‘ఇస్లాంకు వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేస్తే దాడులు చేస్తున్నారు, చంపేస్తామని బెదిరిస్తున్నారు’

కంప్యూటర్లతో యువతీ, యువకుడు

ఇస్లాం మత విశ్వాసాలతో విభేదించినందుకు ఓ ఫేస్‌బుక్ గ్రూప్ నడుపుతున్నవారిని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. వేధింపులను ఎదుర్కొంటున్నవారితో మాట్లాడి జర్నలిస్టు లేలా మహమూద్ అందిస్తున్న కథనమిది.

"నువ్వు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటా. నీ మొండెం నుంచి తల వేరు చేస్తా. నిన్నుచంపేస్తా" కెనడాలో ఉంటున్న సోమాలియా నాస్తికుడు అయాన్‌లీకి వస్తున్న బెదిరింపు ఫోన్ కాల్స్‌లో ఇది కూడా ఒకటి.

"అది సాధారణం అయిపోయింది"అని తన ఇన్‌బాక్స్‌కు కుప్పలు తెప్పలుగా వచ్చే సందేశాలు ఎంత క్రూరంగా ఉంటాయో అయాన్‌లీ వివరించారు. ట్రూ సోమాలీ ఫ్రీడమ్ ఫేస్‌బుక్ పేజ్ (టీఎస్‌ఎఫ్‌పీ)ని ఆయనే మొదలుపెట్టారు.

80,000కు పైచిలుకు సభ్యులున్న ఈ గ్రూప్‌ను నడిపిస్తోంది నాస్తికవాదులు లేదా మాజీ ముస్లింలు. వారిని వారు అలాగే ప్రకటించుకుంటున్నారు.

మతపరమైన చర్చలకు సురక్షితమైన వేదికగా ఈ గ్రూప్ మొదలైంది. అయితే నేడు సోమాలియాలో అగ్రజాతుల ఆధిప్యతంలో అణగారిపోతున్నట్లు భావిస్తున్న వారికి అన్ని రకాల స్వేచ్ఛను ఇది ప్రోత్సహిస్తోంది.

ల్యాప్‌టాప్‌తో యువకుడు

ఈ ఉద్యమం ఎలా మొదలైందో అయాన్‌లీ వివరించారు. అయితే ఆయన తన పూర్తిపేరు చెప్పేందుకు నిరాకరించారు.

పశ్చిమాసియాలో అమెరికా అదనపు బలగాల మోహరింపు.. ఇవి ఇరాన్‌తో యుద్ధానికి సన్నాహాలేనా..

కరోనావైరస్: సౌదీ అరేబియా ఎప్పుడూ లేనంత కష్టాల్లో కూరుకుపోయిందా?

గ్రూప్ నుంచి వెళ్లగొట్టారు

2016లో ఓ వాక్ స్వాతంత్రాన్ని ప్రోత్సహించేది, చర్చలను నిర్వహించేదిగా చెప్పుకొనే ఫేస్‌బుక్ పేజీతో అయాన్‌లీకి చేదు అనుభవం ఎదురైంది.

"మతం గురించి చర్చ మొదలు పెడితే.. అందరూ అడ్డుకునేవారు. నేనేదో హత్య చేసినట్లు వారు ప్రవర్తించేవారు"

తర్వాత కొన్ని రోజులకే ఆయన్ను గ్రూప్ నుంచి తొలగించారు. సోమాలీ సోషల్ మీడియా వేదికల్లో ఏదైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తే ఇలా జరగడం సర్వసాధారణం.

‘అందరూ మాట్లాడుకునేందుకు వీలుగా’

ఆ చేదు అనుభవం అనంతరం కొత్త నిబంధనలతో ఓ గ్రూప్ ప్రారంభించాల్సిన అవసరం ఉందని అయాన్‌లీ భావించారు.

