#PulwamaAttack: పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుగల్ పురోహిత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దక్షిణ కశ్మీర్‌లో లడూమోడ్ ప్రాంతం 2019 ఫిబ్రవరి 14న మధ్యాహ్నం 3 గంటలా 10 నిమిషాల వరకూ కశ్మీర్‌లో మిగతా ప్రాంతాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంది.
తర్వాత నిమిషంలోనే అక్కడ అన్నీ శాశ్వతంగా మారిపోయాయి.
ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఒక వ్యక్తి తన మారుతీ సుజుకీ ఎకో వాహనంతో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లోని ఒక బస్సుపైకి దూసుకొచ్చాడు. అప్పుడు జరిగిన పేలుడులో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు.
సీఆర్పీఎఫ్ జవాన్ల పోరాటం, వారి కాన్వాయ్ మీద దాడులు జరగడం కశ్మీర్లో కొత్త విషయం కాదు. కానీ కశ్మీర్‌లో మూడు దశాబ్దాల నుంచీ జరుగుతున్న మిలిటెంటు దాడుల్లో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు.
సీఆర్పీఎఫ్ ఏం చేసింది
ఈ దాడి తర్వాత, మరోసారి ఇలాంటి ఘటన జరక్కుండా ఏం చేయాలి అనే ప్రశ్నలు రేకెత్తాయి.
దీనిపై సీఆర్పీఎఫ్ డీజీ ఆనంద్ ప్రకాశ్ మహేశ్వరి బీబీసీతో మాట్లాడారు.
"వ్యూహాలు, ఆయుధాల విషయంలో సీఆర్పీఎఫ్ నిరంతరం తన సామర్థ్యాలను మెరుగు పరచుకుంటూ ఉంటుంది. ఆ సామర్థ్యంతో శత్రువులను అడ్డుకోవడమే కాదు, ఇలాంటి వాటికి మూలం ఎక్కడ ఉంటుందో, ఆ మొత్తం కుట్రనే భగ్నం చేయవచ్చు" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, గత ఏడాది జరిగిన పుల్వామా దాడి దర్యాప్తు నివేదిక, దానిపై జరిగిన దర్యాప్తు గురించి అడిగినపుడు ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
పుల్వామాలో గత ఏడాది జరిగిన ఈ ఘటన గురించి సీఆర్పీఎఫ్ నిఘా వైఫల్యం నుంచి కాన్వాయ్ భద్రత వరకూ బీబీసీ అన్నిరకాల ప్రశ్నలు అడిగింది.
ఆత్మాహుతి దాడి తర్వాత ఇప్పటివరకూ ఎవరి మీదా, ఎలాంటి చర్యలూ తీసుకోలేదని చాలా మంది సీఆర్పీఎఫ్ అధికారులు బీబీసీకి ధ్రువీకరించారు.
"పుల్వామా దాడి జరిగిన సమయంలో మేం ఎలాంటి దాడినైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ వాహనంతో జరిపే దాడుల(వెహికల్ బోర్న్ ఇంప్రువైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్)కు మేం సిద్ధం కాలేదు. అది ఒక పరీక్షలో సిలబస్‌లో లేని ప్రశ్నను అడిగినట్లు ఉంటుంది" అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక సీనియర్ అధికారి చెప్పారు.
కానీ, ఒక డేటా ఈ సీఆర్పీఎఫ్ అధికారి ప్రకటన భిన్నంగా ఉంది. మిలిటెంట్లు ఇలా వాహనాలు ఉపయోగించి పేలుళ్లు జరపడం ఇదే మొదటిసారి కాదని ఆ డేటా చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
కారు బాంబుల ఉపయోగం
సౌత్ ఏసియా టెర్రరిజం పోర్టల్ ప్రకారం 2005 నవంబర్ 2న నౌగామ్‌లో ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు కారుతో పేలుడు జరిపాడు. అందులో ముగ్గురు పోలీసులు, ఆరుగురు పౌరులు చనిపోయారు. మరో ఘటనలో కూడా వాహనాలను కారు బాంబులుగా ఉపయోగించారు.
బీబీసీ ఈ విషయంపై సీఆర్పీఎఫ్ మాజీ ఐజీ వీపీఎస్ పవార్‌తో మాట్లాడింది.
"సీఆర్పీఎఫ్ కేవలం అగ్నిమాపక విభాగంలా ఉంటుంది. మంటలు ఆర్పేందుకు ఫైరింజన్‌ను పంపినట్లు, దానిని ఒక సంక్షోభం నుంచి మరో సంక్షోభం దగ్గరకు పంపిస్తుంటారు. నాకు తెలిసి పుల్వామా ఒక పెద్ద తప్పు. ఈ దాడితో ఈ దళం ఎంత నేర్చుకుంది, అనేది నాకు తెలీదు" అని ఆయన చెప్పారు.
పుల్వామా ఘటన తర్వాత కొన్ని కఠిన చర్యలు తీసుకున్నారు. హైవేపై భద్రతాదళాల కాన్వాయ్ వెళ్తున్న సమయంలో పౌరుల వాహనాలను అడ్డుకోవాలనే నిర్ణయం అందులో ఒకటి.
ఈ దాడి జరిగిన తర్వాత జవాన్లను విమానాల్లో తీసుకెళ్లే అవకాశం ఉన్నప్పటికీ వారిని రోడ్డు మార్గం ద్వారా తీసుకెళ్లడం గురించి ప్రభుత్వంపై విమర్శలు కూడా వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడు ఏం మారింది?
