కేరళ: కొండ చరియలు విరిగిపడిన ప్రమాదంలో 21కి పెరిగిన మృతులు

ఫొటో సోర్స్, Georgey Mathew
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
కేరళలోని మున్నార్ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 21కి పెరిగింది.
గురువారం ఈ ప్రమాదం తరువాత తొలుత 18 మృతదేహాలను గుర్తించగా శుక్రవారం ఉదయం మరో మూడు మృతదేహాలను సహాయక బృందాలు గుర్తించాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
బురద ప్రవాహంలో సుమారు 60 మంది కూరుకుపోయారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు వెతుకుతునాయి.
కాగా బురదలో కూరుకుపోయిన 15 మందిని సహాయక బృందాలు రక్షించాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అంతకుముందు, గురువారం కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఈ ఘటనపై విలేఖరులతో మాట్లాడుతూ, "ఈ దుర్ఘటనలో 15 మంది చనిపోయారు. మరో 15 మందిని సహాయక బృందాలు కాపాడాయి" అని చెప్పారు. ప్రస్తుతం మృతుల సంఖ్య 21కి పెరిగింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు పొంగి పొరలుతూ, వంతెనలు తెగిపోవడంతో సహాయక చర్యలకు కూడా ఆటంకాలు ఏర్పడ్డాయి. దాంతో, కేరళ ప్రభుత్వం ఇక్కడి ప్రజలను ఆదుకోవడానికి భారత వైమానిక దళం సహాయాన్ని కోరింది.

ఫొటో సోర్స్, Georgey Mathew
మున్నార్‌లోని రాజమాలా గ్రామంలో ఈ విషాదం సంభవించింది. బురదలో, రాళ్లలో ఇంకా చాలా మంది కూరుకుపోయారని కేరళ రెవెన్యూ మంత్రి ఇ. చంద్రశేఖరన్ చెప్పారు.
"ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న కొంతమంది అటవీశాఖ అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. కానీ, రోడ్డు లింకు తెగిపోవడంతో వారు ముందుకు వెళ్లలేకపోయారు" అని కేరళ పోలీసు శాఖ పబ్లిక్ రిలేషన్స్ డిప్యూటీ డైరెక్టర్ వీపీ ప్రమోద్ కుమార్ బీబీసీ హిందీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Georgey Mathew
ప్రధాని మోదీ సంతాపం
రాజమాలా ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాన సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహకారం అందిస్తామని మోదీ ప్రకటించారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ప్రభుత్వ యంత్రాంగం, ఎన్‌డీఆర్ఎఫ్ సహాయ చర్యలు చేపడుతున్నాయని, బాధితులకు అవసరమైన చేయూత అందిస్తున్నాయని మోదీ తెలిపారు.

ఫొటో సోర్స్, Georgey Mathew
ధ్వంసమైన ఆదివాసీ పల్లెలు
రాజమాలా ప్రాంతంలో ఎక్కువగా ఆదివాసీల పల్లెలు ఉంటాయి. శుక్రవారం ఉదయం కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఎక్కువగా ఇక్కడి ప్రజలే చనిపోయారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
పశ్చిమ కనుమల వెంబడి కురిసిన భారీ వర్షాలతో కేరళ, కర్నాటక రాష్ట్రాలలో చాలా చోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల నైరుతి రుతుపవనాల ఉద్ధృతి గత కొన్ని రోజులుగా పెరిగి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఇవి కూడా చదవండి.
- కరోనా వైరస్ రోగులకు సేవలు అందిస్తున్న గర్భిణీ - ప్రభుత్వ మీడియాపై తీవ్ర విమర్శలు
- కరోనావైరస్: వన్య ప్రాణులను తినడాన్ని నిషేధించిన చైనా ప్రభుత్వం
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు
- కరోనావైరస్ అనుమానిత రోగులు ఆసుపత్రుల నుంచి ఎందుకు పారిపోతున్నారు?
- ఆంధ్రప్రదేశ్: ఎన్నికల కోడ్ వచ్చాక సర్వాధికారాలు ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉంటాయా?
- డెబిట్-క్రెడిట్ కార్డులతో ఆన్లైన్ లావాదేవీలకు కొత్త నిబంధనలు... ఇవాళ్టి నుంచే అమలు
- తెలంగాణ శాసనసభ: సీఏఏ వ్యతిరేక తీర్మానానికి ఆమోదం
- కరోనావైరస్- పారాసిటమాల్: ఏపీ సీఎం వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)