ఇరాన్ ప్రతిదాడి: ఇరాక్‌లో అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు... మరిన్ని తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్

క్షిపణి దాడి

ఫొటో సోర్స్, Fars News

ఇరాక్‌లో అమెరికా సైన్యం ఉన్న రెండు వైమానిక స్థావరాలపై పదికి పైగా బాలిస్టిక్ మిసైళ్లతో దాడి జరిగింది అని అమెరికా రక్షణ శాఖ చెప్పింది.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆదేశాలతో, బగ్దాద్‌లో డ్రోన్ దాడులు చేసి దేశ అగ్ర కమాడర్ కాసిం సులేమానీని చంపినందుకు ప్రతీకారంగానే ఈ దాడి జరిగినట్లు ఇరాన్ టీవీ ప్రకటించింది.

దీనిపై ట్వీట్ చేసిన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అంతా బాగానే ఉందని అన్నారు. దీనిపై బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తానని చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఆయన తన ట్వీట్‌లో "అంతా బాగానే ఉంది. ఇరాక్‌లో రెండు సైనిక స్థావరాలపై దాడులు చేశారు. ప్రాణనష్టం, ఆస్తినష్టం గురించి అంచనా వేస్తున్నాం. ఇప్పటివరకూ అంతా బాగానే ఉంది. మా దగ్గర ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆర్మీ ఉంది. నేను ఉదయం ఒక ప్రకటన విడుదల చేస్తాను" అన్నారు.

మళ్లీ దాడులు చేస్తే గట్టి సమాధానం ఇస్తాం: ఇరాన్

ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి అలీ రాబేయీ అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేసినందుకు రెవెల్యూషనరీ గార్డ్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 'మీ మాట నెరవేర్చుకున్నారని' ప్రశంసించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

క్షిపణి దాడులను సమర్థించుకున్న ఆయన "మేం యుద్ధం కోరుకోవడం లేదు. కానీ మళ్లీ ఏదైనా దాడి జరిగితే, దానికి మరింత గట్టిగా సమాధానం ఇస్తాం" అన్నారు.

పెంటగాన్ ప్రకటన

మిసైల్ దాడులపై పెంటగాన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

జనవరి 7న సుమారు సాయంత్రం 5.30కు ఇరాన్ పదికి పైగా బాలిస్టిక్ మిసైళ్లను అమెరికా సైన్యం, ఇరాక్ సంకీర్ణ సేనలపైకి ప్రయోగించింది. ఈ మిసైళ్లను ఇరాన్ నుంచి ప్రయోగించారన్నది సుస్పష్టం. అవి అల్-అసద్, ఇర్బిల్ అమెరికా, సంకీర్ణ దళాలు ఉన్న రెండు సైనిక స్థావరాలపై పడ్డాయి.

ఈ దాడిలో జరిగిన ప్రాథమిక నష్టాన్ని మేం అంచనా వేస్తున్నాం.

"ఇరాన్ బెదిరింపులు, చర్యలకు స్పందనగా రక్షణ శాఖ మా సైనికులను, మా భాగస్వాములను కాపాడ్డానికి అన్ని తగిన చర్యలూ తీసుకుంది. ఆ ప్రాంతంలోని మా దళాలపై దాడి చేయడానికి ఇరాన్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందనే సూచనలతో, ఆ ప్రాంత భద్రత కోసం మేం అక్కడివారిని అప్రమత్తం చేశాం".

"దీనికి స్పందనగా పరిస్థితిని అంచనా వేస్తున్న మేం, మా దళాలను, మా భాగస్వాములను, ఆ ప్రాంతంలోని మిత్రదళాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటాం"

"ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై దాడులు జరిగినట్లు మాకు రిపోర్ట్స్ వచ్చాయి. అధ్యక్షుడికి దీని గురించి వివరించాం. ఆయన నేషనల్ సెక్యూరిటీ టీమ్‌ను సంప్రదిస్తూ, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం" అని వైట్ హౌస్ ప్రతినిధి స్టీఫనీ గ్రిషామ్ ఒక ప్రకటనలో చెప్పారు.

ఇరాన్ దాడులు

ఇది పెద్దది కావాలనుకోవడం లేదు: ఇరాన్

ఈ అంశాన్ని పెద్దది చేయాలని అనుకోవడం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జారిఫ్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఇరాన్ "ఇది తీవ్రంకావాలని, యుద్ధాన్ని కోరుకోవడం లేదు. కానీ ఎలాంటి దూకుడు చర్యలకు పాల్పడ్డా మమ్మల్ని మేం కాపాడుకుంటాం" అన్నారు.

మా పౌరులు, సీనియర్ అధికారులపై జరిగిన పిరికిపంద సైనిక దాడితో యూఎన్ చార్టర్‌లోని ఆర్టికల్ 51 కింద ఇరాన్ ఆత్మరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటుంది.

ఈ ట్వీట్‌ను ఇరాన్ వైపు నుంచి తీవ్రతలను తగ్గించే చర్యకు సంకేతంగా చూస్తున్నారు.

ఈరోజు(బుధవారం)సీబీఎస్ న్యూస్‌తో మాట్లాడిన జరీఫ్ అమెరికా అలాంటి మార్గం ఎంచుకుంటుందని తాము అనుకోలేదని అన్నారు.

ప్రతీకారంగానే దాడులు

శుక్రవారం సులేమానీ మరణానికి ప్రతీకారంగానే ఈ దాడులు జరిపినట్లు ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ ప్రకటించింది.

