రెమెడెసివీర్: ‘ఈ మందు వాడిన కరోనా రోగులు 10 రోజుల్లోనే కోలుకుంటున్నారు’.. కోవిడ్ మందుకు పూర్తి అనుమతులు ఇచ్చిన అమెరికా

ఫొటో సోర్స్, Reuters
ఆస్పత్రుల్లో కోవిడ్-19 రోగులకు చికిత్స కోసం యాంటీవైరల్ డ్రగ్ రెమెడెసివీర్‌కు అమెరికా ప్రభుత్వం పూర్తి అనుమతి ఇచ్చింది.
ఐదు రోజులపాటు జరిగిన క్లినికల్ ట్రయల్స్ లో రోగులు కోలుకునే సగటు సమయాన్ని వెక్లరీ అనే బ్రాండ్ మందు తగ్గించిందని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) చెప్పింది.
"కోవిడ్-19 చికిత్సకు ఎఫ్‌డీఏ అనుమతులు పొందిన తొలి ఔషధం వెక్లరీ" అని ఎఫ్‌డీఏ ఒక ప్రకటన విడుదల చేసింది.
కోవిడ్ రోగులపై రెమెడెసివీర్ ప్రభావం అసలు లేకపోవడం గానీ, లేదా అంతంతమాత్రమే ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ గత వారం చెప్పింది.
తాము స్వయంగా జరిపిన అధ్యయనంలో ఇది తేలిందని డబ్ల్యుహెచ్ఓ చెప్పింది. కానీ ఆ పరిశోధనలో కనుగొన్నవాటిని డ్రగ్ తయారీ సంస్థ గిలీడ్ కొట్టిపారేస్తోంది.
మే నెల నుంచి అమెరికాలో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి రెమెడెసివీర్‌ను అధికారికంగా అనుమతించారు.
ఇటీవల అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు జరిగిన కరోనా చికిత్సలో కూడా దీనిని ఇచ్చారు. ఆయన కోలుకున్నారు.
ఎఫ్‌డీఏ ఏం చెబుతోంది
ఆస్పత్రుల్లో కోవిడ్-19 చికిత్స పొందుతున్న పెద్దలకు, 12 ఏళ్లు పైబడిన పిల్లలకు, వృద్ధులకు, కనీసం 40 కిలోల బరువున్న వారికి దీనిని ఉపయోగించడానికి గురువారం అనుమతులు ఇచ్చామని ఎఫ్‌డీఏ తన ప్రకటనలో చెప్పింది.
"ఏజెన్సీ నిశితంగా పరిశీలించిన, కోవిడ్-19 మహమ్మారి చికిత్సలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన వివిధ క్లినికల్ ట్రయల్స్ గణాంకాల ఆధారంగా ఈరోజు దీనికి అనుమతులు ఇచ్చామ"ని ఎఫ్‌డీఏ కమిషనర్ స్టీఫెన్ హన్ చెప్పారు.
రాండమ్‌గా తీసిన మూడు నియంత్రిత క్లినియల్ ట్రయల్స్ నుంచి అందిన గణాంకాల విశ్లేషణ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారి చెప్పారు. మోస్తరు నుంచి తీవ్రంగా కరోనాకు గురైన రోగులపై వాటిని నిర్వహించారని తెలిపారు.
ఈ అధ్యయనంలో ప్లేసిబో గ్రూప్ కోవిడ్-19 నుంచి 15 రోజుల్లో కోలుకుంటే, వెక్లరీ గ్రూప్ 10 రోజుల్లోనే కోలుకున్నట్లు తేలిందని చెప్పారు.
డబ్ల్యుహెచ్ఓ అధ్యయనం సంగతేంటి
కరోనా చికిత్సకు ఉపయోగించే అవకాశం ఉన్న నాలుగు చికిత్సలపై డబ్ల్యుహెచ్ఓ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది.
ఆ మందుల్లో రెమెడెసివీర్ ఒకటి. దీనితోపాటూ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్వీన్, ఆటో ఇమ్యూన్ డ్రగ్ ఇంటెర్‌ఫెరాన్, హెచ్ఐవీ డ్రగ్ లోపినవిర్, రిటోనవిర్ కాంబినేషన్‌ను కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ పరీక్షించింది.
ప్రస్తుతం చౌకగా దొరికే స్టెరాయిడ్ డెక్సామెథాసోన్‌ను బ్రిటన్‌లో కోవిడ్ రోగుల కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
డబ్ల్యుహెచ్ఓ ఈ నాలుగు మందులను 30 దేశాల్లోని 500 ఆస్పత్రుల్లో మొత్తం 11,266 మంది రోగులపై పరీక్షించింది.
"ఇంకా సమీక్షించని ఈ ఫలితాల్లో, ఆస్పత్రిలో మరణాలపై, ఆస్పత్రిలో గడిపి సమయంపై అవి ప్రభావం చూపలేదని తేలిందని" డబ్ల్యుహెచ్ఓ చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- బ్లాక్ మార్కెట్లో కరోనావైరస్ మందులు.. ఐదు వేల సీసా 30 వేలకు అమ్మకం.. కట్టడి చేయాలని కేంద్రం ఆదేశం
- ‘జడ్జిలకు రాజ్యాంగం మినహాయింపు ఇవ్వలేదు.. వారిని ప్రశ్నించాల్సిందే’ - అభిప్రాయం
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ఇంగువ.. అనాదిగా భారతీయ వంటల్లో భాగం.. కానీ నేటివరకూ భారతదేశంలో పండలేదు...
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- బెంగళూరులో పది లక్షల బావులు ఎందుకు తవ్వుతున్నారు?
- విశాఖ తెన్నేటి పార్క్ తీరానికి కొట్టుకొచ్చిన నౌకను మళ్లీ సముద్రంలోకి ఎలా పంపిస్తారంటే...
- ‘మాకు #MeToo తెలియదు... ఇల్లు, రోడ్డు, పనిచేసే చోటు ఏదీ మాకు సురక్షితం కాదు’
- ‘సోషల్ మీడియాలో సవాళ్లకు టెంప్ట్ అవుతున్నారా.. జాగ్రత్త కపుల్స్’
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