"తమకు నచ్చిన అంశాలపై ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడే వేదికగా టీఎస్‌ఎఫ్‌పీని మార్చాలని అనుకున్నాను. "

సోమాలియాలో దశాబ్దాల తరబడి కొనసాగిన పౌరయుద్ధం అనంతరం మత సంబంధింత అంశాలపై ఆంక్షలు పెరిగాయని అయాన్‌లీ భావిస్తున్నారు. ఇదే ఆయన్ను చర్చలకు ఆహ్వానం పలికే గ్రూప్ వైపు నడిపించింది.

"ఇస్లాంను విమర్శించలేవు. దానికి వ్యతిరేకంగా ఏమీ చెప్పలేవు."

"అయితే నేటి యువతలో ఆలోచనలు మారుతున్నాయి. చర్చ, విమర్శలపై వారు కొంచెం సహనంతో ఉన్నారు. "

"అయితే సోమాలియలో పుట్టిపెరిగి.. అంతర్యుద్ధం తర్వాత పశ్చిమ దేశాలకు వచ్చినవారిలో చాలా మందిలో కొన్ని విరుద్ధ భావనలున్నాయి. ఎవరైనా ఇస్లాంను విమర్శిస్తే.. వారిని చంపేయాలని వారు భావిస్తున్నారు. "

అందుకే ఆయనకు చంపేస్తామని బెదిరింపులు వస్తున్నట్లు కనిపిస్తోంది.

"ఇస్లాంను విమర్శించొచ్చు. దాని గురించి బహిరంగంగా మాట్లాడుకోవచ్చు. దాన్ని ముట్టుకోకూడదు అనే నిబంధనేమీ లేదు.. అనే విషయాన్ని మా ఫేస్‌బుక్ గ్రూప్ ద్వారా అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాం."

జైలు నుంచి బయటకు వెళ్తున్న వ్యక్తి

సోమాలియాలో దైవదూషణ చేస్తే.. జైలు శిక్ష తప్పదు. దీన్ని టీఎస్‌ఎఫ్‌పీ వ్యతిరేకిస్తోంది.

2019లో కరవు నుంచి బయట పడేందుకు దేవుణ్ని ప్రార్థించాలనే వాదనను ఫేస్‌బుక్ వేదికగా విభేదించిన యూనివర్సిటీ ప్రొఫెసర్ మహమూద్ జామా అహ్మద్-హమ్దీని అరెస్టుచేశారు. ఆయనకు మద్దతుగా టీఎస్‌ఎఫ్‌పీ ప్రచారం చేపట్టింది. ఆయన కోసం ప్రజల నుంచి చందాలనూ సేకరించింది.

పది నెలల జైలు శిక్ష అనంతరం అధ్యక్షుడి క్షమాభిక్షపై హమ్దీని వదిలిపెట్టారు. అయితే తరచూ ఆయనకు దాడుల హెచ్చరికలు వస్తుంటాయి. ఓ ప్రముఖ ఇమామ్ అయితే.. హమ్దీని ఉరితీయాలని పిలుపునిచ్చారు.

సోమాలియాలో మత పెద్దలు చెప్పినట్లు ప్రభుత్వం ఎలా నడుచుకుంటుందో చెప్పేందుకు ఈ ఘటన ఓ ఉదాహరణ.

‘బ‌య‌ట‌కు రావాలంటే భ‌య‌మేస్తుంది’

ఈ గ్రూప్‌లో ఎక్కువ‌గా స్పందిస్తున్న‌వారిలో.. సోమాలియాలో ముప్పు ఎదుర్కొంటున్న క్రైస్త‌వులు, నాస్తిక‌వాదులు, ఎల్‌జీబీటీ వ్య‌క్తులు ఉన్నారు.

బ‌య‌ట‌కు రావాలంటే వీరు భ‌య‌ప‌డుతుంటారు. అంతేకాదు వీరిపై దాడులు జ‌రిగే, శిక్ష‌లు విధించే ముప్పు ఎక్కువ‌.

వీరి కోసం టీఎస్ఎఫ్‌పీ డ‌బ్బులు సేక‌రిస్తోంది. వీరికి విమాన టికెట్లు కొనుగోలు చేయ‌డం, జీవించ‌డానికి అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయ‌డం వంటి ప‌నులూ చేస్తోంది.

