కరోనావైరస్: కోవిడ్, లాక్‌డౌన్‌ల నుంచి కోలుకుని దూసుకెళ్తున్న చైనా ఆర్థిక వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్ మహమ్మారి ప్రభావం నుంచి చైనా ఆర్థికవ్యవస్థ కోలుకోవడం కొనసాగుతోందని తాజాగా విడుదలైన అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
ప్రపంచ రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అయిన చైనాలో జూలై - సెప్టెంబర్ మధ్య, గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 4.9 శాతం వృద్ధి నమోదైంది.
అయితే, ఈ గణాంకాలు ఆర్థికవేత్తలు అంచనా వేసిన 5.2 శాతం కంటే తక్కువగా ఉన్నాయి.
తాజా జీడీపీ గణాంకాల ఆధారంగా చూస్తే కరోనా నుంచి కోలుకోవడంలో చైనా ఇప్పుడు ప్రప్రంచంలో మిగతా దేశాలన్నిటి కంటే ముందుంది.
2020 మొదట్లో మహమ్మారి వ్యాపించినపుడు చైనా ఆర్థికవ్యవస్థ వృద్ధి రేటు దాదాపుగా మైనస్ 5 శాతానికి పడిపోయి మాంద్యంలోకి దిగజారింది.
ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో దేశవ్యాప్తంగా పరిశ్రమలు, తయారీ ప్లాంట్లు మూతపడ్డంతో చైనా ఆర్థిక వ్యవస్థ 6.8 శాతం కుంచించుకుపోయింది.
1992లో త్రైమాసిక గణాంకాలను నమోదు చేయడం ప్రారంభించిన తర్వాత చైనా ఆర్థికవ్యవస్థ సంకోచించడం ఇదే మొదటిసారి.

ఫొటో సోర్స్, Reuters
వేగం పుంజుకుంటోంది
సోమవారం కీలకమైన ఆర్థికాభివృద్ధి గణాంకాలు విడుదలయ్యాయి. ఆ ఆర్థిక గణాంకాల కచ్చితత్వంపై నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నప్పటికీ, చైనా ఆర్థికవ్యవస్థ వేగంగా కోలుకుంటోందని ఇవి చెబుతున్నాయి.
త్రైమాసిక గణాంకాలను 2019లో ఇదే త్రైమాసికంతో పోల్చారు.
“హెడ్‌లైన్ అంకె అంత ఘోరంగా ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. చైనాలో ఉద్యోగ కల్పన చాలా స్థిరంగా ఉంది. అది మరింత వినియోగాన్ని సృష్టిస్తుంద”ని హాంకాంగ్‌లోని ఐఎన్‌జీ చీఫ్ ఎకానమిస్ట్ పాంగ్ అన్నారు.
గత ఏడాది సెప్టెంబరుతో పోలిస్తే ఎగుమతులు 9.9 శాతం పెరగడం, దిగుమతులు 13.2 శాతం పెరగడంతో ఈ ఏడాది సెప్టెంబరులో చైనా వాణిజ్య గణాంకాలు కూడా బాగా కోలుకున్నట్లే కనిపిస్తున్నాయి.
వేగం క్రమంగా నెమ్మదిస్తున్నప్పటికీ, గత రెండు దశాబ్దాలుగా చైనాలో సగటున దాదాపు 9 శాతం ఆర్థికవృద్ధి నమోదైంది.
కోవిడ్-19 మహమ్మారి వల్ల ఈ ఏడాది వృద్ధి లక్ష్యాలకు ఆటంకం కలిగితే, అమెరికాతో చైనా మధ్య ట్రేడ్ వార్ ఇటీవలి నెలల్లో మరింత పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
సహకరించిన ఎగుమతులు
కరోనాతో దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థను పునరుద్ధరించడానికి, ఉపాధికి మద్దతివ్వడానికి ఈ ఏడాది చైనా ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది.
ఈ ఏడాది ప్రారంభంలో విస్తృత ప్రయాణ ఆంక్షలతో ఆర్థిక కార్యకలాపాలను ఉక్కిరిబిక్కిరి కావడంతో సెంట్రల్ బ్యాంక్ తన విధానపరమైన మద్దతును కొనసాగించింది. కానీ ఇటీవల అది మరింత సడలింపులను నిలిపివేసింది.
పూర్తి ఏడాది ఆర్థిక లక్ష్యాలను అందుకునేందుకు కఠినంగా ప్రయత్నించాల్సిన అవసరం ఉంటుందని ఈ నెల మొదట్లో ప్రీమియర్ లి కెగియాంగ్ హెచ్చరించారు.
పుంజుకోవడం ప్రారంభించాక ఈ ఏడాది రెండో త్రైమాసికంలో చైనా ఆర్థిక వృద్ధి రేటు 3.2 శాతానికి పెరిగింది.
చైనా ఆర్థికవ్యవస్థ కోలుకునే మార్గంలో ఉందని, పుంజుకున్న ఎగుమతులు దానిని ముందుకు నడిపిస్తున్నాయని డై-ఇచి లైఫ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ ఎకానమిస్ట్ యోషికో షిమమైన్ చెప్పారు.
కరోనా వల్ల ఆర్థికవ్యవస్థ పూర్తిగా కదిలిపోయిందని మనం చెప్పలేం.

