పాకిస్తాన్‌తో సన్నిహితంగా ఉండే సౌదీ అరేబియా ఇప్పుడు భారత్‌కు ఎందుకు దగ్గరవుతోంది?

ఫొటో సోర్స్, Reuters
భారత ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియాలో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. మోదీ అక్టోబర్ 28న ఆ దేశానికి పయనమయ్యారు. ఆయన 29న సౌదీ రాజు సల్మాన్‌తో భేటీ అవుతారు.
సౌదీ అరేబియా ప్రభుత్వ పెట్టుబడుల నిధి సంస్థ సావరిన్ వెల్త్ ఫండ్ నిర్వహించే ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్ ఫోరమ్‌లో మోదీ ప్రసంగించనున్నారు.
విదేశీ సంస్థాగత పెట్టుబడుల అంశంపై మోదీ ఈ పర్యటనలో సంప్రదింపులు జరపనున్నారు. రూపే కార్డు ప్రారంభం, హజ్ యాత్రికుల సంఖ్య పెంపు విషయం కూడా చర్చకు రానున్నాయి.
భారత్‌లో ఆర్థికమందగమనం సమస్యతో మోదీ సతమతమవుతుండగా, అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక క్షీణతతో సౌదీ కూడా సంక్షోభం ఎదుర్కొంటోంది.
ఈ రెండు దేశాల నాయకుల మధ్య ఎలాంటి ఒప్పందాలు కుదురుతాయా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్, సౌదీ మధ్య సంబంధాలపై మధ్య ప్రాచ్య వ్యవహారాల నిపుణుడు కమర్ ఆగా వ్యక్తి చేసిన అభిప్రాయాలు ఇవీ...

ఫొటో సోర్స్, Getty Images
వాణిజ్య సంబంధాల పరంగా భారత్, సౌదీ అరేబియాల మధ్య చాలా సాన్నిహిత్యం ఉంది. భారత్‌కు వచ్చే చమురులో 17%, ఎల్‌పీజీలో 32% సౌదీ నుంచే దిగుమతి అవుతోంది. రెండు దేశాల మధ్య వాణిజ్యం విలువ దాదాపు 2.75 వేల కోట్ల డాలర్లు.
ఇందులో కేవలం భారత్ కొనుగోలు చేసే పెట్రోలియం ఉత్పత్తుల విలువే 2.2 వేల కోట్ల డాలర్ల మేర ఉంటుంది. భారత్ ఎగుమతుల విలువ 550 కోట్ల డాలర్లు మాత్రమే.
ఈ వాణిజ్య అసమతుల్యత భారత్‌కు ఆందోళన కలిగించేదే. అయితే, సౌదీ అరేబియా భారత్‌లో 10 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాలనుకుంటోంది.
అందుకే, మోదీ పర్యటనలో చమురు, ఇంధన రంగాలకు సంబంధించిన అంశాలపై చర్చలు జరుగుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కానీ, సౌదీ ఆర్థికవ్యవస్థను కూడా ఇప్పుడు మందగమన సమస్య వేధిస్తోంది.
అందుకు కారణం చమురు ధరలు గణనీయంగా పడిపోవడమే. పైగా యెమెన్‌తో జరుగుతున్న యుద్ధం వల్ల సౌదీ ఖర్చులు పెరిగిపోయాయి.
ఇప్పటివరకూ సౌదీ ఆర్థికవ్యవస్థ చమురుపైనే ఆధారపడుతూ వచ్చింది. ఇక ఇతర రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టాలని ఆ దేశం కోరుకుంటోంది.
భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆదాయం పొందాలని సౌదీ భావిస్తోంది. స్వదేశంలోనూ చాలా మార్పులు తీసుకువస్తోంది. పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోంది. కొత్త సంస్థలను తెరుస్తోంది.
వాణిజ్య, దౌత్యపరంగానే కాకుండా సౌదీతో భారత్‌కు మరిన్ని ప్రయోజనకరమైన అంశాలు ఉన్నాయి.
సౌదీలో దాదాపు 15 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. వీరి ద్వారా భారత్‌కు కొన్ని వందల కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యం సమకూరుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
మధ్యప్రదేశ్‌లో నిర్మితమవుతున్న భారీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌కు సౌదీ, యూఏఈ భారీ సహకారం అందిస్తున్నాయి.
