అమెరికాలో నెహ్రూ, ఇందిరా గాంధీలను చూసేందుకు అంతమంది వచ్చారా? ఈ ఫొటో వెనుకున్న వాస్తవం ఏంటి? :Fact Check

ఫొటో సోర్స్, SM Viral Post
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ టీమ్
- హోదా, బీబీసీ
జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలు అమెరికాలో పర్యటిస్తున్నప్పటి ఫొటో అంటూ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ట్విటర్‌లో తాజాగా ఓ చిత్రం షేర్ చేశారు.
సోషల్ మీడియాలో ఇది వైరల్ అయ్యింది.
ఆ ఫొటో 1954లో నెహ్రూ, ఇందిరా అమెరికాలో పర్యటిస్తున్నప్పటిదని థరూర్ సోమవారం రాత్రి చేసిన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
''1954లో అమెరికాలో నెహ్రూ, ఇందిరాల కోసం అక్కడివారు ఎంత మంది వచ్చారో చూడండి. ప్రత్యేక ప్రచారాలు, ప్రవాస భారతీయుల సమీకరణలు, మీడియా అతిప్రచారం లాంటివేవీ లేకుండా ఇది జరిగింది'' అని థరూర్ వ్యాఖ్యానించారు.
ఈ ఫొటో కాంగ్రెస్ అనుకూల ఫేస్‌బుక్ పేజీలు, గ్రూప్‌ల్లో చాలా సార్లు షేర్ అయ్యింది. వాట్సాప్‌లోనూ వైరల్‌గా మారింది.
అయితే, ఈ ఫొటో గురించి థరూర్ చెప్పిన మాటల్లో తప్పు ఉంది.
ఈ చిత్రం అమెరికాలో తీసింది కాదు. నెహ్రూ, ఇందిరా సోవియట్ యూనియన్‌లో పర్యటిస్తున్న సమయంలో తీసిన ఫొటో అది.
కొంత సమయం తర్వాత శశి థరూర్ కూడా ఈ పొరపాటును అంగీకరించారు.

ఫొటో సోర్స్, SM Viral Post

ఫొటో సోర్స్, SM VIRAL POST
ఈ ట్వీట్ విషయంలో శశి థరూర్ తప్పు చేశారని పేర్కొంటూ చాలా మంది స్పందించారు. ఆ ఫొటో రష్యాలోని మాస్కోలో తీసిందని వారిలో కొందరు పేర్కొన్నారు.
అయితే, ఇది కూడా నిజం కాదు.
సోవియట్ యూనియన్‌లో నెహ్రూ, ఇందిరా 1955లో పర్యటించారు.
ఫ్రూజ్ విమానాశ్రయంలో సోవియట్ యూనియన్ ఫస్ట్ సెక్రటరీ నికిటా ఖుర్షేవ్ వారికి స్వాగతం పలికారు.
15 రోజుల పాటు నెహ్రూ, ఇందిరాల పర్యటన సాగింది. పలు పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలను వారు సందర్శించారు.
మోక్సో పట్టణంలోని మెట్రో ట్రైన్ నిర్వహణను కూడా నెహ్రూ పరిశీలించారు.

ఫొటో సోర్స్, TASS/GETTY IMAGES
మాస్కో కాదు..
రష్యా అధికారిక రికార్డుల ప్రకారం నెహ్రూ.. తాష్కెంట్, మాస్కో, మాగ్నిటోగోర్స్క్ సహా 12 ప్రధాన పట్టణాల్లో పర్యటించారు.
శశి థరూర్ ట్వీట్ చేసిన ఆ ఫొటో మాగ్నిటోగోర్స్క్‌లో తీసింది.
'రష్యా బియాండ్' అనే వెబ్‌సైట్‌లో ఈ ఫొటో వివరాలు ఉన్నాయి. 1955లో పారిశ్రామిక నగరం మాగ్నిటోగోర్స్క్‌కు నెహ్రూ, ఇందిరా వచ్చినప్పుడు అక్కడి కార్మికులు, స్థానికులు వాళ్లను చూసేందుకు వచ్చారని ఆ వెబ్‌సైట్ పేర్కొంది.
మంగళవారం ఉదయం శశి థరూర్ తన ముందు ట్వీట్ గురించి ట్విటర్‌లోనే వివరణ ఇచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
''ఆ చిత్రం అమెరికాలోది కాదని, సోవియట్ యూనియన్‌లో తీసిందై ఉండొచ్చని తెలుసుకున్నా. అయినా, నేను చెప్పిన విషయమేమీ పెద్దగా మారదు. గతంలోనూ మన ప్రధానులకు విదేశాల్లో గొప్ప ఆదరణ లభించింది. నరేంద్ర మోదీకి గౌరవం లభిస్తే.. అది భారత్‌కు గౌరవం లభించినట్లు. ఆ గౌరవం భారత్‌ది'' అని థరూర్ వ్యాఖ్యానించారు.
(ఇలాంటి వార్తలు, వీడియోలు, ఫొటోలు లేదా వాదనలు మీకు కూడా చేరి ఉండచ్చు. వాటిపై మీకు సందేహం ఉంటే వాస్తవాలు తెలుసుకోడానికి మీరు +91-9811520111 వాట్సాప్ చేయడం ద్వారా వాటిని BBC Newsకు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి)
ఇవి కూడా చదవండి
- 'హౌడీ మోదీ'తో గెలిచిందెవరు? మోదీనా.. డోనల్డ్ ట్రంపా..
- భారత 'రూపాయి' విలువ బంగ్లాదేశ్ 'టకా' కంటే తగ్గిందా? - Fact Check
- BBC Fact Check: ఇందిరా గాంధీని వాజ్‌పేయీ 'దుర్గా' అని పిలిచేవారా...
- మోదీ విమానానికి పాకిస్తాన్ అనుమతివ్వకపోవడం సరైన చర్యేనా? నిషేధించే హక్కు పాక్‌కు ఉందా?
- భారతదేశంలో నమోదైన మాతృ భాషలు 19,569 - హిందీ కింద వర్గీకరించిన మాతృభాషలు ఎన్ని?
- గూగుల్‌లో మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇలా డిలీట్ చెయ్యండి!
- సౌదీలో డ్రోన్ దాడులు: అమెరికా చమురును భూగర్భంలో ఎందుకు దాచిపెడుతోంది?
- 'మా అమ్మను, తోబుట్టువులను నా ముందే చంపేశారు.. చనిపోయినట్లు నటించి నేను బయటపడ్డా'
- బ్యాంకు ఖాతాలో 90 లక్షలు వచ్చాయి... డ్రా చేశారు, ఖర్చుపెట్టేశారు... ఆ తర్వాత ఏం జరిగింది?
- గులాలాయీ ఇస్మాయిల్: పాకిస్తాన్ నుంచి అమెరికా పారిపోయిన మానవహక్కుల కార్యకర్త
- హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్‌కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








