కరోనావైరస్: బ్రిటన్‌లో ఎన్‌హెచ్ఎస్ కోసం రూ.180 కోట్ల విరాళాలను సేకరించిన 99 ఏళ్ల మాజీ సైనికుడు

ఫొటో సోర్స్, PA Media
బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ కోసం 19 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ.180 కోట్లు) విరాళాలు సేకరించిన 99 సంవత్సరాల మాజీ సైనికుడిని "వన్ మాన్ ఫండ్ రైజింగ్ మెషిన్" గా డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జ్ ప్రశంసించారు.
కెప్టెన్ టామ్ మూర్ తన 100వ పుట్టిన రోజుకు ముందు తన గార్డెన్ విస్తీర్ణం ఎంత ఉందో దాని కన్నా వంద రెట్లు ఎక్కువ దూరం నడిచి కేవలం 1000 పౌండ్లు అంటే (సుమారు రూ.96000) మాత్రమే సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏప్రిల్ 30 ఆయన పుట్టిన రోజు.

ఫొటో సోర్స్, PA Media
కానీ ఆయన ప్రారంభించిన ‘జస్ట్ గివింగ్’ పేజీకి ఇప్పటికే 8,90,000 మంది విరాళాలు అందచేశారు. ఆయన్ను వీరుడిగా సత్కరించాలని ఐదు లక్షల మందికి పైగా ప్రజలు ఆనర్స్ కమిటీకి విజ్ఞప్తి చేశారు.
గురువారంతో ఆయన ఫండ్ రైజింగ్ ఛాలెంజ్ ముగిసింది. సేకరించిన విరాళాలను చూసి ఆయన ఎంతో ఆనందించారు.
శుక్రవారం కాస్త తక్కువ సమయం నడుస్తాను కానీ, అమెరికా, అర్జెంటీనా, యూరప్, పశ్చిమాసియాలో కొన్ని టీవీ ఛానెళ్ల వారితో మాట్లాడతానని టామ్ మూర్ ట్వీట్ చేశారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు


ఫొటో సోర్స్, @CAPTAINTOMMOORE
ఇంత ఎక్కువ మొత్తంలో విరాళాలు వస్తాయని ఊహించలేదని ఆయన బీబీసీ-2తో అన్నారు. విరాళాలిచ్చిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
"నిజంగా చాలా ధన్యవాదాలు. అవసరమైన సమయంలో విరాళాలు ఇవ్వడాన్ని నేను ప్రశంసిస్తున్నాను. మీరంతా దయ గలవారని అనుకుంటున్నా" అని అన్నారు.
టామ్ మూర్‌కు డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జి కూడా కొంత మొత్తాన్ని విరాళంగా అందించారు. అయితే, అది ఎంత అనే వివరాలు వెల్లడించలేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆయన డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్‌తో కలిసి టామ్ మూర్ కోసం ఒక వీడియో సందేశాన్ని రికార్డు చేసి పంపించారు. 99 సంవత్సరాల వయసులో కూడా యుద్ధ సైనికుడిగా ఆయన ఈ పని చేయడం చాలా అద్భుతంగా ఉందని ప్రిన్స్ విలియం అన్నారు.
"ఆయనకి చాలా విషయాలు తెలుసు. ఆయన సంకల్పంతో చాలా మంది ప్రభావితులవ్వడం చాలా అద్భుతంగా ఉంది. ఆయన వన్ మాన్ ఫండ్ రైజింగ్ మెషిన్. విరాళాల మొత్తం ఎంతో దేవుడొక్కడికే తెలుసు. ఇది ఆయన మంచితనానికి నిదర్శనం" అని ఆ సందేశంలో పేర్కొన్నారు.
ఈ సందేశాన్ని విన్న టామ్ మూర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు.

ఫొటో సోర్స్, PA Media
వెస్ట్ యార్క్‌షైర్‌లోని కెగ్లీకి చెందిన టామ్ మూర్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ప్రముఖుడైపోయారు. టామ్ మూర్ సేవలను గుర్తించి, గౌరవిస్తామని కెగ్లీ టౌన్ కౌన్సిల్ ట్వీట్ చేసింది. క్రీడాకారులు, సెలబ్రిటీలు ఆయనను అభినందిస్తూ సందేశాలు పంపారు.
నేషనల్ హెల్త్ సర్వీస్‌కి టామ్ మూర్ చేసిన సహాయం స్ఫూర్తిదాయకమని ఇంగ్లండ్ ఫుట్ బాల్ టీం కెప్టెన్ హ్యారీ కేన్ ట్వీట్ చేశారు.
కాన్సర్‌కి చికిత్స చేసిన నేషనల్ హెల్త్ సర్వీస్ ఉద్యోగుల కోసం విరాళాలు సేకరించాలని కెప్టెన్ టామ్ మూర్ అనుకున్నారు. వాకర్ సహాయంతో బెడ్ఫర్డ్ షైర్లో ఉన్న ఆయన తోటలో 100 రౌండ్లు నడిచారు. ఆయన ప్రయత్నాన్ని ఎన్‌హెచ్ఎస్ చారిటీస్ ప్రశంసించింది.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: లాక్డౌన్ పొడిగిస్తే ఎదురయ్యే పరిస్థితులకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా?
- కరోనావైరస్: తొలి కేసు నమోదవడంతో యెమెన్‌లో 'భయం భయం'
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి? నిర్థరణకు ఎలాంటి పరీక్షలు చేస్తారు?
- కరోనావైరస్: ఇటలీని దాటేసిన అమెరికా, ప్రపంచంలో అత్యధిక మరణాలు ఇక్కడే
- కరోనా లాక్డౌన్: విపరీతంగా బయటపడుతున్న ఎలుకలు.. వీటిని నివారించడం ఎలా
- వుహాన్‌లో లాక్ డౌన్ ఎత్తేసిన చైనా ప్రభుత్వం.. రైళ్లు, విమానాల్లో మొదలైన ప్రయాణాలు
- కరోనావైరస్: నియంత్రణ రేఖ 'సామాజిక దూరం' ఎలా పాటించాలంటున్న స్థానికులు
- మామకు కరోనా పాజిటివ్... రహస్యంగా చూసివచ్చిన అల్లుడిపై కేసు
- కొడుకు శవంతో రోడ్డుపై పరుగులు తీసిన తల్లి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








