కూలిన ఉక్రెయిన్ బోయింగ్ 737, విమానంలోని 170 మందికి పైగా మృతి

విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, AFP

ఉక్రెయిన్ ప్రయాణికుల విమానం ఇరాన్‌లో కూలిపోయింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 170 మందికి పైగా మృతిచెందారు.

ఈ ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు ఒక బృందాన్ని నియమించామని ఉక్రెయిన్ ప్రభుత్వం చెప్పింది.

ఒమన్ పర్యటనకు వెళ్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెంస్కీ ప్రయాణం మధ్యలో ముగించి తిరిగి రాజధాని కీవ్ బయల్దేరారు.

విమాన ప్రమాదంలో మరణించిన వారి బంధువులు, స్నేహితులకు సంతాపం తెలుపుతూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ఉక్రెయిన్ విమానం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఫైల్ ఫొటో

ఈ ఘటనకు ఇరాన్-అమెరికా ఘర్షణతో ఏదైనా సంబంధం ఉందా అనేది ఇంకా తెలీడం లేదు.

ఈ విమానంలో ప్రయాణించడానికి 168 మంది ప్రయాణికులు 9 మంది సిబ్బంది రిజిస్టర్ చేసుకున్నట్లు ప్రధాని ఒలెక్సీ హొంచరుక్ చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

రాయిటర్స్ వార్తల ప్రకారం ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లోని ఇమామ్ ఖామెనెయీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ కాగానే ప్రమాదానికి గురైంది.

విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, AFP

సాంకేతిక సమస్యల కారణంగా ఈ విమానం ప్రమాదానికి గురైందని ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ చెప్పింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ విమానం టెహ్రాన్ నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్ వెళ్తోంది.

విమానాశ్రయం దగ్గర ఘటనాస్థలం దగ్గరకు సహాయ సిబ్బందిని పంపించారు.

"విమానం మంటల్లో ఉంది. కానీ మేం సిబ్బందిని పంపించాం. కొంతమందినైనా కాపాడగలమని అనుకుంటున్నాం" అని ఇరాన్ అత్యవసర సేవల అధికారి పిర్హొస్సేన్ కౌలీవాండ్ రాయిటర్స్‌తో అన్నట్లు ఇరాన్ టీవీ చెప్పింది.

ఇరాన్ రెడ్ క్రిసెంట్ హెడ్ మీడియాతో కూలిన విమానంలో ఎవరూ సజీవంగా ఉండే అవకాశాలు లేవని అన్నారు.

(ఈ వార్త అప్‌డేట్ అవుతోంది)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)