కరోనావైరస్: వాసన చూసే శక్తి కోల్పోవటం.. దగ్గుకన్నా స్పష్టమైన లక్షణం కావచ్చు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాచెల్ ష్రేయర్
- హోదా, బీబీసీ హెల్త్ రిపోర్టర్
కోవిడ్-19 లక్షణాలలో దగ్గు, జ్వరం కన్నా గానీ.. వాసన చూసే శక్తి కోల్పోవటమనేది మరింత స్పష్టమైన లక్షణంగా పరిగణించవచ్చునని తాజా పరిశోధన సూచిస్తోంది.
దీనికి సంబంధించి యూనివర్సిటీ కాలేజ్ లండన్ 590 మందిపై అధ్యయనం నిర్వహించింది. వీరందరూ ఈ ఏడాది ఆరంభంలో వాసన శక్తి కానీ, రుచి శక్తిని కానీ కాల్పోయామని చెప్పారు. వీరిలో 80 శాతం మందిలో కరోనావైరస్ యాంటీబాడీస్ ఉన్నట్లు గుర్తించారు.
ఈ యాంటీబాడీస్ ఉన్న వారిలో 40 శాతం మందిలో మరే ఇతర లక్షణాలూ లేవు.
వాసన, రుచి శక్తులు కోల్పోవటం.. కరోనావైరస్ లక్షణాలు కావచ్చు అనేందుకు ఏప్రిల్ నెల నుంచి ఆధారాలు వెలుగు చూడటం మొదలయింది. మే నెల మధ్యలో.. కరోనా లక్షణాల అధికారిక జాబితాలో ఈ రెండిటినీ చేర్చారు.
ఎవరైనా వాసన, రుచి కోల్పోవటం కానీ, అందులో మార్పులు కానీ కనిపిస్తే.. సెల్ఫ్-ఐసొలేట్ అయి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని ప్రస్తుత మార్గదర్శకాలు చెప్తున్నాయి.
అయితే.. ఇప్పటికీ కోవిడ్ ప్రధాన లక్షణాలుగా చాలా మంది దగ్గు, జ్వరాలనే పరిగణిస్తున్నారని యూసీఎల్ అధ్యయన సారధి ప్రొఫెసర్ రాచెల్ బాటర్హామ్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వాసన, రుచి కోల్పోయిన వారిపై ఆమె నిర్వహించిన అధ్యయనంలో.. ప్రతి ఐదుగురిలో నలుగురికి అంతకుముందు కోవిడ్ సోకిందని యాంటీబాడీస్ పరీక్షల్లో వెల్లడైంది.
అయితే.. అయితే.. ఈ పరిశోధనలో కేవలం స్వల్ప లక్షణాలు ఉన్న వారిని మాత్రమే, అందులోనూ ప్రధానంగా వాసన, రుచి కోల్పోయిన వారిని మాత్రమే పరిశీలించారు. కాబట్టి ఈ అధ్యయనంలో పరిశీలించిన వారందరూ కోవిడ్ రోగులకు ప్రాతినిధ్యం వహించరు.
కానీ.. ఈ అధ్యయనం చాలా ముఖ్యమైన విషయాన్ని వెల్లడించింది. ఎవరికైనా ఇతరత్రా లక్షణాలు లేకపోయినప్పటికీ.. వాసన, రుచిలో తేడాలు కనిపించినట్లయితే.. పెర్‌ఫ్యూమ్, బ్లీచ్, టూత్‌పేస్ట్, కాఫీ వంటి రోజు వారీ ఉపయోగించే పదార్థాల వాసన తెలియకపోతుంటే.. వెంటనే ఐసొలేట్ అవటం అవసరమని ఈ పరిశోధన చెప్తున్నట్లు ప్రొఫెసర్ బాటర్హామ్ పేర్కొన్నారు.
కరోనా రోగులందరూ వాసన కోల్పోయే అవకాశం లేకపోయినా.. ఎవరైనా వాసన, రుచి శక్తుల క్షీణించినట్లయితే వారికి కరోనా సోకివుండే అవకాశం చాలా ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం సూచిస్తోంది.
జలుబు లక్షణాలతో ముక్కు పట్టేయకపోయినా.. వాసన చూడలేకపోతే దానిని కరోనాగా భావించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె వివరించారు.
కరోనావైరస్ ముక్కు, గొంతు, నాలుక వెనుక భాగాల్లోని కణజాలం మీద దాడి చేస్తుందని.. అందువల్ల వాసన కోల్పోవటం జరుగుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

జలుబు వల్ల ముక్కులు బిగుసుకుపోయి, శ్వాస నాళాలు మూసుకుపోయినప్పుడు కూడా మన వాసన, రుచి సామర్థ్యాల్లో తేడా వస్తుంది. అయితే దీనికి కోవిడ్ వల్ల సంభవించే వాసన శక్తి కోల్పోవటానికి తేడా ఉంది.
కరోనావైరస్ సోకిన వారిలో దాదాపు 60 శాతం మంది వాసన కానీ, రుచి కానీ కోల్పోవటం జరిగిందని కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధకులు ఇంతకుముందు అంచనా వేశారు.
ఇది తేలికైన లక్షణమని, దీనివల్ల ఆస్పత్రి పాలయ్యే అవకాశాలు లేవని భావిస్తున్నప్పటికీ.. వాసన తెలియకపోవటం వల్ల పొగ, గ్యాస్ లీక్, పాడైన ఆహారం వంటి వాటిని గుర్తించలేక ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుందని ప్రొఫెసర్ బాటర్హామ్ చెప్పారు.
అంతేకాదు.. ఈ సమస్య కొందరిలో చాలా కాలం కొనసాగుతున్నట్లు కూడా చెప్తున్నారు. కొంతమంది తమకు ఎప్పుడూ ''చెత్త'' వాసన వస్తోందని, లోహపు రుచి వస్తోందని చెప్తే.. ఇంకొందరు వైరస్ నుంచి కోలుకున్నా నెలల తరబడి రుచి లేకుండా పోయిందని వెల్లడించారు.
ఇతర లక్షణాలేవీ లేకుండా కేవలం వాసన కోల్పోవటం మాత్రమే లక్షణంగా ఉన్నవారు.. తాము మామూలుగా ఉన్నామనే భావనతో రోజువారీ కార్యకలాపాలు కొనసాగించటం వల్ల.. వారి నుంచి వైరస్ ఇతరులకు వ్యాపించే ప్రమాదం కూడా ఉంటుందని ప్రొఫెసర్ బాటర్హామ్ పేర్కొన్నారు.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?
- చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- సరకులు కొనేటప్పుడు ఆ ప్యాకెట్లను పట్టుకుంటే కరోనావైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకినవారు మీ వీధిలో ఉంటే ఏం చేయాలి... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








