"విమానం టాయిలెట్లో సీక్రెట్ కెమెరా, పైలెట్లు లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చారు"

ఫొటో సోర్స్, Getty Images
సౌత్‌వెస్ట్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఒక విమానం టాయిలెట్లోని రహస్య కెమెరాతో లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చారని ఒక సహాయకురాలు (ఫ్లైట్ అటెండెంట్) ఇద్దరు పైలెట్లపై కేసు వేసింది.
2017లో పిట్స్‌బర్గ్ నుంచి ఫొనిక్స్‌కు విమానంలో వెళ్తున్నప్పుడు దాని పైలెట్లు చేసిన ఆ పనిని గుర్తించానని సహాయకురాలు రినీ స్టీనేకర్ ఆరోపించారు.
ఆరోజు విమానం కెప్టెన్ టెర్రీ గ్రాహం టాయిలెట్‌కు వెళ్తూ తనను కాక్‌పిట్‌లో కో-పైలెట్ రియాన్ రస్సెల్‌తోపాటు కూర్చోమన్నారని, ఆ సమయంలో టాయిలెట్ దృశ్యాలు లైవ్ వస్తున్న ఒక ఐప్యాడ్ అక్కడ కనిపించిందని ఆమె తన ఫిర్యాదులో చెప్పారు.
పైలెట్లు మాత్రం తాము అలాంటిదేం చేయలేదన్నారు. "హాస్యం కోసం అలా చేయడం సరికాదు" అని విమాన సంస్థ కూడా చెప్పింది.
ఆరోజు రస్సెల్ తనతో "ఆ కెమెరా గురించి ఎవరికీ చెప్పొద్దు, 'టాప్-సీక్రెట్ సెక్యూరిటీ' కోసం దాన్ని ఏర్పాటు చేశాం" అని చెప్పారని స్టీనేకర్ ఆరోపించారు.
ఈ విషయం గురించి ఆమె విమాన సంస్థకు చెబితే, "జరిగిన దాని గురించి ఎవరితోనూ చెప్పకు" అని సూపర్‌వైజర్ తనను ఆదేశించారని ఆమె ఆరోపించారు.
ఈ కేసులో వివరాల ప్రకారం ఆ పైలెట్లు సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ నియమించినవారు కాదు. ఆ సంస్థ తమ కోసం వాణిజ్య విమానాలను నడుపుతోంది.
"పిటిషనర్ ఆరోపణలు చూస్తుంటే వారి ప్రవర్తన దారుణంగా ఉందని తెలుస్తోంది" అని స్టీనేకర్ లాయర్ రొనాల్డ్ గోల్డ్‌మాన్ బీబీసీకి చెప్పారు.
విమాన సంస్థ, పైలెట్ల స్పందన
దీనిపై ఒక ప్రకటన విడుదల చేసిన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ "మా విమానాల్లోని లావెట్రీల్లో కెమెరాలు పెట్టలేదు" అని చెప్పింది.
మొదట ఈ కేసు గురించి మాట్లాడని అమెరికా విమాన సంస్థ, తర్వాత విడుదల చేసిన ప్రకటనలో... "ఆరోపణలపై మేం విచారణ చేశాం. విమానం టాయిలెట్లో కెమెరాలు లేవని గుర్తించాం" అని చెప్పింది.
"రెండేళ్ల క్రితం ఈ ఘటన జరిగినపుడు మేము ఆమె ఆరోపణలపై విచారణ చేపట్టాం. ఆ రోజు ఉన్న వారితో మాట్లాడాం. మా విచారణలో అక్కడ లావెట్రీలో ఎలాంటి కెమెరాలూ లేవని తేలింది. హాస్యం కోసం అలాంటి ప్రయత్నాలు చేయడం సరికాదు. అలాంటి వాటిని సంస్థ క్షమించదు" అని చెప్పింది.
దీనిపై లిఖితపూర్వకంగా స్పందించిన పైలెట్ల తరఫు లాయర్... "పైలెట్లు రస్సెల్, గ్రాహం కాక్‌పిట్‌లో ఐపాడ్ ఉందని అంగీకరించారు. కానీ మిగతా ఆరోపణలు తోసిపుచ్చారు" అని తెలిపారని సీఎన్ఎన్ కథనం చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
కేసులో ఆరోపణలు ఏమిటి?
