భారీ జలాశయాలు భూమిని, మానవ జీవితాన్ని ఎలా మార్చేశాయంటే..

ఆనకట్ట

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హాంకాంగ్‌లో త్రికోణాకృతిలో కనిపిస్తున్న వందేళ్లనాటి కౌలూన్ డ్యాం
    • రచయిత, రిచర్డ్ ఫిషర్, జేవియర్ హిర్క్‌ఫీల్డ్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

కొన్ని మానవ కట్టడాలు భూమిని సమూలంగా మార్చివేయగలవు. వాటిలో డ్యాంలు ప్రధానమైనవి. ఇవి భూమి నైసర్గిక స్వరూపాన్ని ఊహంచని రీతిలో మార్చేస్తాయి.

నదుల్లో నీటిని నిలువరించేందుకు వీటిని నిర్మిస్తారు. గురుత్వాకర్షణ శక్తిని ఆసరాగా చేసుకొని పర్వత ప్రాంతం నుంచి దిగువకు ప్రవహించే నీటిని ఇవి అడ్డుకుంటాయి. లోతట్టు ప్రాంతాన్ని ముంచివేయడంతోపాటు ఇవి చాలా మార్పులకు కారణం అవుతాయి. ఇవి నది సహజ గమనాన్ని మారుస్తాయి. మరోవైపు నది గుండా ప్రవహించే అవక్షేపాలు కూడా కృత్రిమంగా నిర్మించే డ్యాం దగ్గర నిలిచిపోతాయి. దిగువ ప్రాంతంలో నీటి ప్రవాహాన్ని ఇవి తగ్గించేస్తాయి.

సన్నంగా పొడవుగా కనిపించే గోడలు, దృఢమైన పునాదులు ఇలా చెప్పుకుంటూ పోతే వీటి నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. వీటిలో కొన్ని అయితే వేల ఏళ్లపాటు అలానే చెక్కుచెదరకుండా ఉండిపోతాయి.

మరోవైపు పరిసరాల్లో నివసించే వారితోపాటు వారి భవిష్యత్ తరాల తలరాతలనూ డ్యాంలు మార్చేస్తాయి. ముఖ్యంగా ఎక్కడో సుదూర ప్రాంతంలో నుండే ప్రభుత్వం ఇక్కడి నదిపై ఆనకట్ట నిర్మించాలని భావించినప్పుడు.. ఇక్కడి ఇళ్లు, పంట పొలాలు నది విధ్వంసానికి బలవుతుంటాయి.

ఉదాహరణకు ఈ ఏడాది మొదట్లో అందరూ కోవిడ్-19 గురించి ఆందోళన చెందేటప్పుడు.. టర్కీలోని ఓ పురాతన నగరం రిజర్వాయర్‌లో పెరుగుతున్న నీటి మట్టానికి మునిగిపోయింది. భవిష్యత్‌లో పురావస్తు శాస్త్రవేత్తలు బహుశా ఇలా ముంపునకు గురయ్యే ప్రాంతాలపై అధ్యయనం చేపడతారేమో. రాజకీయాల కోసం, విద్యుత్ శక్తి కోసం ఎందుకు ఇంత మంచి ప్రాంతాన్ని ముంచేశారని..?

ఎక్కడో దూరంగా కట్టే డ్యాంలు కూడా మనపై ప్రభావం చూపుతాయి తెలుసా? కొన్ని దేశాల గుండా ప్రవహించే నైలు లాంటి నదులపై ఆనకట్టలతో విలువ కట్టలేని మంచి నీరు, విద్యుత్ మనకు అందుతాయి. అయితే, అదే సమయంలో దిగువనున్న దేశాల గమనమే ఒక్కోసారి మారిపోతుంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా డ్యాంలు సృష్టిస్తున్న సరికొత్త చరిత్ర, సమూల మార్పులను ఇప్పుడు చూద్దాం..

