కేఎఫ్‌సీ ప్రపోజల్: చికెన్ తింటూ భార్యకు ప్రపోజ్ చేసిన యువకుడు.. వైరల్ అయిన వీడియో.. వెల్లువెత్తిన బహుమతులు

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణాఫ్రికాలోని ఓ కేఎఫ్‌సీ రెస్టారంట్లో యువతీయువకుల జంట ఒకటి ఫ్రైడ్ చికెన్ తింటోంది. ఇంతలోనే యువకుడు మోకాళ్లపై కూర్చుని, ఆమెకు ఉంగరాన్ని బహూకరించి 'ప్రపోజ్' చేశాడు. ఈ ప్రపోజల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కేఎఫ్‌సీ దక్షిణాఫ్రికా ఈ వీడియోను షేర్ చేసి, ఈ జంట వివరాలు తెలుసుకొనేందుకు సహకరించాలని నెటిజన్లను కోరింది.
ఈ పోస్ట్ 17 వేలసార్లకు పైగా రీట్వీట్ అయ్యింది. #KFCProposal అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవడం మొదలైంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
తర్వాత ఈ జంటను గుర్తించారు. వీరి పేర్లు- భుట్ హెక్టర్, నోన్‌హాన్‌హ్లా. ఈ జంటను గుర్తించిన తర్వాత ఈ అంశం మరో ఆసక్తికర మలుపు తీసుకుంది.
వీరి పెళ్లి ఏర్పాట్లకు సాయం చేసేందుకు చాలా మంది ముందుకొచ్చారు. పెళ్లిలో వినోద కార్యక్రమాలు, హనీమూన్ సమయంలో వసతి తాము ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ప్రముఖ గాయకుడు, గేయరచయిత జేక్స్ బాంట్వినీ ట్విటర్లో స్పందిస్తూ- పెళ్లిలో తాను ఉచితంగా ప్రదర్శన ఇస్తానన్నారు.
తర్వాత ఈ జంటకు వివిధ కంపెనీలు బహుమతులను ప్రకటించడం మొదలైంది.
"హనీమూన్ ప్రాంతాలు చాలా దూరంలో ఉంటాయి. ఈ జంటను ఆయా ప్రాంతాలకు కార్లో ఎవరైనా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ పని మేం చేస్తాం" అని ప్రఖ్యాత ఆటోమొబైల్ సంస్థ 'ఆడి' దక్షిణాఫ్రికా శాఖ ట్విటర్లో చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
భుట్ హెక్టర్, నోన్‌హాన్‌హ్లా పెళ్లి సందర్భంగా వారి అందమైన ప్రేమకథ కోసం రెండు పేజీలు కేటాయిస్తామని డీఆర్‌యూఎం పత్రిక తెలిపింది.
బీరు మొదలుకొని వంట సామాన్ల వరకు పెద్దయెత్తున బహుమతులు వస్తున్నాయి. విరాళాల రూపంలో వేల డాలర్ల ఆర్థిక సహాయాన్నీ కొందరు ఈ జంటకు ప్రకటిస్తున్నారు.
కేఎఫ్‌సీలో భుట్ హెక్టర్ ప్రపోజల్‌ను వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టిన కటేకా మలోబొలా అనే వ్యక్తి, దక్షిణాఫ్రికన్ల స్పందన చూసి హర్షం వ్యక్తంచేశారు.
ఇది నిజమైన వీడియో అని, దీనిని ఓ వాట్సప్ గ్రూప్‌లో పెట్టానని, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రామ్‌లలో అప్లోడ్ చేశానని, తర్వాత భారీ స్పందన వచ్చిందని ఆయన ఇంకో వీడియోలో చెప్పారు.
భుట్ హెక్టర్, నోన్‌హాన్‌హ్లా జంట ప్రేమకథలో మరో ఆసక్తికర అంశం ఉంది.
"2012లోనే పెళ్లయ్యింది.. కానీ..."
తమకు 2012లోనే పెళ్లయ్యిందని ఈ జంట దక్షిణాఫ్రికా వెబ్‌సైట్ 'సోవెటన్'తో చెప్పింది. కానీ అప్పట్లో భుట్ హెక్టర్ కొన్న ఉంగరాలు అతడికి సంతృప్తి కలిగించలేదని, అంతకన్నా మంచి ఉంగరం భార్యకు కొనివ్వాలనుకున్నారని ఆ జంటను ఉటంకిస్తూ సోవెటన్ తెలిపింది.
తనకు ఉద్యోగం లేదని, భార్యకు మంచి ఆభరణం కొనడానికి కావాల్సినంత డబ్బు తన వద్ద లేదని హెక్టర్ చెప్పాడు.
తమ శ్రేయోభిలాషులకు, దక్షిణాఫ్రికన్లకు ఈ జంట ధన్యవాదాలు తెలిపింది.
"దక్షిణాఫ్రికన్లకు ధన్యవాదాలు. మీ సహృదయత మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మా ప్రేమకథ మీలో చాలా మంది మనసులను తాకింది. ఇది మేమెన్నడూ ఊహించలేదు" అని ఆ జంట తమ ప్రకటనలో తెలిపింది.
ఇవి కూడా చదవండి
- అయోధ్య తీర్పు: సుప్రీంకోర్టు తీర్పులో ఐదు ముఖ్యాంశాలు
- ''సుప్రీం బట్ నాట్ ఇన్ఫాలిబుల్'': అయోధ్య తీర్పుపై అసదుద్దీన్ ఒవైసీ ఏమన్నారు?
- అయోధ్య కేసు: పురాతత్వశాఖ సర్వేలో రామ మందిర అవశేషాలు లభించాయా?
- అయోధ్య: సుప్రీంకోర్టు తీర్పు వచ్చే ముందు ఇక్కడ మూడ్ ఎలా ఉంది? - గ్రౌండ్ రిపోర్ట్
- టిక్ టాక్: ఈ చైనా సోషల్-మీడియో యాప్‌తో దేశ భద్రత ప్రమాదంలో పడుతుందా?
- రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదం పూర్తి చరిత్ర
- అయోధ్య తీర్పు: సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనంలోని న్యాయమూర్తులు వీరే
- చైనా రైతులు సరిహద్దు దాటి రష్యాలోకి ఎందుకు అడుగుపెడుతున్నారు?
- బెర్లిన్ వాల్ కూలిపోయి 30 ఏళ్లయ్యాక.. యూరప్ దేశాలు ఇప్పుడు అడ్డుగోడలు ఎందుకు నెలకొల్పుతున్నాయి?
- యూరప్: జాతీయవాదం ఎందుకు పెరుగుతోంది? ఏ దేశంలో ఎలా ఉంది?
- షావొమీ 108 మెగా పిక్సెల్ కెమెరా ఫోన్: పిక్సెల్ పెరిగితే ఫొటో క్వాలిటీ పెరుగుతుందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








