అయోధ్య తీర్పుపై పాకిస్తాన్ స్పందన ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ భారత సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై పాకిస్తాన్‌లోని వివిధ వర్గాలు స్పందించాయి.
అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల స్థలం హిందువులకే చెందుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా శనివారం తీర్పునిచ్చింది. మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్‌బోర్డ్‌కు అయోధ్యలోనే ఒక ప్రధాన ప్రాంతంలో ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ఆదేశించింది.
ఈ తీర్పుపై భారత్‌లోని దాదాపు అన్ని వర్గాలు సానుకూలంగానే స్పందించాయి. పాకిస్తాన్ నుంచి మాత్రం దీన్ని తప్పుపడుతూ అభిప్రాయాలు వ్యక్తమమయ్యాయి.

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత మరోసారి భారత్ అతివాద ముఖం ఈ తీర్పుతో ప్రపంచానికి తేటతెల్లమైందని పాకిస్తాన్ సైన్యం అధికార ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ ట్విటర్ వేదికగా విమర్శించారు.
తమ దేశం మాత్రం ఇతరుల మతాన్ని గౌరవిస్తూ నానక్ సేవకుల కోసం కర్తార్‌పుర్ కారిడార్‌ను తెరిచిందని వ్యాఖ్యానించారు.
అయోధ్య విషయంలో భారత సుప్రీం కోర్టు తీర్పు మోదీ ప్రభుత్వ మతపక్షపాత వైఖరిని ప్రతిబింబించిందని పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ వ్యాఖ్యానించినట్లు రేడియో పాకిస్తాన్ తెలిపింది.
''కర్తార్‌పుర్ కారిడార్ ప్రారంభోత్సవం రోజునే అయోధ్యపై సుప్రీం కోర్టు ఎందుకు తీర్పును ఇచ్చింది? భారత్ లౌకికవాద ముసుగు పోయి, వాస్తవం బయటపడింది. ఇప్పటికే భారత్‌లో ముస్లింలు ఒత్తిడిలో బతుకుతున్నారు. ఈ తీర్పుతో అది మరింత పెరుగుతుంది'' అని ఆయన అన్నట్లు పేర్కొంది.
భారత్‌కు వ్యతిరేకంగా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే పాక్ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఫవాద్ హుస్సేన్ కూడా అయోధ్య తీర్పుపై స్పందించారు. ఇది చట్టవిరుద్ధం, అనైతికం, సిగ్గుచేటని అన్నారు.

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

''తీర్పు వెల్లడించడానికి వారాంతాన్నే ఎంచుకోవడం సందేహాలకు తావిస్తోంది. కర్తార్‌పుర్ కారిడార్ ఆరంభోత్సవం నుంచి దృష్టి మరల్చడానికి ఇలా చేశారా? ఈ తీర్పు చట్ట ప్రకారం ఇచ్చారా? బీజేపీ మేనిఫెస్టో ప్రకారమా?'' అని పాకిస్తాన్‌కు చెందిన సీనియర్ పాత్రికేయుడు హమీద్ మీర్ ట్వీట్ చేశారు.

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

శనివారం బాబ్రీ మసీదు, అయోధ్య తీర్పు, రామ మందిరం పాకిస్తాన్‌లో ట్విటర్ టాప్ ట్రెండ్స్‌గా ఉన్నాయి.
''పాకిస్తాన్‌లోని అహ్మదీయ వర్గానికి చెందిన మసీదును కూల్చేశారు. భారత్‌లోని బాబ్రీ మసీదు గురించి మాత్రం ఆ దేశం విచారం వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉంది. సింధ్ ప్రావిన్సులో పాకిస్తానీ హిందూ అమ్మాయిని అత్యాచారం చేసి, హత్య చేశారు. కర్తార్‌పుర్ కారిడార్‌ను భారత్‌లోని సిక్కుల కోసం తెరిచింది. ఫఖ్తుంఖ్వా సిక్కుల డిమాండ్లను మాత్రం గాలికొదిలేసింది'' అంటూ బషీర్ అహ్మద్ గ్వాఖ్ అనే పాత్రికేయుడు పాకిస్తాన్ తీరును తప్పుపట్టారు.
ఇవి కూడా చదవండి.
- కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు థ్యాంక్స్ చెప్పిన మోదీ
- అయోధ్య కేసు: పురాతత్వశాఖ సర్వేలో రామ మందిర అవశేషాలు లభించాయా?
- కేఎఫ్‌సీ ప్రపోజల్: భార్యకు ప్రపోజ్ చేసిన యువకుడు.. వీడియో వైరల్.. బహుమతుల వెల్లువ
- ఎల్కే అద్వానీ: రథయాత్ర సమయంలో ఈ బీజేపీ నేతను ఎలా అరెస్టు చేశారు?
- టిక్ టాక్ యాప్‌తో దేశ భద్రతకు ప్రమాదమా?
- అయోధ్య తీర్పు: సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనంలోని న్యాయమూర్తులు వీరే
- బెర్లిన్ వాల్ కూలిపోయి 30 ఏళ్లయ్యాక.. యూరప్ దేశాలు ఇప్పుడు అడ్డుగోడలు ఎందుకు నెలకొల్పుతున్నాయి?
- కాలాపానీని భారత్‌లో చూపించినందుకు నేపాల్‌కు కోపం ఎందుకు?
- షావొమీ 108 మెగా పిక్సెల్ కెమెరా ఫోన్: పిక్సెల్ పెరిగితే ఫొటో క్వాలిటీ పెరుగుతుందా
- 30 ఏళ్లొచ్చినా పెళ్లి చేసుకోకపోతే ఒత్తిడి తట్టుకోలేం: హారీపోటర్ నటి ఎమ్మా వాట్సన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








