కరోనావైరస్ నుంచి కోలుకున్న వందేళ్ల ఇథియోపియా వృద్ధుడు

ఫొటో సోర్స్, Hana Atsbeha
ఇథియోపియాలో వందేళ్లు ఉంటాయని భావిస్తున్న ఒక వృద్ధుడు కరోనావైరస్ నుంచి కోలుకోవడం అద్భుతంగానే భావిస్తున్నట్లు ఆయనకు చికిత్స చేసిన డాక్టర్లలో ఒకరు బీబీసీకి చెప్పారు.
ఆ వృద్ధుడి పేరు ఆబా తిలహన్ వోల్డేమైకేల్. ఆయన కుటుంబ సభ్యులు ఆబా వయసు 114 ఏళ్లని చెబుతున్నారు. దాంతో ప్రపంచంలో కరోనా నుంచి కోలుకున్న వృద్ధులు అందరీలో ఈయనే పెద్దవారు అయ్యారు. అయితే, ఆబా వయసు ధ్రువీకరించడానికి జన్మ ధ్రువీకరణ పత్రం లాంటివి ఏవీ అందుబాటులో లేవు.
80 ఏళ్లు దాటిన వృద్ధులు కరోనావైరస్‌ను ఎదుర్కోలేనంత బలహీనంగా ఉంటారని ఇప్పటివరకూ భావిస్తూ వచ్చారు. నూరేళ్ల ఈ వృద్ధుడు ఇథియోపియన్ ఆర్థడాక్స్ క్రైస్తవ సన్యాసి. కరోనా నుంచి కోలుకున్న ఆబాను ఇప్పుడు ఇంట్లో ఉన్న మనవళ్లు చూసుకుంటున్నారు.
“నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు నా ఆరోగ్యం గురించి దేవుడిని ప్రార్థించాను. దేశంలో అందరి ఆరోగ్యం కుదుటపడలాని నేను ఏడుస్తూ ప్రార్థించాను” అని ఆయన బీబీసీకి చెప్పారు.
“రాజధాని అడిస్ అబాబాలో ఆయన ఉన్న కాలనీలో రాండమ్ స్క్రీనింగ్ పరీక్షలు జరిగినపుడు ఆబా తిలహన్‌కు పాజిటివ్ వచ్చింది. దాంతో కరోనా లక్షణాలు కనిపించకముందే ఆయన్ను ఆస్పత్రిలో చేర్చించారు” అని డాక్టర్ హిలఫ్ అబాతే బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, BINYAM LULSEGED TILAHUN
చికిత్సలో భాగంగా ఆయన్ను నిశితంగా పరిశీలించడానికి వైద్య బృందానికి వీలు దొరికింది.
“యెకా కెటెబే ఆస్పత్రిలోని కరోనా వార్డులో ఆయన్ను చేర్చిన నాలుగు రోజులకే అబా తిలహన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దాంతో, ఆయనకు ఆక్సిజన్ పెట్టాం” అని డాక్టర్ హిలఫ్ చెప్పారు.
ఆయన ఆస్పత్రిలో మొత్తం 14 రోజులున్నారు. వారానికి పైగా ఆక్సిజన్ పెట్టారు. ఆయనకు యాంటీ బయాటిక్స్, విషమ పరిస్థితుల్లో ఉన్న కోవిడ్-19 రోగులకు సమర్థంగా పనిచేస్తుందని చెప్పుకుంటున్న యాంటీ ఇన్‌ఫ్లేమటరీ డ్రగ్ డెక్సామెథాసోన్ కూడా ఇచ్చారు.
కఠిన కరోనా ఆంక్షలు అమలు చేస్తున్న ఇథియోపియాలో 5 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు, 81 మరణాలు నమోదయ్యాయి.
కల్లోల కాలానికి సాక్షి
ఆబాకు 114 ఏళ్లని ఆస్పత్రి అధికారుల ధ్రువీకరించకపోయినా, ఆయనకు కచ్చితంగా వందకు పైనే ఉంటాయని వైద్య బృందం చెబుతోంది. ఆయనకు 109 ఏళ్లు ఉండచ్చని వారు చెబుతున్నారు.
ఆయన యువకుడుగా ఉన్నప్పుడు దక్షిణ ఇథియోపియా నుంచి అడిస్ అబాబాకు వచ్చేశారు. కల్లోల సమయంలో అంతా అక్కడే గడిపారు.
1935-1945 మధ్య ఇటలీ ఆక్రమణ జరిగినప్పుడు, 1974లో చక్రవర్తి హైలే సెలాసీని పడగొట్టినపుడు, మార్క్సిస్టు డెర్గ్ పాలన 1991లో కుప్పకూలినప్పుడు, ఇప్పుడు తాజాగా కోవిడ్-19 మహమ్మారి వ్యాపించినపుడు నగరంలో కల్లోలాలన్నిటికీ సాక్షిగా నిలిచారు.
ఎన్నో ఏళ్లపాటు ఆయన ఒక క్రైస్తవ సన్యాసిగా సాధారణ జీవితం గడిపారు. ‘ఆబా’ అంటే ‘తండ్రి’ అని అర్థం.
“కానీ ఆయన యువకుడుగా ఉన్నప్పుడు ఎలక్ట్రీషియన్‌గా, పెయింటరుగా, సహాయకుడుగా పనిచేశారు” అని ఆబా మనవడు 24 ఏళ్ల బిన్యమ్ లల్సేజ్డ్ తిలాహన్ బీబీసీకి చెప్పారు.
కరోనా నుంచి కోలుకోవడం వల్ల ఆబా గొంతు కాస్త బలహీనంగా ఉన్నా ఆయన ఆ వయసులో కూడా చాలా హుషారుగా ఆరోగ్యంగా కనిపించారు.
కరోనావైరస్ వ్యాపించకుండా నియంత్రించడానికి ఇథియోపియా ఏప్రిల్‌లో అత్యవసర స్థితి విధించింది. పాఠశాలలు, మైదానాలు మూసివేసింది. ఎక్కువ మంది గుమిగూడడం, క్రీడా పోటీలు నిషేధించారు. ప్రజా రవాణాలో ప్రయాణించేవారి సంఖ్య తగ్గించారు. కానీ వ్యాపారాలు మాత్రం అనుమతించారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి
- అమ్మకానికి చే గువేరా పుట్టిన ప్రదేశం
- ఫెయిర్ అండ్ లవ్లీపై వివాదం.. పేరు మారుస్తామన్న యూనిలీవర్
- కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి.. వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి
- ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య చిచ్చు పెడుతున్న బెలూన్లు
- పౌరసత్వ చట్టంలో మార్పులు చేసిన నేపాల్.. ‘భారత్‌తో సంబంధాలను దెబ్బతీసేందుకే’
- ఛత్తీస్‌గఢ్: ఆవు పేడ సేకరణకు కొత్త పథకం ప్రవేశపెట్టిన సీఎం
- భారత్ - చైనా సరిహద్దు ఉద్రిక్తతలు: గల్వాన్ లోయ తాజా శాటిలైట్ ఫొటోలు ఏం చెబుతున్నాయి?
- తమ సరిహద్దు గ్రామాలు 60 ఏళ్లుగా చైనా అధీనంలోనే ఉన్నా నేపాల్ ఎందుకు మాట్లాడడం లేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








