''సుప్రీం బట్ నాట్ ఇన్‌ఫాలిబుల్'': అయోధ్య తీర్పుపై అసదుద్దీన్ ఒవైసీ ఏమన్నారు?

ఫొటో సోర్స్, ANI
అయోధ్యలోని వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడిన తరువాత ఈ కేసులో వాదులు, ప్రతివాదులతో దేశంలోని రాజకీయ పార్టీలు, నాయకులు, ఇతర రంగాలకు చెందిన పలువురు స్పందించారు.
సుప్రీంకోర్టు నిర్ణయాన్ని పలువురు స్వాగతించగా మరికొందరు తీర్పుపై అసంతృప్తి వ్యక్తంచేశారు.
తీర్పు అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ వరుస ట్వీట్లు చేశారు. ''దేశ అత్యున్నత న్యాయస్థానం అయోధ్యపై తన తీర్పును వెలువరించింది. ఈ తీర్పును ఒకరికి విజయం, మరొకరికి ఓటమిగా చూడరాదు. రాముణ్ని కొలిచేవారు, రహీంను కొలిచేవారు అంతా ఇప్పుడు దేశభక్తి భావనను పెంచుకోవాలి. శాంతి, సామరస్యం, ఐక్యతను కాపాడాలని దేశ ప్రజలను కోరుతున్నాను'' అంటూ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
స్నేహపూర్వక పరిష్కారం ఇది..
''సమస్య పరిష్కారానికి న్యాయ ప్రక్రియ ఎంత కీలకమో చెప్పే తీర్పు ఇది. ప్రతివాదులు తమ తమ వాదనలు వినిపించడానికి తగినంత సమయం, అవకాశం ఇచ్చారు. న్యాయ దేవాలయంలో దశాబ్దాల నాటి ఈ కేసును స్నేహపూర్వకంగా పరిష్కరించారు'' అంటూ మరో ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ తీర్పు న్యాయ ప్రక్రియపై సామాన్యులకు ఉన్న విశ్వాసాన్ని మరింత పెంచుతుందని, దేశంలో వేల సంవత్సరాలుగా ఉన్న సౌభ్రాతృత్వానికి అనుగుణంగా మన 130 కోట్ల భారతీయులకు శాంతి, సంయమనాన్ని పరిచయం చేయాలి. భారత శాంతిపూర్వక సహజీవనం అంతర్లీన భావనను పరిచయం చేయాలని మోదీ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
తీర్పును స్వాగతించిన అమిత్ షా
సుప్రీంకోర్టు తీర్పును కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వాగతించారు.
''సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ చారిత్రక తీర్పు ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ తీర్పు భారతదేశ ఐక్యత, సమగ్రత, సంస్కృతిని మరింత బలోపేతం చేస్తుంది"
"దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న శ్రీరామజన్మభూమికి సంబందించిన కేసుకు ఈ రోజు ఈ తీర్పుతో తుది రూపం ఇచ్చారు. భారత న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులందరినీ నేను అభినందిస్తున్నాను" అన్నారాయన.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
అయోధ్యలో రామ మందిరం నిర్మించాలన్నదే మా కోరిక: కాంగ్రెస్
అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించాలని కాంగ్రెస్ చెప్పింది. కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా భారత జాతీయ కాంగ్రెస్ శ్రీరాముడి ఆలయ నిర్మాణం వైపే నిలుస్తుందని చెప్పారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
సర్వోన్నతమే కానీ నిర్దుష్టం కాదు: అసదుద్దీన్ ఒవైసీ
తాజా తీర్పుపై ఏఐఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ తన ట్విటర్ ఖాతాలో ''సుప్రీం బట్ నాట్ ఇన్‌ఫాలిబుల్'' అనే పుస్తకం ముఖచిత్రాన్ని పోస్ట్ చేశారు.
సర్వోన్నత న్యాయస్థానమే అయినా తప్పు చేయనిదేమీ కాదన్న అర్థంలో ఆయన ట్వీట్ చేశారు.
రాజీవ్ ధావన్‌తో పాటు సుప్రీంకోర్టులో ముస్లింల పక్షం మాట్లాడిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ అసదుద్దీన్ ఓవైసీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. సుప్రీం తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విశ్వాసాలు వాస్తవాలపై విజయం సాధించాయని పేర్కొన్నారు.
''ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మాదిరిగా, మేము కూడా దీనిపై సంతృప్తి చెందడం లేదు. సుప్రీంకోర్టు సుప్రీం కావొచ్చు కానీ అది దోషరహితమైనది కాదని జస్టిస్ జేఎస్ వర్మ చెప్పారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చివేసిన వారితోనే ఈ రోజు ట్రస్ట్ నిర్మించి ఆలయ పనులను ప్రారంభించాలని సుప్రీంకోర్టు చెబుతోంది. మసీదు కూల్చివేయకపోతే, కోర్టు ఎలాంటి తీర్పునిచ్చేది' అని ప్రశ్నించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
ఇలాంటి తీర్పు వస్తుందనుకోలేదు: ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్
''మా అంచనాలకు విరుద్ధంగా తీర్పు వచ్చింది. మా వాదనలకు ఆధారంగా బలమైన సాక్ష్యాలు సమర్పించాం. మా న్యాయ కమిటీ ఈ తీర్పును సమీక్షిస్తుంది. కూల్చివేతకు గురైన బాబ్రీ మసీదు పునర్నిర్మాణం కోసం మా బాధ్యతను నిబద్ధతతో పూర్తిచేశాం'' అంటూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
అన్నీ మర్చిపోయి కలిసుందాం: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ తీర్పును స్వాగతిస్తూ అందరూ సంయమనం పాటించాలని కోరారు. గొడవలు-వివాదాలకు ముగింపు పలకాలని సూచించారు. గెలుపోటములుగా చూడరాదన్నారు. "మనం ఇందులో భాగస్వామ్యం అందించిన సహచరులు, బలిదానాలను గుర్తుచేసుకుందాం. సోదరభావాన్ని కాపాడేలా ప్రభుత్వ, సామాజిక స్థాయిలో జరుగుతున్న పూర్తి ప్రయత్నాలను మేం స్వాగతిస్తున్నాం, వారిని అభినందిస్తున్నాం. సంయమనంతో న్యాయం కోసం వేచిచూసిన భారత ప్రజలు అభినందనకు అర్హులు. దీనిని గెలుపు-ఓటమిగా చూడకూడదు. సంయమనంతో మీ ఆనందాన్ని వ్యక్తం చేయండి. గతంలో జరిగిన అన్ని విషయాలూ మర్చిపోయి, మనందరం శ్రీరామ జన్మభూమిలో గొప్ప ఆలయం నిర్మాణం కోసం మన కర్తవ్యం నిర్వహిద్దాం" అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
రామజన్మభూమి ఉద్యమాన్ని గుర్తు చేసుకున్న మురళీ మనోహర్ జోషి
"రామ జన్మభూమి ఉద్యమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా నాకు కూడా కొంత భాగస్వామ్యం అందించే అవకాశం లభించడం చాలా ఆనందంగా ఉంది" అని మురళీ మనోహర్ జోషి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అశోక్ సింఘల్‌కు భారత రత్న ఇవ్వాలి: సుబ్రమణ్యన్ స్వామి డిమాండ్
బీజేపీ నేత సుబ్రమణ్యన్ స్వామి తన ట్విటర్‌లో "ఈ విజయ ఘడియల్లో మనం అశోక్ సింఘల్‌ను గుర్తుచేసుకోవాలి. నరేంద్రమోదీ ప్రభుత్వం తక్షణం ఆయనకు భారత రత్న ప్రకటించాలి" అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) అందించిన పురావస్తు, చారిత్రక ఆధారాల సహాయతో అక్కడ ఒకప్పుడు భారీ ఆలయం ఉండేదని కోర్టు నిర్ధారణకు వచ్చిందని, అక్కడ మళ్లీ భారీ ఆలయాన్ని నిర్మించుకోవాలని ఏఎస్ఐ మాజీ రీజనల్ డైరెక్టర్(నార్త్ ఇండియా) కేకే మహ్మద్ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 9
తాను సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాని.. ఈ కేసులో వాదుల్లో ఒకరైన ఇక్బాల్ అన్సారీ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 10
తీర్పును గౌరవించండి.. సోదరుల్లా కలిసుండండి: ప్రియాంక గాంధీ
"అయోధ్య అంశంలో భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అన్ని పక్షాలు, సమాజాలు, పౌరులు ఈ తీర్పును గౌరవిస్తూ శతాబ్దాల నుంచీ కలిసిమెలిసి ఉండే మన సంస్కృతిని కాపాడాలి. మనందరం ఒక్కటై మన సామరస్యాన్ని, సోదరభావాన్ని బలోపేతం చేయాలి" అంటూ కాంగ్రెస్ నేత ప్రియాంకా వధేరా ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 11
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్, యోగా గురు రాందేవ్ బాబా వంటివారు తీర్పును స్వాగతించారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని నితీశ్ కుమార్ కోరగా.. గొప్ప రామమందిరాన్ని నిర్మిస్తామని.. ప్రత్యామ్నాయ స్థలంలో మసీదు నిర్మాణానికి కూడా హిందువులు సహకరించాలన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 12
ఇవి కూడా చదవండి:
- అయోధ్య కేసులో అంగీకారం కుదరలేదన్న పిటిషనర్లు
- అయోధ్య కేసులో విచారణ పూర్తి, తీర్పు రిజర్వులో ఉంచిన సుప్రీంకోర్టు
- అయోధ్య: ఇది నిజంగానే రామ జన్మస్థలమా? దీని చరిత్ర ఏమిటి?
- అయోధ్య- రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదం పూర్తి చరిత్ర
- ఇంగ్లిష్ మీడియంతో తెలుగు భాషకు ప్రమాదమా...
- బెర్లిన్ వాల్ కూలిపోయి 30 ఏళ్లయ్యాక.. యూరప్ దేశాలు ఇప్పుడు అడ్డుగోడలు ఎందుకు నెలకొల్పుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)