ఫొటో సోర్స్, Getty Images
బీబీసీ చైనా ప్రతినిధి రాబిన్ బ్రాంట్ విశ్లేషణ
కోవిడ్ వ్యాపించిన మిగతా దేశాల్లో వృద్ధి రేటు ఊహించలేని స్థాయిలో పడిపోతే, చైనా ఆర్థికవ్యవస్థ మాత్రం పుంజుకోవడం కొనసాగుతోంది.
వైరస్‌ను అదుపు చేసేందుకు కొన్ని ప్రభుత్వ ఉద్దీపనలతో కలిపి, చేపట్టిన కఠిన లాక్‌డౌన్ చర్యలు బాగా పనిచేశాయి.
4.9 శాతం ఉన్న వృద్ధి రేటు కొందరి అంచనాల కంటే కాస్త దిగువన ఉంది. పారిశ్రామిక ఉత్పత్తి, దేశంలో మెరుగైన నియంత్రిత కార్యకలాపాలు ఈ అంచనాలను అందుకునేలా చేశాయి.
చైనా కమ్యూనిస్టు పాలకులు సరఫరాను పెంచాలని కోరుకున్నారు, కానీ రీటైల్ అమ్మకాలు ఆశించిన దానికంటే నెమ్మదిగా ఉన్నాయి.
ఏదైమైనా, ముఖ్యమైన సేవా రంగాలన్నీ కోలుకోవడంతో ఆర్థిక వ్యవస్థ విస్తృతంగా కోలుకున్నట్లు కనిపిస్తోంది. దేశీయ పర్యాటకులు, ప్రయాణికులు తమ డబ్బు స్వదేశంలోనే ఖర్చు చేయడం వల్ల ఈ రికవరీ కొనసాగడానికి సహకరించింది. ఎందుకంటే అంతర్జాతీయ ఆంక్షలు ఉండడంతో చైనీయులు ఇప్పటికీ విదేశాలకు వెళ్లలేకపోతున్నారు.

ఫొటో సోర్స్, Reuters
ప్రయాణాల జోరు
ఈ ఏడాది అక్టోబర్‌లో ఇచ్చిన వార్షిక సెలవు ‘గోల్డెన్ వీక్’ వల్ల కూడా చైనా ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికి బలం చేకూరింది. ఈ సెలవుల్లో లక్షలాది చైనీయులు దేశమంతటా ప్రయాణించారు.
అంతర్జాతీయ ప్రయాణాలపై తీవ్ర ఆంక్షలు ఉండడంతో, విదేశాలకు వెళ్లడానికి బదులు లక్షలమంది చైనీయులు స్వదేశంలోనే తిరిగి, తమ డబ్బు ఖర్చు చేస్తున్నారు.
ఎనిమిది రోజుల ఈ సెలవులో చైనాలో మొత్తం 637 మిలియన్ల ట్రిప్స్ వేశారని, ఈ పర్యటనల వల్ల మొత్తం 466.6 బిలియన్ ఆర్ఎంబీ (69.6 బిలియన్ డాలర్ల) ఆదాయం వచ్చిందని చైనా సాంస్కృతిక, పర్యాటక శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
ఉష్ణమండల దీవి హైనన్ ప్రావిన్సులో డ్యూటీ ఫ్రీ అమ్మకాలు గత ఏడాది కంటే రెట్టింపు అయ్యాయి. స్థానిక కస్టమ్స్ గణాంకాల ప్రకారం ఇవి దాదాపు 150 శాతం పెరిగాయి.
ఇవి కూడా చదవండి:
- సరిహద్దుల్లో విధులకు వెళుతూ చైనా సైనికులు ఏడ్చేశారా?
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- పుండ్లలోని చీముతో ప్రమాదకరంగా ఆ వ్యాక్సీన్ ఎక్కించేవారు, అది లక్షల మంది ప్రాణాలు కాపాడింది
- భారతదేశంలో కోవిడ్ మరణాలు 1,00,000 దాటాయి... ఈ మరణాలకు కారణాలేమిటి?
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- కరోనావైరస్: వ్యాక్సీనా, హెర్డ్ ఇమ్యూనిటీనా... ఏది వస్తే మేలు?
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