"ఇరాన్‌కు వ్యతిరేకంగా ఏ దేశమైనా దుందుడుకు చర్యలకు పాల్పడితే, వాటిని లక్ష్యంగా చేసుకుని ప్రతిదాడులు చేస్తామని, అమెరికా తీవ్రవాద సైన్యానికి తమ స్థావరాలను ఇచ్చిన మిత్రదేశాలన్నింటినీ మేం హెచ్చరిస్తున్నాం" అని ఇరాన్ ప్రభుత్వ అధీనంలోని ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థ ఒక ప్రకటన ద్వారా తెలిపింది.

పర్షియన్‌లో దీనిపై ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో.. "అమెరికా చేసే ఏ దాడులకైనా ఇరాన్ తీవ్రంగా స్పందిస్తుందని హెచ్చరిస్తున్నాం. అమెరికాకు ఇచ్చిన స్థావరాలను ఇరాన్‌పై దాడులకు ఉపయోగించుకుంటే, వాటిపై మేం దాడులు చేయవచ్చని హెచ్చరిస్తున్నాం. ఈ నేరంలో ఇజ్రాయెల్‌ను అమెరికా నుంచి విడిగా చూడలేం. అక్కడి నుంచి అమెరికా తన దళాలను వెనక్కు తీసుకోవాలి" అని చెప్పారు.

ఇరాన్ దాడులు

"ఇరాన్‌లో సులేమానీ అంత్యక్రియలు జరిగిన కొన్ని గంటల తర్వాత ఈ దాడులు జరిగాయి. మొదటి రాకెట్ అల్-అసద్‌ను తాకిన కాసేపట్లోనే ఇర్బిల్‌పై రెండో దాడి జరిగింది" అని అల్ మయదీన్ టీవీ చెప్పింది.

అంతకు ముదు ఇరాక్ నుంచి తమ దళాలను ఉపసంహరించడం దేశానికి దారుణమైన విషయం అని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.

ఇరాక్‌లో ప్రస్తుతం దాదాపు 5 వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు.

క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు, బ్రిటన్ దేశస్థులకు రక్షణ కల్పించడమే తమ తొలి ప్రాధాన్యత అని బ్రిటన్ విదేశాంగ శాఖ బీబీసీకి చెప్పింది.

"పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా రాయల్ నావీ, మిలిటరీ హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచాం" అని రక్షణ మంత్రి బెన్ వాలస్ అంతకు ముందు చెప్పారు.

ఇరాన్ దాడులు

ఫొటో సోర్స్, Getty Images

విమానాలపై ఎఫ్ఏఏ ఆంక్షలు

ఇరాన్ దాడులతో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఇరాన్, ఇరాక్, పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ మీదుగా వెళ్లే విమానాలకు ఆంక్షలు విధించింది.

"మేం మా జాతీయ భాగస్వాములతో సమన్వయం చేస్తున్నాం. అమెరికా విమానయాన శాఖ, విదేశీ పౌర విమానాయన శాఖ అధికారులతో సమాచారం పంచుకుంటాం" అని ఎఫ్ఏఏ తెలిపింది.

భారత్ అప్రమత్తం

పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితిని గమనిస్తున్న భారత్ అప్రమత్తమైంది.

దీనిపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ ఒక అడ్వైజరీ జారీ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

భారత నుంచి ఇరాక్ వెళ్లాలని అనుకుంటున్నవారు, తదుపరి సమాచారం వచ్చేవరకూ అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. ఇరాక్‌లో ఉంటున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

"బగ్దాద్, ఇర్బిల్ నగరాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు మామూలు రోజుల్లాగే పనిచేస్తుంటాయి. ఇరాక్‌లో ఉంటున్న భారతీయులకు అదుబాటులో ఉంటాయి" అని రవీష్ కుమార్ చెప్పారు.

భారత్‌లో సేవలందిస్తున్నవిమానాలు కొంతకాలం ఇరాన్, ఇరాక్, గల్ఫ్ దేశాల మీదుగా వెళ్లే మార్గాలను ఉపయోగించకుండా ఉండాలని ఆయన విమాన యాన సంస్థలను కోరినట్లు ఏఎన్ఐ చెప్పింది.

ఇరాన్ సైనిక బలం ఎంత?

బీబీసీ రియాలిటీ టీమ్ రిపోర్ట్

- బ్రిటన్‌లో ఉన్న థింక్ ట్యాంక్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ ప్రకారం ఇరాన్‌లో దాదాపు 5 లక్షల 23 వేల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు.

- వీరిలో ఇరాన్ సైన్యం మూడున్నర లక్షలు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్(ఐఆర్జీసీ) 1.5 లక్షల మంది సైనికులు ఉన్నారు.

- అది కాకుండా ఇరాన్ దగ్గర రివల్యూషనరీ గార్డ్స్‌లో 20 వేల నావికా దళం కూడా ఉంది.

- ఇరాన్ సైనిక శక్తిలో క్షిపణులు కీలక భాగం

- పశ్చిమాసియాలోని అన్ని దేశాల్లో ఇరాన్ క్షిపణి శక్తి చాలా ఎక్కువని అమెరికా రక్షణ శాఖ చెబుతోంది.

- ఎన్నో ఏళ్లపాటు నిషేధం ఉన్నప్పటికీ ఇరాన్ తన కోసం డ్రోన్లు తయారు చేసుకోవడంలో విజయవంతం అయ్యింది.

ఇరాన్ దాడులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)