిస్తున్నాను. ఒక ఆలయం లోపల ఒక వ్యక్తి ముద్దు పెట్టే దృశ్యాలు చిత్రీకరిస్తున్నారు. వెనక భజనలు చేస్తున్నారు. వరసగా రెండు మూడు సార్లు ఇలాగే చేశారు. అది మనోభావాలను దెబ్బతీస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. దీనిని పరిశీలించాలని నేను అధికారులకు సూచించాను. ఓటీటీ ప్లాట్‌ఫాంపై ఇలాంటి కార్యక్రమాలను చూపించడంలో వారి ఉద్దేశం ఏంటి. దీనితో పాత థీమ్‌ను మళ్లీ ప్రారంభించారా, నిర్మాత, దర్శకులపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు. అన్నీ కోణాల్లో పరిశీలించి నాకు వెంటనే తెలియజేయాలన్నాను" అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ట్విటర్‌లో స్పందనలు

#BoycottNetflixతోపాటూ ట్విటర్‌లో జనం వరుస ట్వీట్లు చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ లవ్ జిహాద్‌ను కీర్తిస్తోందని కొందరు ఆరోపిస్తున్నారు.

రాష్ట్రవాదీ కెప్టెన్ జాక్ అనే పేరున్న ఒక ట్విటర్ యూజర్ ఆలయం ప్రాంగణంలో ముద్దు దృశ్యం చిత్రీకరించిన నెట్‌ఫ్లిక్స్ హిందువుల మనోభావాలను దెబ్బతీసింది కాబట్టి ఈరోజే దాన్ని అన్‌-ఇన్‌స్టాల్ చేయండి అని పెట్టారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

అటు విక్రాంత్ అనే యూజర్ "#BoycottNetflix‌తో ఏం లాభం లేదు. ప్రతి ప్లాట్‌ఫాంలోనూ హిందూఫోబియా కంటెంట్‌కు చోటు ఇస్తున్నారు. దోషులైన ఈ డైరెక్టర్/నటుల ప్రస్తుత, లేదా భవిష్యత్తులో వచ్చే ఏ సిరీస్‌నూ చూడకండి. వారికి వ్యూస్ రాకపోతే, ఆగిపోతారు. నేను ఎప్పుడూ ఇలాంటి ఏ సిరీస్‌ చూళ్లేదు" అని పెట్టారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

ప్రియా మిశ్రా అనే ట్విటర్ యూజర్ నెట్‌ఫ్లిక్స్ ఒక ఓటీటీ ఫ్లాట్‌ఫాం మాత్రమే. మనం ఈ సిరీస్ ప్రొడ్యూసర్, డైరెక్టర్‌ను బహిష్కరించాలి. వారికి వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

ట్విటర్‌లో తనను లాయర్‌గా, పంజాబ్ బీజేపీ ప్రతినిధిగా చెప్పుకునే గౌరవ్ గోయల్ తన ట్వీట్‌లో "ఏదైనా ఒక ఓటీటీ ప్లాట్‌ఫాం ఉద్దేశపూర్వకంగా హిందూ దేవీ, దేవతలను అవమానిస్తుంటే, దయచేసి ఐపీసీ సెక్షన్ 295A కింద స్థానిక కోర్టులో లేదా పోలీసులకు ఫిర్యాదు చేయండి" అని చెప్పారు.

కొంతమంది ఈ హాష్‌టాగ్‌కు వ్యతిరేకం

కానీ కొంతమంది #BoycottNetflix ట్రెండ్‌ కావడంపై ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

అక్షయ్ బెనర్జీ అనే ట్విటర్ యూజర్ ఖజురహో ఆలయంలో విగ్రహాల పొటో పోస్ట్ చేయడంతో పాటూ "ఆలయం లోపల ఎలా ముద్దు సీన్ చూపిస్తారు. అది మన సంస్కృతి కాదు" అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 8
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 8

అటు, స్వాతి అనే ట్విటర్ యూజర్ "ఫ్రాన్స్‌లో ఫ్రీ స్పీచ్ కోరుకునే అదే మనుషులు భారత్‌లో #BoycottNetflix ట్రెండ్ చేస్తున్నారు. ఎంత వంచనో" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)