మహిళా క్రికెట్ ప్రపంచ కప్: తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్

భారత మహిళా జట్టు విజయం

ఫొటో సోర్స్, PETER PARKS/GETTY IMAGES

శుక్రవారం సిడ్నీలో జరిగిన ఐసీసీ మహిళా టీ-20 ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ టీమ్ ప్రస్తుత చాంపియన్ ఆస్ట్రేలియాపై 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ధారిత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. తర్వాత బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టీమ్ 19.5 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

News image

ఆతిథ్య జట్టులో ఎలిసా హీలీ 35 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 51 పరుగులు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఆమె మినహా యాష్లే గార్డ్‌నర్ మాత్రమే రెండంకెల స్కోరు(34) చేయగలిగారు.

భారత్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ మెరుగైన ప్రదర్శన ఇచ్చారు. నాలుగు ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టారు.

కానీ పూనమ్ ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ మిస్ అయ్యారు. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' ఆమెనే వరించింది. ఆమెతోపాటు శిఖా పాండే 3, రాజేశ్వరి గైక్వాడ్‌ 1 వికెట్ పడగొట్టారు.

భారత మహిళా జట్టు విజయం

ఫొటో సోర్స్, Getty Images

అంతకు ముందు 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన దీప్తి శర్మ బ్యాటింగ్‌తో భారత జట్టు ఆస్ట్రేలియాకు సాధారణ లక్ష్యం ఇవ్వగలిగింది.

అంతకు ముందు ఓపెనర్ షెఫాలి వర్మా 15 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో 29 పరుగులు చేశారు.

భారత జట్టు ప్రారంభంలో చెలరేగి ఆడింది. కానీ 5, 6, 7 ఓవర్లలో వరసగా 3 వికెట్లు పడిపోవడంతో పరుగుల వేగం మందగించింది.

ఆ తర్వాత 5వ వికెట్‌కు వేదా కృష్ణమూర్తి, దీప్తి శర్మ జట్టుకు 32 పరుగుల భాగస్వామ్యం అందించారు.

సోషల్ మీడియాలో లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ ప్రదర్శనపై చాలా చర్చ జరుగుతోంది. శుక్రవారం మ్యాచ్ తర్వాత ఆమె పేరు ట్విటర్ టాప్ ట్రెండ్స్‌లో నిలిచింది.

భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ తర్వాత "మేం సిడ్నీలో మొదట బౌలింగ్ చేయాలని అనుకున్నాం. కానీ టాస్ మన చేతిలో ఉండదు కదా. మేం మంచి క్రికెట్ ఆడాలని అనుకుంటున్నామని, మంచి ఫలితమే వస్తుందని అనుకుంటున్నాను" అన్నారు.

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లెనింగ్ "మాకు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు. అందుకే మేం మొదట బౌలింగ్ చేయాలని అనుకుంటున్నాం. మోలీ స్టర్న్‌ను నేరుగా జట్టులోకి తీసుకున్నాం. ఆమె మెరుగైన ప్రదర్శన ఇస్తుందనే అనుకుంటున్నాను" అన్నారు.

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఈ మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు స్మృతి మంధానా గాయపడ్డారు. ఆమె భుజానికి గాయమైంది. దాంతో ఈ మ్యాచ్ మధ్యలోనే ఆమె మైదానం వీడాల్సి వచ్చింది.

భారత మహిళా జట్టు తర్వాత మ్యాచ్ ఫిబ్రవరి 24న పెర్త్‌లో బంగ్లాదేశ్‌తో ఆడుతుంది.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)