2017 ఫిబ్రవరి 27న విమానంలో దాదాపు 2 గంటల సమయంలో పైలెట్ గ్రాహం తను టాయిలెట్‌కు వెళ్తూ, స్టీనేకర్‌ను కాక్‌పిట్‌లో కోపైలెట్ పక్కన కూర్చోమన్నారు.
సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ పాలసీ ప్రకారం కాక్‌పిట్‌లో ఎప్పుడూ ఇద్దరు సిబ్బంది ఉండడం అవసరం.
రస్సెల్ బెదిరిపోయిన ముఖంతో కెమెరాలో 'లైవ్ స్ట్రీమింగ్' జరుగుతోందని అంగీకరించాడు.
టాప్ సీక్రెట్ సెక్యూరిటీ కోసం అన్ని 737-800 విమానాల్లో కెమెరాలు అమర్చారని రస్సెల్ ఫ్లైట్ సహాయకురాలికి చెప్పారు.
రస్సెల్ చెప్పింది విని సందేహించిన స్టీనేకర్ తన ఫోన్‌తో ఐప్యాడ్‌ను ఫొటో కూడా తీశారు.
స్టీనేకర్ విమాన సంస్థకు దీనిపై ఫిర్యాదు చేసినపుడు, సూపర్‌వైజర్ "ఈ విషయం ఎవరితోనూ చెప్పవద్దు. ఇది బయటకు తెలిస్తే, ఒక్కరు కూడా ఇంకోసారి మన విమానంలో ఎక్కరు" అన్నారు.
సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్, దాని పైలెట్ల వల్ల తనకు జరిగిన నష్టానికి కనీసం 50 వేల డాలర్లు చెల్లించాలని ఆమె తన పిటిషన్‌లో చెప్పారు.
"పైలెట్లు దారుణమైన ప్రవర్తనతో నా పిటిషనర్‌కు చాలా నష్టం కలిగించారు, దానివల్ల ఆమె తీవ్రమైన మానసిక క్షోభకు గురైంది" అని ఆమె లాయర్ గోల్డ్‌మాన్ చెప్పారు.
అరిజోనా, మరికోపా కంట్రీలో స్టీనేకర్ కేసు నమోదు చేశారు. కానీ దానిని అరిజోనాలోని జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. దీనిపై ఇంకా విచారణ జరగలేదు.
ఇవి కూడా చదవండి:
- నీళ్లు, టాయిలెట్ పేపర్, మొక్కజొన్న పొత్తు... బాత్రూమ్లో ఒక్కో దేశానిది ఒక్కో అలవాటు
- మీ ఇంట్లో అత్యంత మురికైనది ఏమిటో మీకు తెలుసా...
- ఎడమ చేతి అలవాటుకు కారణమేంటి?
- జపాన్ కాకులు కనిపెట్టిన రహస్యమేంటి? నగర జీవనానికి జంతువులు, పక్షులు ఎలా అలవాటుపడుతున్నాయి?
- డేటింగ్ యాప్స్ వాడే వాళ్లు అందం కోసం ఏం చేస్తున్నారో ఊహించగలరా
- తిర్హుత్ ప్రైవేటు రైల్వే: గాంధీ కోసం మూడో తరగతి బోగీలో టాయిలెట్, నెహ్రూ కోసం 'ప్యాలెస్ ఆన్ వీల్స్'
- కేకులు, బన్నులు తింటే కేన్సర్ వస్తుందా?
- నెయిల్ ఎక్స్టెన్షన్: గోళ్లను అతికించుకోవడం ఇప్పుడో ట్రెండ్
- హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్‌కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి?
- గుజరాత్: బ్రెజిల్‌కు ఆనాడు ఆవుల్ని, ఎద్దుల్ని ఇచ్చి.. ఇప్పుడు వీర్యం అడుగుతోంది
- ఇస్లామిక్ యోగా: యోగా క్లాసుల్లో అల్లా ప్రార్థనలు చేస్తున్న గుజరాత్ ముస్లిం మహిళలు
- మోదీ వల్ల పాకిస్తాన్లో కశ్మీర్‌పై చర్చ స్వరూపమే మారిపోయిందా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









