హర్‌సిమ్రత్ కౌర్ బాదల్: 'రైతు వ్యతిరేక' బిల్లులకు నిరసనగా కేంద్ర మంత్రి రాజీనామా NewsReel

ఫొటో సోర్స్, NARINDER NANU
వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం తెస్తున్న కొత్త బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌లోని ప్రతిపక్ష పార్టీ శిరోమణి అకాలీ దళ్ పార్టీ నాయకురాలు హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు.
''రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకువస్తున్న ఆర్డినెన్స్‌లు, బిల్లులకు వ్యతిరేకత తెలుపుతూ నేను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా. రైతు బిడ్డగా, రైతు సోదరిగా వారికి అండగా నిలబడుతున్నందుకు గర్వంగా ఉంది'' అని ఆమె ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అంతకుముందుకు పీటీఐ వార్తాసంస్థ కూడా హర్ సిమ్రత్ కౌర్ రాజీనామా చేయొచ్చని సుఖ్‌బీర్ సింగ్ పేర్కొనట్లు తెలిపింది.
కేంద్రంలో ఎన్‌డీయే ప్రభుత్వానికి శిరోమణి అకాలీ దళ్ మద్దతు కొనసాగుతుందా? ఉపసంహరించుకుంటారా? అన్న విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం తెస్తున్న బిల్లులపై శిరోమణి అకాలీ దళ్ వ్యతిరేకతతో ఉంది. వీటికి వ్యతిరేకంగా ఓట్లు వేయాలని పార్టీ ఎంపీలకు సూచించింది.
వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం మూడు బిల్లులను సెప్టెంబర్ 14న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అవి రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయకల్పన) బిల్లు-2020... ధరల హామీ, పంట సేవల అంగీకార బిల్లు-2020, నిత్యవసర ఉత్పత్తుల (సవరణ) బిల్లు-2020. లాక్‌డౌన్ సమయంలో తెచ్చిన ఆర్డినెన్స్‌ల ఆదేశాలను కొనసాగించేలా ఈ బిల్లులను తెచ్చారు.
ఈ బిల్లులతో వచ్చే సంస్కరణలు రైతులకు లాభదాయకంగా ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది.విపక్షాలు మాత్రం రైతులకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రం తీసుకురానున్న వ్యవసాయ సంస్కరణల బిల్లులు రైతులకు, వ్యవసాయ కార్మికులకు అశనిపాతంగా పరిణమిస్తాయని, ఈ 'నల్ల' ఆర్డినెన్సులు వ్యవసాయ రంగాన్ని దెబ్బ తీస్తాయని ట్వీట్ చేశారు
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ బిల్లులపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని, రైతులను తప్పుదారి పట్టిస్తోందని హర్యాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
మరోవైపు, లోక్‌సభ కాసేపటి క్రితం వ్యవసాయ రంగానికి సంబంధించిన రెండు బిల్లులను ఆమోదించింది. ఏఎన్ఐ వార్తా సంస్థ ఈ తాజా సమాచారాన్ని ట్వీట్ చేసింది.
'ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు-2020, ఫార్మర్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ బిల్లు-2020లకు లోక్‌సభ ఆమోదం లభించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
యుగాండా జైలు నుంచి 200 మంది ఖైదీలు పరార్

ఫొటో సోర్స్, Google
యుగాండా దేశంలోని ఓ జైలు నుంచి 200 మందికి పైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారని అధికారులు తెలిపారు. పోలీసులు వారి ఆచూకీ కోసం గాలింపులు ప్రారంభించారు.
మొరాటోలోని జైలు నుంచి పారిపోయిన ఖైదీలు ఒక సైనికుడిని హతమార్చారు. ఆ తరువాత అక్కడి కొండ ప్రాంతాల్లోకి పరుగు తీశారు.
దాదాపు 15 తుపాకులు, మందు గుండు సామగ్రి సహా పరారైన ఆ ఖైదీల కోసం పోలీసులు, జైలు అధికారులు వెతుకులాట ప్రారంభించారు.