ట్యాక్సీలోని యువతిపై దాడి

కెన్యాలో ఉంటున్న‌ సోమాలియాకు చెందిన ఓ క్రైస్త‌వ మ‌హిళ‌.. టీఎస్ఎఫ్‌పీలో స్పందించే స‌మ‌యంలో త‌‌న గుర్తింపు వెల్ల‌డించే వివ‌రాలు పొర‌పాటున‌ బ‌య‌ట‌పెట్టేశారు.

దీంతో వెంట‌నే ఆమెను అంద‌రూ గుర్తుపట్టేశారు. అంతేకాదు కెన్యాలో ఆమె వెళ్తున్న ట్యాక్సీలో నుంచి ఆమెను బ‌ల‌వంతంగా బ‌య‌ట‌కు లాగుతున్న వీడియోలు సోమాలియా ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ అయ్యాయి. ఫేస్‌బుక్ పేజీలో మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌ను విమ‌ర్శించినందుకు చంపేస్తామ‌నీ ఆమెను బెదిరించారు.

ఆమె వేరే దేశానికి వెళ్లిపోయేందుకు టీఎస్ఎఫ్‌పీ సాయం చేసింది. ఇప్పుడు ఆమె క్రైస్త‌వుల మ‌ధ్య సుర‌క్షితంగా ఉన్నారు.

‘జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాకే సాయం’

సుర‌క్షిత ప్రాంతాల‌కు వ‌స్తున్న‌వారిలో ముస్లిమేత‌రులు, మాజీ ముస్లింలు, ఎల్‌జీబీటీ వ్య‌క్తులేకాదు ఇత‌రులూ ఉంటున్నారు.

అత్యంత క‌ఠిన‌మైన ఇస్లామిక్ విధానాల‌ను అనుస‌రించే వహ‌బిజం ను పాటించే కొంద‌రు త‌న‌పై దాడి చేశారంటూ ఓ సోమాలీ యువ‌కుడు టీఎస్ఎఫ్‌పీని ఆశ్ర‌యించారు.

ఫేస్‌బుక్ పేజీలో మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌ను విమర్శించిన అనంత‌రం ఆయనపై దాడి జ‌రిగింది. సుడాన్‌లో ఆయ‌న సుర‌క్షిత ప్రాంతానికి వెళ్లేలా టీఎస్ఎఫ్‌పీ సాయం చేసింది.

గ్రూప్‌ను నిర్వ‌హించేవారికి సాయం కోసం విప‌రీతంగా అభ్య‌ర్థ‌న‌లు వ‌స్తున్నాయంటే.. వారిలో అత్య‌వ‌స‌ర సాయం ఎంత మందికి అవ‌స‌ర‌మో జాగ్ర‌త్త‌గా గుర్తించాల్సి ఉంటుంది.

మహిళ

"మేం ద‌ర్యాప్తు చేప‌డ‌తాం. ప‌రిశోధ‌న చేస్తాం." అని నార్వేకు చెందిన మ‌హిళా హ‌క్కుల న్యాయ‌వాది, గ్రూప్‌లో క్రియాశీలం‌గా స్పందించే క‌హా ధిన్ చెప్పారు.

"వారి కుటుంబ స‌భ్యులు, తెగ‌కు సంబంధించిన వివ‌రాలు అడుగుతాం. వెంట‌నే వారి ఫేస్‌బుక్ ప్రొఫైల్ చూస్తాం. ఆ గ్రూప్‌లో వారు ఎవ‌రికైనా తెలుసేమోన‌ని అడుగుతాం. వారి తెగ గురించి ఎవ‌రికీ తెలియ‌క‌పోతే... అనుమానిస్తాం."

టీఎస్ఎఫ్‌పీతో క‌హా క‌లిసి ప‌నిచేస్తున్నారు. అయితే ఆమెకు వేరే ఫేస్‌బుక్‌, యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. వాటిపై ఆమె సోమాలీ ప్ర‌జ‌ల‌ను పీడిస్తున్న అంశాల‌పై మాట్లాడుతుంటారు.