సౌదీ చెబుతున్న 10 వేల కోట్ల డాలర్ల పెట్టుబడుల్లో రిలయన్స్ ఎనర్జీ, బీపీసీఎల్ వంటి సంస్థలతో ఒప్పందాలు కూడా ఉన్నాయి. ఈసారి వీటిపై అంగీకారం కుదిరే అవకాశాలున్నాయి.
రక్షణ వ్యూహాల్లో భాగంగా చమురు రిజర్వులను భారత్ నిర్మిస్తోంది. దక్షిణ భారత్‌లో వీటిని ఏర్పాటు చేశారు. అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునే విధంగా మూడో రిజర్వును కూడా ఏర్పాటు చేయాలని భారత్ భావిస్తోంది. దీనికి సంబంధించి సౌదీ అరేబియా, యూఏఈ సహకారం అందించే అవకాశముంది.
మూడు నెలలపాటు చమురు దిగుమతులు ఆగిపోయినా, సమస్యలు రాకూడదన్న వ్యూహంతో భారత్ వీటిని ఏర్పాటు చేస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
సౌదీ పాత్ర ఏంటి
సౌదీ అరేబియాతో వాణిజ్య సంబంధాలు ప్రభావం చూపుతాయనడంలో సందేహం లేదు. కానీ, ఒక్క దేశం చేసే పెట్టబడులు సరిపోవు.
అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ బలహీనంగా మారింది. పాశ్చాత్య దేశాల నుంచి పెట్టుబడులు వస్తాయన్న ఆశ కూడా లేదు.
జపాన్, దక్షిణ కొరియాతో భారత్‌కు మంచి సంబంధాలున్నాయి. ఆ దేశాలు కూడా భారత్‌లో భారీ పెట్టుబడులకు ప్రణాళికలు వేసుకుంటున్నాయి. ఇప్పటికే పెట్టుబడుల్లో ఒక పెద్ద భాగం భారత్‌కు వచ్చింది కూడా. దక్షిణ కొరియా, జపాన్‌లోని భారీ కంపెనీల అనుబంధ సంస్థలు భారత్‌లో పనిచేస్తున్నాయి.
దక్షిణ, ఉత్తర భారత్‌ల మధ్యలో ఒక వాణిజ్య కారిడార్ ఏర్పాటవబోతోంది. అది సిద్ధమయ్యాక వేరే విదేశీ సంస్థలు కూడా వస్తాయి. అక్కడ స్మార్ట్ సిటీ, పారిశ్రామిక నగరం నిర్మించనున్నారు.
ఇవన్నీ ఇప్పటికి ప్రణాళికలే. భూసేకరణ, కార్మిక చట్టాల సరళీకరణ, బ్యాకింగ్ సంస్కరణలకు సంబంధించి ఇంకా చేయాల్సింది చాలా ఉంది.
ఈ ప్రణాళికలన్నింటిలో సౌదీది ముఖ్య పాత్ర.
మరోవైపు ఇరాన్ నుంచి భారత్‌కు చమురు దిగుమతులు ఆగిపోయాయి. ఇప్పుడు సౌదీ, ఇరాక్‌ల నుంచే చమురు తీసుకోవాల్సి వస్తోంది.
భారత్, సౌదీ అరేబియా సంబంధాల విషయంలో పాకిస్తాన్ అంశం కూడా చాలా ప్రధానం.
భారత్, సౌదీల రాజకీయ సంబంధాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. కశ్మీర్ విషయంలో భారత్ తీరుపై సౌదీ పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. గల్ఫ్‌లోని చాలా దేశాలు కశ్మీర్ భారత్ అంతర్గత విషయమనే స్పష్టం చేశాయి.
అంతర్జాతీయ వేదికపై గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు వ్యతిరేకతేమీ ఉండదు.
కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన తర్వాత మోదీని యూఏఈ, బహ్రెయిన్ అత్యున్నత పౌర పురస్కారాలతో సత్కరించాయి.
ఒక విధంగా గల్ఫ్ దేశాలకు సౌదీ నేతృత్వం వహిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్, సౌదీ పరస్పరం ఆధారపడటం గణనీయంగా పెరిగింది. బంధాలు బలపడుతున్నాయి. ఒకప్పుడు పాకిస్తాన్‌తో సౌదీ బాగా సన్నిహితంగా ఉండేది. రెండు దేశాల సైన్యాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే సౌదీ ఇప్పుడు భారత్‌కు చేరువవుతోంది. 2008 నుంచి ఆచరిస్తున్న 'లుక్ ఈస్ట్' విధానం కూడా ఇందుకు ఓ కారణం.