ఫొటో సోర్స్, Uganda Peoples' Defence Forces
అయితే, ఇద్దరు ఖైదీలు పోలీసు కాల్పుల్లో చనిపోయారని, ఇద్దరిని పట్టుకోగలిగామని యుగాండా సైన్యం అధికార ప్రతినిధి ప్రకటించారు.
ఈ కాల్పుల ఘటనతో మొరాటో పట్టణంలో జన జీవితం దాదాపు స్తంభించి పోయిందని ఏపీ వార్తా సంస్థ తెలిపింది. ఖైదీలు తాము ఎవరి కంటా పడకుండా ఉండేందుకు తమ పసుపు రంగు యూనిఫారాలు విడిచి నగ్నంగా పారిపోయినట్లు వార్తలు వచ్చాయి.
పామును ఫేస్ మాస్క్‌గా చుట్టుకొని బస్సులో ప్రయాణం

ఫొటో సోర్స్, PA Media
కరోనావైరస్ వ్యాప్తి నడుమ పామును ఫేస్ మాస్క్‌గా వేసుకొని ఓ వ్యక్తిని బస్సులో ప్రయాణించారు.
సోమవారం యూకేలోని మాంచెస్టర్ నుంచి స్వింటన్‌కు పామును మెడ చుట్టూ చుట్టుకొని ఆయన వచ్చారు.
''అదేదొ మాస్క్ అనుకొని మొదట భ్రమపడ్డాను. అయితే, భుజాల చుట్టూ తిరుగుతూ బుసలు కొట్టడంతో పామని తెలిసింది''అని తోటి ప్రయాణికుడు ఒకరు వివరించారు.
ఆ ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఓ మహిళ.. చాలా సరదగా అనిపించిందని వివరించారు. చుట్టుపక్కల ఎవరినీ పాము ఇబ్బంది పెట్టలేదని పేర్కొన్నారు. ''అందరూ షాక్‌లో చూస్తూ ఉండిపోయారు''.

ఫొటో సోర్స్, PA Media
ఇక్కడి ప్రభుత్వ రవాణా సదుపాయాలు ఉపయోగించేటప్పుడు ఫేస్ మాస్క్ తప్పనిసరి. కేవలం 11ఏళ్లలోపు పిల్లలు, ఇతర అనారోగ్యంతో ఉండేవారికి మాత్రమే ఇక్కడ మినహాయింపు ఉంటుంది.
''సర్జికల్ మాస్క్‌లు కాకుండా.. ప్రయాణికులు సొంత మాస్క్‌లు పెట్టుకోవాలని లేదా స్కార్ఫ్‌లు కట్టుకోవాలని ప్రభుత్వం సూచించింది''అని గ్రేటర్ మాంచెస్టర్ ట్రాన్స్‌పోర్ట్ అధికార ప్రతినిధి వివరించారు.
''పామును మాస్క్‌గా పెట్టుకోకూడదు. ఇది పాము చర్మంతో చేసిన మాస్క్ అని కొందరు చెప్పొచ్చు. అయితే పాము ఇంకా బతికే ఉందిగా''.
ఇవి కూడా చదవండి:
- చైనాతో సరిహద్దు సమగ్రతను కాపాడడంలో రాజీ పడే ప్రసక్తే లేదన్న రాజ్‌నాథ్ సింగ్
- హైదరాబాద్‌ను వరదల నుంచి కాపాడిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య
- స్కూలు ఫీజులపై నటుడు శివబాలాజీ పోరాటం.. అసలు ఏం జరిగింది
- క్యాన్సర్లు, గుండె పోటును దూరం చేసే ఇది వంటగదిలోనే ఉంటుంది కానీ ఎక్కువ మంది తినడం లేదు
- రెండో భార్యకు ఆస్తి రాసిచ్చినా చెల్లదా.. కరోనాతో మరణించిన ఎస్ఐ కేసులో కోర్టు ఏం చెప్పింది
- పోగొట్టుకున్న సెల్ ఫోన్లో 'దొరికిన' కోతుల సెల్ఫీలు
- తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం: మీ భూమి మీదేనని అధికారికంగా చెప్పేది ఎవరు?
- కోవిడ్-19 నుంచి కోలుకున్నా అనారోగ్యం ఎందుకు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- శుక్ర గ్రహంపై జీవం ఉందా.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








