నైజీరియా: అది ఇస్లామిక్ పాఠశాల కాదు... చిత్ర హింసల కారాగారం

ఫొటో సోర్స్, Nigerian Police
నైజీరియాలోని కడునా నగరంలోని ఒక భవనంలో బందీలుగా ఉన్న దాదాపు 500 మంది పురుషులు, బాలురకు పోలీసులు విముక్తి కల్పించారు.
బందీలుగా ఉన్న వారిని లైంగిక వేధింపులకు గురిచేసి హింసించారని వారు చెప్పారు.
ఇస్లామిక్ పాఠశాలగా చెబుతున్న ఒక భవనంలో అయిదేళ్ల చిన్నారులను సైతం గొలుసులతో బంధించారని అధికారులు వివరించారు..
గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారం ఆధారంగా భవనంపై దాడి చేసినట్లు కడునా పోలీసు అధికారి అలీ జంగా బీబీసీకి తెలిపారు.
ఆయన ఈ భవనాన్ని చిత్రహింసల గృహంగా, బానిసత్వ ప్రదేశంగా అభివర్ణించాడు.

ఫొటో సోర్స్, Nigerian Police
ఈ ఘటనలో ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నారు.
బందీలలో కొందరు తీవ్ర గాయాలతో ఉన్నారని, మరికొందరి ఆకలితో అలమటించిపోతున్నారని పోలీసు అధికారి తెలిపారు.
భవనంలోని వారు తమను లైంగిక వేధింపులకు గురి చేశారని, తిండిపెట్టకుండా శారీరంగా హింసించారని బాధితులు చెప్పారు.
''ఇక్కడ నేను మూడు నెలల నుంచి కాళ్లకు గొలుసులతో గడిపాను'' అని బెల్ హమ్జా అనే బందీ నైజీరియా మీడియాకు చెప్పారు.

ఫొటో సోర్స్, Nigerian Police
ఈ భవనం ఒక మదర్సా అనుకొని తమ బంధువులు ఇక్కడికి తీసుకొచ్చారని కొందరు పిల్లలు పోలీసులకు చెప్పారు.
విముక్తి పొందినవారిలో ఎక్కువమంది ఉత్తర నైజీరియాకు చెందినవారని పోలీసులు భావిస్తున్నారు.
ఈ ప్రాంతంలో మదర్సాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో కొన్నింటిపై ఆరోపణలు వస్తున్నాయి.
విముక్తి పొందిన పిల్లలను ఒక శిబిరంలో ఉంచినట్లు స్థానిక అధికారి హఫ్సత్ ముహమ్మద్ బాబా బీబీసీకి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- నరేంద్ర మోదీకి గేట్స్ ఫౌండేషన్ ‘గ్లోబల్ గోల్‌కీపర్’ అవార్డు.. దీనిపై వివాదం ఏమిటి? ఎందుకు?
- కళ్లు కనిపించవు, చెవులు వినిపించవు... అయినా 130కి పైగా దేశాలు చుట్టేశారు ఈయన
- ఐక్యరాజ్యసమితి అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది?
- అమెరికాలో నెహ్రూ, ఇందిరా గాంధీలను చూసేందుకు అంతమంది వచ్చారా? ఈ ఫొటో వెనుకున్న వాస్తవం ఏంటి?
- రూసీ కరంజియా: భారత మీడియాకు కొత్త నడక నేర్పిన జర్నలిస్ట్
- ఐన్‌స్టీన్ దృష్టిలో అద్భుతమైన గణిత మేధావి ఎవరో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