ఇరాన్‌తో ఉద్రిక్తల విషయంలో పాకిస్తాన్ తమకు బహిరంగంగా మద్దతు ఇస్తుందని సౌదీ భావించింది. యెమెన్‌తో యుద్ధంలోనూ పెద్ద పాత్ర పోషిస్తుందని ఆశించింది. కానీ, అలా జరగలేదు.
ఈ ప్రపంచకీరణ యుగంలో రాజకీయ ప్రయోజనాల కన్నా ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యం.
భారత్ దాదాపు రెండున్నర ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. అందుకే, సౌదీ ఇక్కడ లాభం పొందాలనుకుంటోంది.
ప్రస్తుతం చాలా గల్ఫ్ దేశాలు బలహీనంగా మారిపోయాయి. వాటిలో వాటికే విభేదాలున్నాయి. యెమెన్‌లో యుద్ధం ముగిసే పరిస్థితులే కనిపించడం లేదు.
ఖతార్ నుంచి సౌదీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్‌లో చీలికలున్నాయి.
భారత్, సౌదీ చర్చల్లో 'ఉగ్రవాదం' కూడా ఒక ప్రధాన అంశంగా ఉంటుంది.
'ఉగ్రవాదాని'కి వ్యతిరేకంగా ఓ అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేసి, అన్ని దేశాలతో కలిసి ఒక విధానాన్ని తేవాలని భారత్ అనుకుంటోంది.
ఈ విషయంలో సౌదీ అరేబియా, భారత్‌ల మధ్య మంచి సహకారం ఉంది. నేరస్తుల అప్పగింత కోసం భారత్ ఎప్పుడు అభ్యర్థనలు చేసినా, సౌదీ అంగీకరిస్తూ వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్లతోనూ సౌదీకి దగ్గరి సంబంధాలున్నాయి.
అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల సర్కారు రావాలని సౌదీ, పాకిస్తాన్ కోరుకుంటున్నాయి. ఆ దేశంలో లౌకిక ప్రభుత్వం ఏర్పడాలని భారత్ ఆశిస్తోంది.
భారత్, సౌదీల మధ్య భిన్నాభిప్రాయాలున్న అంశం ఇది.
ప్రస్తుత మోదీ పర్యటనలో ఇరు దేశాల మధ్య ఏయే విషయాల్లో అంగీకారాలు కుదురుతాయి, ఏయే ఒప్పందాలు ఖాయమవుతాయో చూడాలి.
రక్షణ ఒప్పందాలపైనా చర్చలు జరుగుతాయని కథనాలు వస్తున్నాయి.
(బీబీసీ ప్రతినిధి సందీప్ రాయ్‌తో కమర్ ఆగా జరిపిన సంభాషణ ఆధారంగా)
ఇవి కూడా చదవండి
- 30 ఏళ్ల కిందట సౌదీ కోట నుంచి దొంగిలించిన ఆభరణాలు ఏమయ్యాయి, ఆ దొంగ ఏమంటున్నాడు
- దిల్లీ కాలుష్యానికీ దీపావళి టపాసులకు సంబంధం ఏంటి?
- చమురు వరమా, శాపమా?.. ప్రపంచాన్ని అది ఎలా మార్చింది
- యెమెన్ యుద్ధం: వేలాది సౌదీ సైనికులను పట్టుకున్నామన్న హౌతీ తిరుగుబాటుదారులు
- సౌదీ అరేబియా: ఇక విదేశీ పర్యటకులకు సుస్వాగతం
- భారత్‌లో వ్యాపారం ఎంత ఈజీగా మారిపోయిందంటే..
- వోడ్కా, విస్కీ, వైన్, బీర్, పచ్చి గుడ్డు సొన.. ఇవన్నీ కలిపేసి నీళ్లలా తాగేస్తాడు.. చైనాలో పెరుగుతున్న మద్యం దాహానికి ఇది సంకేతమా?
- సౌదీ ప్రిన్స్: 'ఇరాన్ దూకుడుని ఆపకపోతే... చమురు ధరలు చెలరేగిపోతాయి'
- నరేంద్ర మోదీ దూకుడుకు ప్రాంతీయ పార్టీలు కళ్లెం వేయగలవా?
- సౌదీ అరేబియాలో ఇకపై పెళ్ళికాని జంటలు హోటల్లో కలిసి ఉండవచ్చు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