కరోనావైరస్ సాకుతో కార్మికుల హక్కులపై వేటు.. మూడేళ్ల వరకూ కొన్ని చట్టాలు రద్దుపోర్న్ సైట్లకు క్రెడిట్ కార్డులతో చెల్లింపులు ఆపండి: స్వచ్ఛంద సంస్థల విజ్ఞప్తి

సోమాలీ మ‌హిళల సాధికార‌తే ఆమె ప్ర‌ధాన ల‌క్ష్యం. అయాన్‌లీలానే ఆమె కూడా బ‌హిరంగంగా మాట్లాడుతుండ‌టంతో.. ఇత‌రులకు ల‌క్ష్యంగా మారుతున్నారు.

"క‌త్తుల‌తో పొడిచి చంపేస్తామ‌ని వారు బెదిరించారు. ముస్లింల చేతుల్లోనే చ‌స్తాన‌నీ వారు వ్యాఖ్యానించారు."

అయితే ఆ బెదింపులేవీ ఆమెలో నిబ‌ద్ధ‌త‌ను త‌గ్గించ‌న‌ట్లు క‌నిపిస్తోంది. "నేను వారికి భ‌య‌ప‌డ‌ను. భ‌య‌పెట్టి నా నోరు మూయించాల‌ని వారు చూస్తున్నారు."

నార్వేలో ఇద్ద‌రు అరెస్టు

అయితే ఆమె ఉంటున్నచోట ఇలాంటి బెదిరింపుల‌కు పాల్ప‌డితే నిందితులు పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

సోమాలియాలో హ‌త్య‌లు, దాడుల‌పై అరుదుగా ద‌ర్యాప్తులు జ‌రుపుతుంటారు. నార్వేలో అలా కాదు.

"సొంత అకౌంట్ల నుంచే న‌న్ను బెదిరించిన ఇద్ద‌రిని పోలీసులు అరెస్టు చేశారు" అని ఆమె వివ‌రించారు.

"ఈ ఫేస్‌బుక్ గ్రూప్‌లొ ఉంటున్న చాలా మంది సోమాలీలు త‌మ ముఖాలు చూపించ‌రు. నాస్తికుల‌ని చెప్ప‌డం వ‌ల్ల త‌మపై దాడులు జ‌రుగుతాయ‌ని వారు భ‌య‌ప‌డ‌తారు" అని అయాన్‌లీ వివ‌రించారు.‌

అయాన్‌లీ, క‌హా.. ఇద్ద‌రూ ఇస్లాం నుంచి దూరం జ‌రిగారు కానీ.. సోమాలీ గుర్తింపు నుంచి కాదు. అయితే ఇస్లాం, సోమాలీ గుర్తింపు రెండూ పెన‌వేసుకొని ఉంటాయి.

"నేను ఇస్లాంను వ‌దిలేశాక.. నా సోమాలీ బంధాలు మ‌రింత బ‌ల‌ప‌డ్డాయ‌ని అనుకుంటున్నా" అని క‌హా చెప్పారు.

అయితే సోమాలీ ముస్లింల‌ను నాస్తిక‌వాదుల్ని చేయ‌డం త‌మ ల‌క్ష్యంకాద‌ని అయాన్‌లీ నొక్కి చెప్పారు. అన్ని అంశాలు హాయిగా చ‌ర్చించుకునే వేదికను అందుబాటులో ఉంచాల‌ని తను భావిస్తున్న‌ట్లు చెప్పారు. ఇది సోమాలీల‌కు చాలా అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

"ఇవి చిన్న చిన్న అడుగులే. అయితే వీటితో కొన్ని మ‌న‌సుల‌ను గెలుచుకుంటున్నాం. త‌మ‌కు న‌చ్చిన విశ్వాసాల‌ను న‌మ్మే స్వేచ్ఛ ప్ర‌జ‌ల‌కు ఎప్పుడూ ఉండాలి"అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)