కరోనావైరస్: 'చైనీస్ వైరస్' అంటూ ట్రంప్ ట్వీట్.. చైనా ఆగ్రహం

ఫొటో సోర్స్, Getty Images
కొత్త కరోనావైరస్‌ను 'చైనీస్ వైరస్' అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సంబోధించటంతో దానిపై చైనా ఆగ్రహంగా స్పందించింది.
చైనాను అపకీర్తి పాలు చేయటం బదులు అమెరికా తన ''సొంత పనులు చూసుకుంటే'' మంచిదని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఒకరు హెచ్చరించారు.
కోవిడ్-19 మొదటి కేసులు 2019 చివర్లో చైనాలోని ఉహాన్ నగరంలో నమోదయ్యాయి.
అయితే.. అమెరికా సైన్యం ఈ వైరస్‌ను ఈ ప్రాంతంలోకి తీసుకువచ్చిందని ఆరోపిస్తున్న ఒక కుట్ర సిద్ధాంతాన్ని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒకరు గత వారంలో షేర్ చేశారు.
అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో స్పందిస్తూ.. ఇవి నిరాధార ఆరోపణలని, ఇటువంటి ''అసత్య సమాచారాన్ని'' వ్యాప్తి చేయటం ఆపాలని చైనాను డిమాండ్ చేశారు. వైరస్ విజృంభణకు సంబంధించిన నిందను అమెరికా మీదకు మళ్లించటానికి చైనా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా 1,70,000 కోవిడ్-19 కేసులు నమోదవగా.. అందులో 80,000కు పైగా కేసులు చైనాలోనే ఉన్నాయి.
అయితే.. మంగళవారం నాడు తమ దేశంలో కేవలం ఒకే ఒక్క కొత్త కేసు మాత్రమే నమోదైందని చైనా పేర్కొంది. మిగతా కొత్త కేసులన్నీ విదేశాల నుంచి తమ దేశంలోకి వచ్చినవేనని పేర్కొంది.

డోనల్డ్ ట్రంప్ ఏమన్నారు?
కోవిడ్-19 వ్యాధికి కారణమయ్యే కొత్త కరోనావైరస్‌ను ''చైనా వైరస్'' అని అభివర్ణిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సోమవారం ఒక ట్వీట్ చేశారు.
ఈ వైరస్‌ను ఏదైనా నిర్దిష్ట ప్రాంతానికి లేదా సమూహానికి లింక్ చేయవద్దని.. అలా చేయటం వల్ల ఆ ప్రాంతం లేదా సమూహం పట్ల అపకీర్తి, వివక్ష తలెత్తే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే హెచ్చరించింది.
అయినప్పటికీ.. అమెరికా ప్రభుత్వ అధికారులు కొందరు ఈ వైరస్‌ను చైనీస్ వైరస్ అని ఉటంకిస్తున్నారు. విదేశాంగ మంత్రి పాంపేయే ఈ వైరస్‌ను 'ఉహాన్ వైరస్' అని పదే పదే అభివర్ణించారు.

- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు

ప్రతిస్పందన ఏమిటి?
ట్రంప్ చేసిన ట్వీట్ ''చైనాను అప్రతిష్ట పాలు చేయటమే''నని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ తప్పుపట్టారు.
''అమెరికా తన తప్పును సరిదిద్దుకోవాలని.. చైనాకు వ్యతిరేకంగా నిరాధారణ ఆరోపణలను మానుకోవాలని మేం విజ్ఞప్తి చేస్తున్నాం'' అని కూడా ఆయన చెప్పారు.
ట్రంప్ ఉపయోగించిన భాష జాతి వివక్షతో కూడుకున్నదిగా, విదేశీయుల పట్ల భయాన్ని పెంచేదిగా ఉందని.. రాజకీయ నాయకుల బాధ్యతారాహిత్యం, అసమర్థతలను చాటుతోందని.. వైరస్ పట్ల భయాలను పెంచుతోందని చైనా అధికారిక వార్తా సంస్థ జిన్‌హువా పేర్కొంది.
అమెరికాలోనూ అంతర్గతంగా విమర్శలు వచ్చాయి. ఈ పదం ఆసియన్-అమెరికన్ల పట్ల మరింత వివక్షను పెంపొందించే ప్రమాదం ఉందని న్యూయార్క్ మేయర్ బిల్ డి బ్లాసియో తప్పుపట్టారు.
చైనా - అమెరికా సంబంధాలు ఇప్పుడెలా ఉన్నాయి?
రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిని ఉన్నాయి.
చైనా అన్యాయమైన వాణిజ్య విధానాలను అనురసరిస్తోందని, మేధో సంపత్తిని తస్కరిస్తోందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. చైనా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగకుండా అణచివేయటానికి అమెరికా ప్రయత్నిస్తోందని చైనాలో ఒక అభిప్రాయం ఉంది.
రెండు దేశాల మధ్య తీవ్ర వాణిజ్య యుద్ధం జరుగుతోంది. అమెరికా, చైనాలు రెండే పరస్పరం దిగుమతి చేసుకునే వేల కోట్ల డాలర్ల విలువ చేసే వస్తువుల మీద అదనపు సుంకాలు విధించాయి.
అయితే కొత్త కరోనావైరస్ విజృంభించటంతో ఈ వైరం కొంత సడలినట్లు కనిపించింది. జనవరి నెలలో పాక్షిక పరిష్కారం మీద ఒప్పందం చేసుకున్నారు.


ఇవి కూడా చదవండి
- బంగ్లాదేశ్ చరిత్రలోనే అత్యంత దారుణ హత్యాకాండ
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
- భారత్ కూడా పాకిస్తాన్ చేసిన 'తప్పే' చేస్తోంది: షోయబ్ అఖ్తర్
- ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో కరోనావైరస్ వ్యాప్తి ఎలా ఉంది?
- కరోనావైరస్ వ్యాక్సీన్ అభివృద్ధిలో ముందడుగు, ఓ మహిళకు ప్రయోగాత్మకంగా ఇంజెక్ట్ చేసిన శాస్త్రవేత్తలు
- కరోనావైరస్ అనుమానిత రోగులు ఆసుపత్రుల నుంచి ఎందుకు పారిపోతున్నారు?
- కరోనావైరస్- పారాసిటమాల్: ఏపీ సీఎం వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్
- ప్రపంచంలోనే హెచ్ఐవీని జయించిన రెండో వ్యక్తి.. ఎలా నయమయ్యిందంటే?
- కరోనావైరస్ గురించి ఈ సినిమా 10 ఏళ్ల కిందే చెప్పిందా?
- కరోనావైరస్: శశిథరూర్ మెడలోని ఈ గాడ్జెట్ వైరస్లను అడ్డుకుంటుందా
- కరోనావైరస్లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