దీనిపై "జమ్ము- శ్రీనగర్ మధ్య సీఆర్పీఎఫ్ జవాన్లను విమానంలో తీసుకెళ్లాలంటే మన విమాన సేవల సామర్థ్యం చాలా తక్కువ. అవి సరిపోవు. ఇప్పుడు జవాన్లు వ్యక్తిగతంగా విమానాల్లో వెళ్లచ్చు. ప్రభుత్వం ఆ డబ్బు వారికి తిరిగి చెల్లిస్తుంది" అని పేరు వెల్లడించవద్దని కోరిన ఒక సీఆర్పీఎప్ సీనియర్ అధికారి చెప్పారు.
జమ్ము-కశ్మీర్ జాతీయ రహదారులపై సీసీటీవీ నెట్‌వర్క్ పనులు కొనసాగుతున్నాయి. ఈ నెట్‌వర్క్ పూర్తైతే, రహదారులపై నిఘా పెట్టడానికి, భద్రతా సవాళ్లను ఎదుర్కోడానికి సహకరిస్తుందని భావిస్తున్నారు.
భద్రతాదళాల కాన్వాయ్ వెళ్తున్న సమయంలో హైవే పక్కనే నిలబడిన ట్రక్కులను అక్కడ నుంచి తొలగించడానికి ఏం చేయాలా, అనే దానిపై ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
పుల్వామా దాడి జరిగి ఏడాదవుతున్నా, దానిపై దర్యాప్తు చార్జిషీట్ ఇప్పటివరకూ కోర్టులో కూడా జమచేయలేదు.
గత ఏడాది ఫిబ్రవరి 20న ఈ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు ఏజెన్సీ(ఎన్ఐఏ)కు అప్పగించారు. చార్జిషీటు ప్రవేశపెట్టకపోవడానికి అది ఎన్నో కారణాలు చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
దర్యాప్తు గురించి ఎన్ఐఏ ఏం చెబుతోంది?
మేం ఎన్ఐఏ నుంచి పుల్వామా దాడి కేసు పురోగతికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగాం.
కానీ ఎన్ఐఏ మాత్రం ఆ దాడికి ఉపయోగించిన వాహన యజమాని ఎవరు, దాడి చేసిన వారు ఎవరు, దాడికి ఎలాంటి పేలుడు పదార్థాలు ఉపయోగించారు అనేది మాత్ర గుర్తించారు. ఈ ఆత్మాహుతి దాడి వెనుక ఎవరి కుట్ర ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ఐఏ వాటిని తమ విజయగా చెబుతోంది.
ఎన్ఐఏ తన ప్రకటనలో "జేష్-ఎ-మొహమ్మద్ ప్రతినిధి మొహమ్మద్ హసన్ దాడి జరిగిన వెంటనే దానికి బాధ్యత వహిస్తూ ఎన్నో మీడియా సంస్థలకు తన ప్రకటనను పంపించారు. జైష్ ప్రతినిధి ఆ ప్రకటన పంపించడానికి ఉపయోగించిన ఐపీ అడ్రస్ ట్రేస్ చేశాం. అది పాకిస్తాన్‌లో ఉంది" అని చెప్పింది.
"పుల్వామా దాడి దర్యాప్తు సమయంలో లోయలో చురుకుగా ఉన్న జేష్-ఎ-మహమ్మద్‌కు చెందిన ఒక నెట్‌వర్క్ కుట్రను భగ్నం చేశాం. యూఏపీఏ కింద వారిలో 8 మందిపై చార్జిషీటు దాఖలు చేశాం. దక్షిణ కశ్మీర్ జైష్ వెన్నువిరిచాం" అన్నారు.
ఎన్ఐఏను ఇప్పటివరకూ ఛార్జిషీటు ఎందుకు ఫైల్ చేయలేదు అని అడిగితే మాత్రం "మేం ఏ కారణాల చెప్పామో.. వాటి వల్లే చార్జిషీటు ఇప్పటివరకూ దాఖలు చేయలేకపోతున్నాం" అన్నారు.

ఇవి కూడా చదవండి:
- కరోనా వైరస్: భారత్‌లో ఇప్పటివరకూ మొత్తం ఎన్ని కోవిడ్ కేసులు బయటపడ్డాయి?
- డోనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ మధ్యలో ఈ గోడ ఎక్కడి నుంచి వచ్చింది
- దేశ విభజన: "ఆ ముస్లింలు ఇక్కడే ఉండిపోవడం దేశానికి మేలు చేసినట్టేం కాదు" - యోగి ఆదిత్యనాథ్
- మహిళలను భారత సైన్యంలో కమాండర్లుగా అంగీకరించే పరిస్థితి లేదా?
- ఎలక్ట్రిక్ కారు కొనాల్సిన టైమ్ వచ్చేసిందా...
- కరోనావైరస్: అందర్నీ వణికిస్తున్న వైరస్ ఎన్నో ప్రాణులను కాపాడుతోంది
- ‘పిల్లలకు అన్నం పెట్టేందుకు నా జుట్టు అమ్ముకున్నా’
- కరోనావైరస్: వధువు, వరుడు లేకుండా పెళ్లి వేడుక జరిగింది
- ఇంట్లో కుళాయి తిప్పితే మద్యం వచ్చింది
- ‘మిస్సింగ్ 54’ మిస్టరీ: ఆ భారత సైనికులు ఏమయ్యారు... దశాబ్దాలుగా పాకిస్తాన్‌లోనే మగ్గుతున్నారా?
- విశాఖపట్నం: సముద్రంలో ‘స్వచ్ఛ భారత్’ చేస్తూ ప్రధాని మోదీ మెప్పు పొందిన స్కూబా డైవర్లు
- రాజధాని రగడ-రాజకీయ క్రీడ!: ఎడిటర్స్ కామెంట్
- గూగుల్ కన్నా వందేళ్ల ముందే డేటాతో సంపన్నుడైన ఘనుడు
- ఈ మందు వేసుకుంటే బ్రేకప్ బాధను మరచిపోవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