ఆనకట్టలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టర్కీలోని పురాతన హసన్‌కీఫ్ నగరం ఈ ఏడాది ప్రారంభంలో ఇలిసు డ్యాం బ్యాక్‌వాటర్‌తో ముంపుకు గురైంది. ఈ డ్యాంప్‌పై 1,200 మెగావాట్ల సామర్థ్యంతో పవర్ ప్లాంట్ ఉంది
ఆనకట్టలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒకప్పుడు సిల్క్ రూట్‌లో ఇదీ ఒక భాగం. అయితే టైగ్రిస్ నది ఉప్పొంగడంతో ప్రజలు ఈ నగరాన్ని వదిలిపెట్టేశారు
ఆనకట్టలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నీటి ప్రవాహం నెమ్మదిగా పెరిగింది. ఫిబ్రవరి నాటికి కొత్త, పాత అసలు ఎలాంటి తేడా లేకుండా అన్ని భవనాలనూ ఇది ముంచెత్తింది
ఆనకట్టలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నదీ అటుఇటు వైపు ప్రాంతాలు చెరువు కట్టలను తలపించాయి. క్రమంగా నీరు పెరుగుతూ నగరాన్నే ఆక్రమించింది
ఆనకట్ట

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హసన్‌కీఫ్‌లో గమ్యంలేని రోడ్డు ఇది
ఆనకట్ట

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆగస్టులో నీటిలో జలకాలాడుతున్న బాలిక. రిజర్వాయర్ నిండినప్పుడు 116 చ.కి.మీ. ప్రాంతాన్ని నీట ముంచింది
ఆనకట్టలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హసన్‌కీఫ్ నగరవాసులు ప్రస్తుతం ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న న్యూహసన్‌కీఫ్ నగరానికి వచ్చేశారు
ఆనకట్ట

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉప్పెనలా పొంగుతూ కనిపిస్తున్న ఈ నీటి ప్రవాహం కెనడాలోని క్లీవ్‌ల్యాండ్ డ్యామ్ దగ్గరది
ఆనకట్ట

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇది అమెరికాలోని పీక్ డిస్ట్రిక్ట్ నేషనల్ పార్క్‌లెపి లేడీబోవర్ డ్యాం
ఆనకట్ట

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వేల్స్‌లో త్రికోణాకృతిలో కనిపిస్తున్న డ్యాం. ఈ భారీ కట్టడాలు భూమిలో చాలా లోతువరకు నిర్మిస్తారు
ఆనకట్ట

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొన్ని భారీ రిజర్వాయర్లు పరిసర ప్రాంతాల భౌగోళిక స్వరూపాన్నే మార్చేస్తాయి. అందుకు ఇరాక్‌లో డ్యూకాన్ డ్యాం ఉదాహరణగా చెప్పుకోవచ్చు
ఆనకట్ట

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విహంగ వీక్షణం
ఆనకట్ట

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లెబనాన్‌లోని బెకా లోయలోని రిజర్వాయర్ పరిమాణం ఇదీ..
ఆనకట్ట

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొన్నిసార్లు పాడైన డ్యాంలను ఉపయోగించుకోవచ్చు. ఫిలిప్పీన్స్‌లోని ఈ డ్యాం వేసవి నుంచి సేదతీరుస్తోంది
ఆనకట్ట

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొన్నిసార్లు రిజర్వాయర్లు కూడా ఎండిపోతాయి. చిలీలోని ఎల్ యెసో దీనికి ఉదాహరణ
ఆనకట్ట

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, కొన్నిసార్లు ఎండిపోయిన రిజర్వాయర్లు అద్భుతాలను చూపిస్తాయి. స్పెయిన్‌లో వేల్‌డెకనాస్ డ్యాం ఎండిపోవడంతో ఐదువేల ఏళ్లనాటి కట్టడం బయటపడింది
ఆనకట్ట

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అవును ప్రకృతిని అడ్డుకోలేం. అఫ్గానిస్తాన్‌లో బందీ సుల్తాన్ డ్యాం బద్దలైనప్పుడు ఇలా..
ఆనకట్ట

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డ్యాంలు ఏళ్లపాటు చెక్కు చెదరకుండా ఉండిపోగలవు. కానీ నదులను అవి ఆవిరి చేస్తాయి. చైనాలోని డాఝౌ జల విద్యుత్ కేంద్రంలో ఇలా..
వీడియో క్యాప్షన్, నాగార్జునసాగర్: 50 ఏళ్లుగా తెలుగునేలను సస్యశ్యామలం చేస్తున్న ప్రాజెక్టు
వీడియో క్యాప్షన్, పోలవరం ప్రాజెక్టు వల్ల లక్షలాది మంది నిరాశ్రయులు కానున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)