మోదీ, ఇమ్రాన్ ఖాన్‌లను ఒకే ప్రశ్న అడిగిన ట్రంప్... ‘మీకు ఇలాంటి రిపోర్టర్స్ ఎక్కడ దొరుకుతారు?’

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఆ దేశ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు.
మంగళవారం ద్వైపాక్షిక అంశాలపై చర్చల తర్వాత ట్రంప్, మోదీ ఇద్దరూ కలసి పాత్రికేయులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఓ భారతీయ పాత్రికేయుడు ట్రంప్‌ను కొన్ని ప్రశ్నలు అడిగారు. వీటికి ఆ పాత్రికేయుడిని సరదాగా ఆటపట్టిస్తూ ట్రంప్ ఇచ్చిన జవాబుపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది.
అంతకుముందు సోమవారం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి పాల్గొన్న పాత్రికేయ సమావేశంలోనూ ట్రంప్ అదే రీతిలో స్పందించారు.
అప్పుడు ఆ విషయం గురించి కొందరు భారతీయ నెటిజన్లు సోషల్ మీడియాలో పాకిస్తానీలను ట్రోల్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మంగళవారం భారత పాత్రికేయుడితోనూ ట్రంప్ అదే తీరుతో వ్యవహరించడంతో కొందరు పాకిస్తానీ నెటిజన్లు దీన్ని ట్రోల్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అయితే, ఇందులో పాకిస్తానీలు సంబరపడిపోయే విషయమేమీ లేదని కొందరు భారతీయులు స్పందించారు.
ఇదీ ఆ సంభాషణ
భారత పాత్రికేయుడు: అల్-ఖైదాకు పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ శిక్షణ ఇచ్చిందని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకున్నారు. మీరు దీన్ని ఎలా చూస్తున్నారు?
ట్రంప్: నేను అలాంటిదేమీ వినలేదు.
పాత్రికేయుడు: ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు మీ వద్ద ప్రణాళిక ఏమైనా ఉందా?
ట్రంప్: కశ్మీర్ అంశంలో ఓ పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తాం. మనమందరం అదే కోరుకుంటున్నాం.
పాత్రికేయుడు: కానీ, ఉగ్రవాదం పెద్ద అంశం కాదా? పాకిస్తాన్ ప్రభుత్వం పోషిస్తున్న ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ప్రణాళిక ఏదైనా ఉందా?
ట్రంప్ (మోదీ వైపు చూస్తూ): మీ దగ్గర మంచి పాత్రికేయులు ఉన్నారు. మా దగ్గర కూడా ఇలా ఉంటే బాగుండేది. మీకు ఇలాంటివారు ఎక్కడ దొరుకుతారు. (పాత్రికేయుడి వైపు తిరిగి) సమస్యలన్నీ తీర్చడానికి మీకు గొప్ప ప్రధాని ఉన్నారు. నాకు ఇందులో ఎలాంటి సందేహమూ లేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
పాకిస్తాన్ పాత్రికేయులతో..
అంతకుముందు సోమవారం ఇమ్రాన్ ఖాన్ సమక్షంలో.. కశ్మీర్‌పై ఐరాస తీర్మానాలను భారత్ పాటించడం లేదని ఆరోపిస్తూ పాకిస్తానీ రిపోర్టర్ ట్రంప్‌ను ప్రశ్న అడిగారు.
ట్రంప్ (ఇమ్రాన్ వైపు తిరిగి): ఈ రిపోర్టర్ నాకు నచ్చారు. (రిపోర్టర్ వైపు చూస్తూ) మీరు ఇమ్రాన్ బృందంలో సభ్యులా?
రిపోర్టర్: లేదు. నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్‌ను.
ట్రంప్: మీది ప్రశ్నలా లేదు. ఒక వ్యాఖ్య చేసినట్లుగా ఉంది.
దీని తర్వాత, కశ్మీర్ 50 రోజుల నుంచి దిగ్బంధంలో ఉందని, మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయని మరొక పాత్రికేయుడు ట్రంప్ వద్ద ప్రస్తావించారు. కశ్మీర్ ప్రజల కోసం ఏం చేస్తారని అడిగారు.
ట్రంప్ (మళ్లీ ఇమ్రాన్‌తో): ఇలాంటి రిపోర్టర్స్‌ను మీరు ఎక్కడ వెతికిపట్టుకుంటారు. వీళ్లు భలే ఉన్నారే.

ఫొటో సోర్స్, Reuters
అమెరికన్ ప్రెస్‌తో వాగ్వాదాలు..
అమెరికన్ పాత్రికేయులతో ట్రంప్ చాలా సార్లు దురుసుగా వ్యవహరించారు.
కొన్ని మీడియా సంస్థలను, కొందరు పాత్రికేయులను బహిరంగంగానే ఆయన తిట్టిపోశారు. వాళ్లంతా అసత్య కథనాలు ప్రచారం చేస్తూ ఉంటారని ఆరోపించారు.
పాత్రికేయులను ప్రశ్నలను అడగకుండా ట్రంప్ మధ్యలోనే అడ్డుకున్న సందర్భాలూ ఉన్నాయి.
బీబీసీ, సీఎన్ఎన్ పాత్రికేయులు కూడా ఈ అనుభవం ఎదుర్కొన్నవారిలో ఉన్నారు.
2018లో ఓసారి ఆయన 'మీడియా ప్రజలకు శత్రువని' కూడా వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- ట్రంప్ చేతులు కట్టుకున్న ఈ ఫొటో చెబుతున్న కథేంటంటే..
- బ్యాంకు ఖాతాలో 90 లక్షలు వచ్చాయి... డ్రా చేశారు, ఖర్చుపెట్టేశారు... ఆ తర్వాత ఏం జరిగింది?
- 'మా అమ్మను, తోబుట్టువులను నా ముందే చంపేశారు.. చనిపోయినట్లు నటించి నేను బయటపడ్డా'
- కశ్మీర్లో ఒక్కసారే పర్యటించిన గాంధీ.. అప్పుడు ఆయన ఏమన్నారు?
- బక్కచిక్కిన ఏనుగుతో ఉత్సవాల్లో బలవంతపు ఊరేగింపు, ఏనుగు మృతి
- ఏరియా 51: 'గ్రహాంతరవాసులను' చూడ్డానికి ఎంతమంది వచ్చారు? వచ్చినవారికి ఏమైంది?
- కళ్లు కనిపించవు, చెవులు వినిపించవు... అయినా 130కి పైగా దేశాలు చుట్టేశారు ఈయన
- పాకిస్తాన్ నుంచి పారిపోయిన గులాలాయీ ఎవరు, ఆమె ఎందుకు అమెరికా చేరారు
- సౌదీలో డ్రోన్ దాడులు: అమెరికా చమురును భూగర్భంలో ఎందుకు దాచిపెడుతోంది?
- గర్ల్‌ఫ్రెండ్‌కు నీటి లోపల ప్రపోజ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన అమెరికన్
- గాడిద పాలతో చేస్తారు.. కేజీ రూ.78 వేలు.. తినడానికి విదేశాల నుంచి వస్తారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








